వీరాజీయం

కెప్టెన్సీకి ‘మాజీ’.. ఆడటానికి రాజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడేవాళ్లకే కాదు, ఆడించే క్యాప్టన్లకే కాదు- క్రి కెట్ ప్రియులందరికీ ‘స్వప్నసుందరుడే’- క్రికెట్ మహేంద్ర సింగ్‌గా సార్థక నామధేయుడయిన ధోనీ. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో ‘నేనాడతా’నంటూ ప్రకటించాడు. మెరుపు వేగంతో స్టంపింగ్ చేయడం ఈ జార్ఖండ్ వీరుడికి అలవాటే. నాగపూర్‌లోని ఒక హోటల్ గదిలో కూర్చుని- బయట ఓ నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్‌ని కూడా నిలబెట్టాడు కాపలాగా. తన నిర్ణయాన్ని బోర్డు అధికారులకి చెప్పేసి- తన రాష్ట్ర రంజీ క్రికెట్ టీముని వెంటేసుకుని- ‘డిన్నర్’ ఆరగించాడు.
‘మిస్టర్ కూల్’గా నిమ్మకు నీరెత్తినట్లుండే మహేంద్ర సింగ్ ధోనీ మూడురకాల క్రికెట్ ఆటలలోనూ ‘జెగజ్జెట్టీ’గా రాణించాడు. మూడు ప్రపంచ ‘కప్’లను దేశానికి అందించాడు. అనితర సాధ్యమైన ఈ రికార్డుల వీరుడు- ‘సారధ్య పగ్గాలను కుర్రాడు విరాట్ కొహ్లీకి అందించే టైము వచ్చేసింది’ అంటూ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ ‘రథాని’కి కూడా సారధిగా దిగిపోయాడు. ఆ వెంటనే, విరాట్ ట్వీట్ చేస్తూ- ‘్ధనీయే నాకు ఎల్లవేళలా క్యాప్టెన్’ అంటూ, ‘మీ ప్రేరణకి నా ధన్యవాదాలు’ అన్నాడు కూడా. ధోనీతో వున్న తన ఫొటోని జోడించాడు. ధోనీని క్రికెట్ చరిత్ర సదా జ్ఞాపకం వుంచుకుంటుంది అంటున్నారెందరో.
దానికితోడు ఈ పరిణామాలు ఇండియన్ క్రికెట్‌కి బంగారు భవిష్యత్‌ని సూచిస్తున్నాయ్. ‘వికెట్ కీపర్‌గా, దూకుడుగల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మాన్‌గా రాణించిన మహేంద్రుని జెబ్బల్లో యింకా చాలా సత్తువ, సత్తా వున్నాయి..’ అన్నది జనవాక్యం.
‘రాజు లాగా ఆడాడు.. మహరాజులాగా నిష్క్రమించాడు’- అన్నది షాక్ నుంచి తేరుకున్న క్రికెట్ రంగం. ఈపాటికే ధోనీ మహోన్నతమైన రికార్డులు అందరి నోటా నలుగుతున్నాయి. చర్విత చర్వణంగా ఇక్కడ ఉటంకించనక్కరలేదు గాని, అతని నిర్ణయంతో ఒక ‘శకం’ ముగిసింది అని చెప్పాలి.
ఐతే- ‘ఆడుతా చక్కగాన’ని అతను తీసుకున్న నిర్ణయాన్ని శ్లాఘిస్తూ యిక్కడ కొన్ని ఘనతల్ని పేర్కొనాలి. ధోనీ ‘కీర్తిమాన్’ల కన్నా అతని ‘్ధరణి’, అతని మొహంలోని ‘కాంతి’, అతని పెదాల మధ్య వంకరగా రాణించే ‘మందహాసం’- ఇవే అతణ్ని ఎక్కువగా చరిత్రలో నిలబెడతాయి.
నిరాఘాటంగా తన బ్యాట్‌తో 18 టెస్ట్‌మ్యాచ్‌లని గెల్చిన ఈ కుర్రాడిని- ‘యువతరానికి మార్గదర్శకుడివి’- అంటూ ధోనీ రిటైరుమెంటు మీద స్పందించడం- ఇండియన్ వర్తమాన క్రికెట్‌లో ఒక మధుర ఘట్టం!
ఈర్ష్యాసూయలకు అతీతంగా, అజేయంగా- తన క్యాప్టెన్సీ ప్రస్థానాన్ని సంపూర్ణం చేయడం- మహేంద్రుని ‘లాస్ట్ హెలికాప్టర్ షాట్’ యాజ్ క్యాప్టన్’. ఇండియాకి మూడురకాల క్రికెట్‌లలోనూ- 331 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ధోనీది అరుదైన రికార్డు. భారత ఉపఖండంలోనే వందకన్నా ఎక్కువ అంతర్జాతీయ ‘ఏకదివసీయ’ క్రికెట్ పోటీలను తన ఖాతాలో వేసుకున్న క్రికెటర్ మరొకడు లేడు.
అల్లన్ బార్డర్, రికీ పాంటింగ్‌ల సరసన అతనికి పెద్దపీట లభించింది. అంతేకాదు ఇరవై - ‘ఇరవై లిమిటెడ్ ఓవర్స్’ క్రికెట్‌లో యాభైసార్లు క్యాప్టెన్‌గా భాసించిన మరో క్రికెటర్ కూడా లేడు.
మొట్టమొదటి ట్వంటీ 20 ప్రపంచ కప్‌ని తెచ్చిన యోధుడు మహేంద్రుడేనని జ్ఞాపకం చెయ్యనక్కరలేదు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌ని- ‘‘అబ్బే! బడి పిల్లకాయల ఆట అది’’- అని వేళాకోళం చేసిన వాళ్లందరినీ ఆట మీద వ్యామోహంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవాళ్లల్లాగా చేసినది మహేంద్రుడే!
ప్రత్యర్థి జట్ల క్యాప్టెన్లు సైతం ధోనీని ఆదర్శ క్రీడాకారునిగా తీసుకుంటున్నారు. ‘్ధనీయే ప్రపంచ అత్యుత్తమ ఓ.డి.ఐ. క్యాప్టెన్’- అన్నాడు ఇంగ్లాండ్ క్యాప్టెన్ నాజర్ హుస్సెయిన్. 199సార్లు ఓ.డి.ఐ పోటీలకు సారధ్యం వహించిన ధోనీ మరొక్కటి చేస్తే 200- పూర్తిఅవుతుందని తెలిసినా కక్కుర్తి పడలేదు. ‘తనకన్నా తన దేశం మిన్న’ అన్నదే అతని భావన-
‘ఈ ఛాంపియన్ ట్రోఫీ వీరుడు ఎప్పటికీ ఎప్పటికీ తిరుగులేని క్రికెట్ మహేంద్రుడే’ అని కీర్తిపబడుతూ వుంటాడు. కూల్‌గా ‘క్యాప్టెన్ కేప్‌ని చిలక్కొయ్యకి తగిలించేశాడు. ద్రావిడ్, కుంబ్లేల చేతుల నుంచి ఆ వరుసలో తాను అందుకున్న బాధ్యతల్ని ‘‘ఔరా!’అని అనిపించుకుని, నిభాయించిన మహేంద్రసింగ్ ధోనీ లోగడ రెండేళ్ల క్రితం అమెరికాలో ఆడిన రెండు ఎగ్జిబిషన్ క్రికెట్ పోటీల తర్వాతనే- ‘గుడ్‌బై’ చెప్పాలనుకున్నాడు కానీ, క్రికెట్ అదృష్టం- విరాట్ కొహ్లీ అనే చాకులాంటి కుర్రాడు- రీప్లేస్‌మెంట్‌గా వచ్చేదాకా ఆగాడు. ‘ఇక చాలు వారసుడొచ్చాడు సరే..’ అని రవిశాస్ర్తీ అన్న మాటలతో అంతా ఏకీభవిస్తారు.
‘సునీల్ మనోహర్ గావస్కర్, కపిల్‌దేవ్ నిఖింజ్, సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీలను ఒకే కోవలో పెట్టాలి.’ అన్నాడు అతను.
‘‘ఔను..! అందుకే బి.సి.సి.ఐ వెంటనే ఒక వీడియో ధోనీనీ, అతని హెలికాప్టర్ షాట్స్‌నీ, మెరుపు రన్ ఔట్స్‌నీ, అన్నింటినీ గుదిగుచ్చి- పుష్పగుచ్ఛంగా చేసి విడుదల చేసింది. అవును! 28 సంవత్సరాల తర్వాత- ప్రపంచ కప్‌ని- దేశమాతకు కానుకగా సమర్పించిన వాడెవడు? మహేంద్రుడే! ఇప్పటికీ ఈ ‘జులపాల వీరుడు’ వరల్డ్ కప్‌లో-2011 ఫైనల్స్‌లో కొట్టిన పరమాద్భుతమైన ‘సిక్సర్’ షాట్‌ని మెచ్చుకుంటూ- ‘నేను చనిపోయేముందు- అంతిమ క్షణాల్లో- ఈ షాట్‌ని చూడాలని కోరుకుంటాను’- అన్నది మరెవరో కాదు- లెజెండ్ సునీల్ మనోహర్ గావస్కర్! ఇంకా ఏమన్నాడో తెలుసా..? ‘ఒకవేళ ధోనీ యింకా ఆడటానికి సంసిద్ధుడు కాకపోతే, నేను అతని ఇంటిముందు ధర్నాచేసి ఒప్పిస్తాను’ అని. ఎందరికో గర్వకారణమైన గావస్కర్ ధోనీని చూసి మురిసిపోతాడు. ‘తప్పకుండా టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చెయ్యాలి’- అన్నాడు. కపిల్‌దేవ్- ‘్ధనీ నా హీరో’- అన్నాడు. మాజీ కోచ్ గ్యారీ క్రిస్టన్- మహేంద్రుని మీద ప్రశంసల జల్లులు కురిపిస్తూ- ‘అతను నా పక్కనుంటే నేనే యుద్ధానికయినా ‘సై’ అన్నాడు - వాహ్!
ధోనీ మైదానం మీద సహచరులకు ఎప్పుడూ- జోకులు వేస్తూనే- చురకలు అంటించేవాడు. ‘కూల్’గా, ‘హాట్ హాట్’ కామెంట్స్‌తో సహచరుల్ని హెచ్చరించేవాడు. అలా పనె్నండేళ్లు ఈ క్రికెట్ యోధుడు రాజ్యం ఏలుకున్నాడు. ఎనిమిదిసార్లు- ఐ.సి.సి.- ఓ.డి.ఐ. టీముల్లో ఎంపికయినాడు. ఆసియా కప్ కూడా సాధించాడు. టెస్ట్‌లలో, ఓ.డి.ఐ.లలో ట్వంటీ 20లలోకి ఐ.పి.ఎల్. పోటీలలో తిరుగులేని శక్తిగా రాణిస్తూ- ఇంకా మధ్యాహ్న మార్తాండుడిలాగా ప్రకాశిస్తూనే- ‘నాయకత్వం ఇక చాలు..’ అన్నాడు.. గ్రేట్! ఐతే, ధోనీ తన బ్యాట్‌నీ, వికెట్ కీపర్ గ్లవ్స్‌నీ చిలక్కొయ్యకి తగిలించలేదు.. సంతోషం అందరికీ ఇప్పుడు.
‘దేరీజ్ మచ్ మోర్ ఆఫ్ హిజ్ పవర్!’
*