వీరాజీయం

మన క్రికెట్‌దే హవా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్లుగా క్రికెట్ క్రీడలో ‘విరాట్ కొహ్లీ బ్యాటింగ్‌దే హవా!’ జయభేరి మోగిస్తూ, తిరుగులేని ‘బ్యాటింగ్ కింగ్’గా మనవాడు నిలిచాడు. అది ‘టెస్ట్ మ్యాచ్’ అయినా ‘వన్ డే’ లేదా ‘ఇరవై-ఇరవై’ పోటీ అయినా అతని బ్యాట్ మెరుపులు మెరిపించింది. ఇప్పుడు ఇండియాకి ఆస్ట్రేలియా మీద చరిత్రాత్మక గెలుపు-34 సంవత్సరాల తర్వాత- కళ్లు జిగేల్ మనిపించే మెరుపులాగ ప్రసాదించిన 2018 సంవత్సరం- వివాదగ్రస్తుడయిన ఇండియన్ కెప్టెన్‌కి తిరుగులేని ‘నెంబర్ వన్’ స్థానాన్ని ప్రసాదించింది.
ప్రత్యర్థుల మీద బ్యాట్‌తోనే గాక, నోటితో కూడా ‘కస్సున’ కలియబడిపోయినా, వర్తమాన క్రికెట్‌లో కొహ్లీ పుణ్యమాని- ఇండియన్ క్రికెట్‌దే ‘హవా’గా చెలరేగుతోంది. విరాట్ 2018లో మొత్తం పదమూడు సెంచరీలు చేశాడు. అమితవేగంగా సాధించిన ఆ పరుగుల్లో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు వున్నాయి.
మూడేళ్లుగా- ‘నేనే మొనగాణ్ని’ అన్నట్లు ఐ.సి.సి. టెస్ట్ ర్యాకింగ్‌ల్లో కింగ్- ‘నెంబర్ వన్’గా రాణిస్తున్న విరాట్ కొహ్లీకి మరోవైపు నోటి దురుసుతనం ఎక్కువే! ఫీల్డులో దూకుడూ ఎక్కువే. వివాదగ్రస్తుడే అయినా- అతనికి 2018 చాలా గొప్పగా అచ్చొచ్చింది. రికార్డుల మీద రికార్డులు అతనికి ‘్భజకీర్తులై’ రాణిస్తున్నాయి. ఇది మనకి ‘క్రికెట్ నామ సంవత్సరమా?’ అన్నట్లుగా, ఇండియా - మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా జట్టుని పచ్చడి చేసి మరీ బోర్డర్-గవాస్కర్ కప్పుకి దగ్గిరగా చేరి యిప్పుడు నాలుగో టెస్ట్ ఆడుతున్నది. ‘రెండూ- ఒకటి’ ఆధిక్యంతో వున్న విరాట్ బృందానికి ఇంకొక్క గెలుపు దక్కితే- ‘కప్పు’- ఫుల్‌గా మనకి లభిస్తుంది. లేదా ‘సిరీస్ సమం’ అయితే - ఆర్నెళ్లు కప్పు మనదగ్గరే వుంటుంది- ఓటమి భయం లేదు.
చిత్రం ఏమిటీ అంటే, రుూ కప్పు ఎవ్వరి పేర స్థాపితమై రాణిస్తున్నదో- ఆ లెజెండ్స్ ఈ ఆటని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. అన్నింటినీ మించి- మన ఉపఖండానికి క్రికెట్ వ్యామోహం లేదా అదంటే ‘వేలం వెఱ్ఱి’ అన్న మాటను కూడా 2018 రుజువు చేసింది మరోసారి.
బంగ్లాదేశ్‌లో 2018 మళ్లీ హసీనా చేతిలోనే- నువ్వేనమ్మా అందరికన్నా ‘హసీనా’ని (అందగత్తె) అన్నట్లు ప్రభుత్వ పగ్గాలు పెట్టేస్తే- జనాలు ఆ గెలుపులో ‘క్రికెటర్ మోర్తాజా’కొక రికార్డు విజయం వుంది. బంగ్లాదేశ్ వన్ డే టీమ్ కెప్టెన్ ముషారఫ్ మోర్తాజా తనకి సీటు యిచ్చిన అవామీ లీగ్‌కి, బండ మెజారిటీ (రెండు లక్షల డెబ్బయి నాలుగు వేల ఓట్లు)తో గెల్చి- ఉపఖండంలోని క్రికెట్ ప్రభావాన్ని రుజువుచేశాడు.
కేవలం క్రికెట్ ఆట పేరుప్రఖ్యాతుల మీదనే ఇమ్రాన్ ఖాన్- మన శత్రు దేశం పాకిస్తాన్‌కి ప్రధానమంత్రి అయినాడు. ప్రధాని నరేంద్ర మోదీ గారి మహోన్నత అధికార పక్షం భాజపాకూడా- ‘రేపు 2019లో పార్లమెంట్‌లో మిమ్మల్ని కూర్చోబెడతాం రండ’ని క్రికెటర్లకి కన్నుగీటుతోంది...
మన దేశంలో ఐ.పి.ఎల్. అనే ఎండాకాలం క్రికెట్ జాతరకు మొత్తం హోల్ వరల్డ్ క్రికెట్‌కి ‘‘్ఫదా’’! ఇంతకాలం సౌరభ్ గంగూలీ పేరిట వున్న రికార్డుని (17 విజయాలు) కూడా యిప్పుడు సమం చేసి, దాన్ని దాటబోతున్నాడు మన దూకుడు దురుసు మాస్టర్ విరాట్. విదేశీ గెడ్డమీద లోగడ మన ‘చొక్కా వీరుడు’ సౌరభ్ గంగూలీ మహాశయుడు పదిహేడు విజయాలు సాధించాడు. ఆ ‘చొక్కా’ని - యిప్పుడు చాలారకాలుగా విరాట్ కొహ్లీ లాక్కుంటున్నాడు. అంతటి దూకుడు మనవాడికే వుంది. విదేశీ గడ్డమీద మాత్రం ‘పిల్లులు’.. పెరట్లో ‘పిచ్’ల మీద ‘పులులు’అన్న అపవాదును మన క్రికెట్ టీము చెరిపేస్తోంది. 2016లో 2,595; ఆనక 2017లో 2,818; 2018లో 2,653 ‘రన్స్’ జేగీయమానంగా చేసిన విరాట్ ఒక్కడే మన విజయపరంపరకి కారణం కాదు. మన ఫాస్ట్ బౌలింగ్ ‘రాటు’ దేలింది. కపిల్ దేవ్ మన ఫాస్ట్ మీడియమ్ బౌలర్‌గా తొలి వరల్డ్ కప్ విజేతగా- ఆల్ రౌండర్‌గా ఖ్యాతిగాంచినా నాటి మన ‘‘స్పీడు’’ మాస్టర్లు అంతా- ‘ ఫాస్ట్ మీడియా’ అన్న లేబిల్ తగిలించుకున్న వాళ్లే! గానీ, యివాళ మన ఇషాంత్, షమీ, బుమ్రా, యాదవ్ లాంటి అనుభవజ్ఞులు బంతి విసిరితే ప్రత్యర్థి జట్టు వీరుల పాదాల కింద భూమి కంపిస్తోంది. ముఖ్యంగా, అందరిలోకీ కుర్రాడు జస్‌ప్రీత్ బుమ్రా- రానురానూ టెస్ట్ మ్యాచ్‌ల్లో కూడా ఆడి మొనగాడిననిపించుకున్నాడు. ‘‘బూమ్... బూమ్... బుమ్రా- గా యార్కర్ బంతుల సుడిగాలి లాగా రాణిస్తూన్న రుూ పైలాపచ్చీస్ బంతివీరుడు- మొన్నటి ‘బాక్సింగ్ డే’- క్రికెట్‌లో బంతులు కాదు- పిడుగులు కురిపించాడు. మన అశ్విన్‌కి దెబ్బతగలటంతో వాళ్ల ‘నాధన్‌లైన్’ సింహంలా విజృంభిస్తూ- మొత్తం 3 టెస్టులకీ 17 వికెట్లు లాక్కుంటే- ‘‘ఆగు బ్రదర్! నా వికెట్లు కూడా లెక్కెట్టుకో’’- అన్నట్లు జస్‌ప్రీత్ బుమ్రా ఏకంగా 20 వికెట్లు లాగేసి, వరల్డ్ రికార్డుని జేబులో వేసుకున్నాడు.
కపిల్ దేవుడే అన్నాడు- ‘‘ఓరి పిడుగా! నువ్వు నా అంచనాల్నే తిప్పి కొట్టేశావు’’- అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. అలనాటి ‘కపిల్ డెవిల్’.
బుమ్రా 3 రకాల క్రికెట్‌లలోను యిక మీదట ‘మస్ట్’ అయినాడు. ఎన్నడో 2004లో రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ- పాక్, బంగ్లాదేశ్ గడ్డలపై ఘన విజయాలు సాధించారు. ఆనక 2010లో వీరేంద్ర సెహవాగ్, ఎమ్మెస్ ధోనీల నాయకత్వంలో మన జట్టు ఒకే ఏడాది సీమాంతర విజయాలు నాలుగింటిని సాధించింది. అంతే... తర్వాత ఖ్యాతి- క్రెడిట్ యిప్పుడు- 2018 మన క్రికెట్ వీరులదే! దక్షిణాఫ్రికానీ, ఇంగ్లండ్‌నీ వోడించి, యిప్పుడు ఆస్ట్రేలియాని మూడు సముద్రాల నీళ్లు తాగించిమరీ వోడిస్తున్నారు అనిపిస్తోంది. విదేశీ గడ్డమీద, యింకా మూడునెలల పాటు మనవాళ్లు క్రికెట్ ఆడవలసి వుంది. ఈ ‘‘ఊపూ’, ఈ ‘‘దూకుడూ’’ ఇలాగే కొనసాగాలి. ప్రపంచకప్‌ను మనం ఈ ‘వేడి’తో సాధించాలి.
లెట్ పీపుల్ సే.. ఇండియా దటీజ్ క్రికెట్!

92900 99512