వీరాజీయం

జయహో! వైమానిక దళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధీనరేఖ అంటే ఎల్.ఒ.సి నుంచి పాకిస్తాన్ ఆక్రమించుకున్న మన భూభాగంలో యాభై కిలోమీటర్ల దూరంలో వున్న జైషే మహమ్మద్ టెర్రరిస్టు శిక్షణా శిబిరాలమీద తెల్లారితే మంగళవారమనగా భారతీయ వైమానిక దళానికి చెందిన పనె్నండు మిరాజ్‌లు బాలాకోట్, చికౌటీ, ముజఫరాబాద్ టెర్రరిస్టు స్థావరాలమీద మెరుపుదాడులు చేసి మసూద్ అజర్ మహమ్మద్ బావమరిది ఉస్తాద్ ఘోరీ సహా వందలాదిమంది పాషాణ ఉగ్రవాదులను ముట్టుబెట్టి ‘అడంగు’కి విజయోత్సాహంతో తిరిగి వచ్చేసరికి యావత్ భారతదేశంలోనూ జనాలు ఒక కొత్త సూర్యోదయాన్ని చూసినట్లు ఉప్పొంగిపోయారు.
‘‘జయహో! ఇండియన్ ఎయర్‌ఫోర్స్ దళాలూ!’’ అంటూ కీర్తించారు. ఇవి మెరుపుదాడులే, ప్రతీకార చర్యలే గానీ- యుద్ధం కాదిది. ఇండో-పాక్ బార్డర్ దాటి చేసిన దాడులు కావు. దుష్ట ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై- జనవాసరాలకు దూరంగా వున్న చోట్ల తీసిన రుూ చావుదెబ్బని - ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దేశాధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ, ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌లు సమితికి ఫిర్యాదు చేస్తామంటూ, ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఫార్మాలిటీ రియాక్షని ప్రదర్శించారు.
ఇండియాలో ప్రతిపక్షం, వైరిపక్షం లాంటి తేడాలు లేకుండా, అందరూ మిరాజ్ 2000ల మిరుమిట్లు గొలిపే దాడులను హర్షించారు. ఈ విమానాలు 2795 కి.మీ వేగంతో గగనతలాన్ని ఛేదించుకుంటూ దూసుకుపోయి నిమిషంలో 1800రౌండ్ల ఫిరంగులను ప్రేల్చగలవు. వెయ్యి కిలోల బరువున్న బాంబుల వర్షాన్ని కురిపించి తిరిగొచ్చిన ఈవైమానిక దళం సిబ్బంది లోగడ కార్గిల్ యుద్ధంలో కూడా తమ తడాఖా చూపించారు. మమతాదీదీ ఒకే ఒక్కమాట అన్నది- ‘ఇండియన్ అమేజింగ్ ఫోర్స్’ ఇది అని. మనం సుబ్రహ్మణ్యస్వామి అన్న మాటలను కూడా హర్షించాలి. మన భూభాగంలో వున్న ఉగ్రవాద శిబిరాలమీద చేసిన రుూ సైనిక చర్యని యుద్ధ చర్యగా ఎవరూ అనుకోకూడదు. ఇండియాకి యుద్ధమంటే భయంలేదు. కానీ, శాంతికాముక దేశంగా, ఏనాడూ తనంతట తాను యుద్ధం చెయ్యాలని అనుకోదు.
దీన్ని, రేపటి ఎన్నికల కోసం రాజకీయం చెయ్యాలని అనుకుంటూ చేశారని-జనాబ్ ఇమ్రాన్‌ఖాన్ అన్న మాటలలో ‘పస’లేదు. విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే గారు ఈ వివరాలు ప్రకటించారు. మన ప్రధాని కానీ, ఆర్మీ కమాండర్లు గానీ రుూ ప్రకటన చేయలేదు. కానీ పాకిస్తాన్ వాళ్ల ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ మేజర్ జనరల్- ‘‘్భరత వైమానిక దళం బాలాకోట్ మీద బాంబుదాడికి రాగా తరిమికొట్టాం’’ అంటూ ప్రకటన చేశాడు. జాగ్రత్తగా గమనించాలి ఇది. ఇండో పాక్ ‘బార్డర్ వార్’ లాంటిది కాదు. కాశ్మీర్ ఆక్రమిత కశ్మీర్‌లమధ్య అసమంజసంగా, అన్యాయంగా గీసిన ఒక ‘గీత’ వద్ద గీత దాటి వస్తున్న ఉగ్రవాద కుట్రదారుల దాడి యత్నాలను- వేగులవారి వార్తల ఆధారంగా తెలుసుకుని అట్టి దాడులను నిరోధించడానికి చేసిన సైనిక ముందస్తు చర్య. దీన్ని మెరుపుదాడి అను లేదా సర్జికల్ స్ట్రయిక్ అను లేదా మరో పేరు పెట్టండి. ఏమన్నా అతి భయంకర ప్రాణాంతకం కాగల ఉగ్రవాద దొంగ దాడులను నిరోధించగలిగింది మన సైన్యం. జయహో!
పాకిస్తాన్ జైషే మహమ్మద్ ఉగ్రవాదాన్ని అరికట్టలేకపోవడం చేతనే- అవసరమయిన నిరోధక చర్యలు ఎట్టకేలకు భారతదేశం, యిపుడు ‘బహుముఖంగా’ మొదలుపెట్టింది. ఇదీ హర్షించదగ్గ విషయం. దొంగదాడులకు బలి అయిపోతున్న వీరజవాన్‌ల త్యాగం వృథా పోకుండా హురియత్‌లకు ఇచ్చిన భద్రతా సదుపాయాలకు ‘హుష్‌కాకీ’ చెప్పింది. వాగా బార్డర్ దగ్గర పాకిస్తాన్ నుండి సరుకులు తీసుకొస్తున్న ఆ దేశం యొక్క వందలాది ట్రక్కులను ‘గేటు’కి అవతలనే నిలవరించింది. దిగుమతి సుంకాన్ని ఒకేసారి రెండు వందల శాతం పెంచి పాక్ వాణిజ్యం మీద చావుదెబ్బతీసింది. దీనివల్ల కొన్ని లక్షల మిలియన్ డాలర్లలో వాణిజ్యపరంగా పాకిస్తాన్‌కు నష్టం వాటిల్లుతున్నది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టంగా ‘‘మనం పాకిస్తాన్‌కు వదిలిపెడుతున్న పంజాబ్ నదుల జలాలను నిలిపివేస్తాము’’ అని ‘పుల్వామా’ దాడికి ప్రతీకార చర్యగా ప్రకటించడం మరొక పరోక్ష చర్య. పాకిస్తాన్ నేరుగా గాక ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడుల ద్వారా కశ్మీరీ భూభాగంమీద రక్తపాత దాడులను చేస్తోంది. కనుక దాని ‘తోక’ కత్తిరించాలీ అంటే రుూ విధంగా జలాలను పైన బిగపట్టడం చాలా ముఖ్యమైన చర్య.
1960లో ఇరుదేశాలమధ్య ‘ఇండస్ వ్యాలీ జలాల పంపిణీ’ ఒప్పందం జరిగింది. దీని కారణంగా పంజాబ్‌లోని పంచనదులలో, ఇండస్, జీలం, చీనాబ్ నదుల జలాలను పాకిస్తాన్‌కు వదిలిపెడుతున్నారు. సట్లెజ్, రావీ, బియాస్ నదుల జలాలు మన పంజాబ్‌లో పొలాలను తడుపుతూ సస్యశ్యామలం చేస్తున్నాయి.
సింధు జలాల విషయంలో కూడా మనకి ‘నియంత్రణ హక్కు’ వున్నది. ఇపుడు రుూ నీరు బంద్ అయితే పాకిస్తాన్ స్పీడు ‘కట్’ అవుతుంది. ఈ మూడు నదుల జలాలను, పాకిస్తాన్‌కు బంద్‌చేసి, కశ్మీరీ భూములకు బదలాయిస్తామని చెప్పి గడ్కారీ మహాశయుడు- పోయిన బుధవారమే పాక్ గుండెల్లో ఒక వాటర్ బాంబ్ పేల్చాడు. కాకపోతే ఇదేదో సింధులోయ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం అంటారేమో, అది కాదు. ఉదారంగా వాళ్లకి వదలిపెడుతున్న జలాల్ని బిగపట్టడమే కాగలదు.
ఇక సర్జికల్ స్ట్రయిక్స్- సమితి చట్టాలకేమీ ఉల్లంఘనలు కావు. ఇక బాలాకోట్ టెర్రరిస్టు శిక్షణ శిబిరం కేవలం ‘జైషే మహమ్మద్ ఉగ్రమూకలకే కాదు హిజబుల్ ముజాహిదీన్ మూకలకు కూడా శిక్షణ స్థావరంగా - పాక్ ఆక్రమిత ‘కున్వార్’ నదీ తీరంలో వుంటున్నది.
పాకిస్తాన్ ప్రభుత్వం- ఎందరో చెబుతున్నట్లు- యిటు సైన్యం అటు జైషే ఉగ్రవాద బలగాలమధ్య నలిగిపోతున్నది, నిజమే అవొచ్చునుగానీ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి సిద్ధం అయితే, పాకిస్తాన్‌కి భారతదేశం దానితోపాటు ఒక్కటే కాదు ఆసియా ఖండంలోని ఇతర దేశాలు కూడా మద్దతు యిస్తాయి. కానీ పాకిస్తాన్ నాయకత్వంలో రుూ చొరవ, సదుద్దేశం కొరవడ్డాయి. హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ అన్నట్లు అజర్ మహమ్మద్ ‘సైతాన్ సంతానం’.
అతణ్ణి కాపాడే ప్రయత్నం చైనా కూడా ఖండించే విధంగా ఇండియా యిప్పుడు అంతర్జాతీయ రాజకీయ రంగస్థలిమీద పావులను చాకచక్యంగా కదపాలి. పరస్పరం తిట్టుకోడం, నిందించుకోవడం కన్నా ఇండియన్ పొలిటీషియన్స్ ఎల్.ఒ.సి వద్ద పాక్ ఆడుతున్న పరోక్ష యుద్ధ నాటకానికి ఎలా తెరదించాలి? అన్నది ఆలోచించాలి.
‘‘బ్రేవో! ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, థ్యాంక్యూ!’’-

సెల్: 92900 99512