వీరాజీయం

ఇక ఢిల్లీ వైపు చూద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవిగో అవిగో బారులు.. వోటర్ల బారులు.. మండుటెండలో కుత కుత ఉడుకుతున్న పార్టీల జాతకాలు’’- అని పాడాల్సిందే. మన ప్రాంతం అనగా తెలుగు ఏరియాలో ఇవాళ్టితో పోలింగ్ పర్వం పరిసమాప్తం. ఇక రోజులు లెక్కపెట్టుకుంటూ- ఎదురుచూపులూ, అడ్డమైన సర్వేలు, అంచనాలు, ఊకదంపుడు చర్చలు-ఎండలను ఎగదోస్తూ ‘సాగుడు’ మొదలు. అందుచేత.. అనగా దట్స్‌వై- మనం యిక్కడి ఎన్నికల రాశిఫలాల్ని యిక చెప్పుకోము. స్వస్తి..!
ఆంధ్రా, తెలంగాణ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశాలలో ‘పీర్లు గుండా’’న పడ్డట్లే. ఇక్కడి ఎన్నికల చప్పుళ్లకు, కబుర్లకు స్వస్తి. మళ్లీ వోట్ల లెక్కింపురోజునే మన ముచ్చట్లు. అయితే, తొలి విడత పోలింగ్‌తోనే 2019 ఎన్నికల మహాపర్వం అయిపోలేదు. ప్రారంభం మాత్రమే అయింది. కాకపోతే ఒక అరుదైన ఫ్రంట్ ఆంధ్రాలో ఏర్పడ్డది. బహుజన సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి- జనసేన అధినాయకుడు పవన్‌కళ్యాణ్‌తోను, కమ్యూనిస్టులతోనూ జతకట్టింది. అక్కడ పశ్చిమ బెంగాల్‌లో ‘దీదీ’ మమతా బెనర్జీ జట్టుకట్టినా, కట్టకపోయినా సంఘ్ పరివార్ గుండెల్లో రైలుబండ్లే! ఇంకా నయం.. దక్షిణాదిన జయలలితమ్మ లేదు. ఉత్తరప్రదేశ్ వైపే అందరి కళ్లూ వుంటాయి. అదో చిన్నసైజు దేశమంత ఉంటుంది. ఎనభై రెండు పార్లమెంటు సీట్లు అక్కడే వున్నాయి. పైగా సన్యాసి పుంగవుడు యోగి ఆదిత్యనాథ్ అమాయకంగా తనకి తెలియకుండానే- భాజపా పార్టీకి- ఇతరుల నుంచి మరీ కోపం వచ్చేలాగ చేస్తూంటాడు. అక్కడ అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీలు- పోయినసారి కలిసి ఊరేగింపులూ, ఉత్సవాలు, ప్రచారాలూ చేసుకుని విఫలమయినా- పూర్తిగా రాహుల్ పార్టీ మీద, పార్లమెంటు, కేంద్రమూ వంటి విషయాలలో అఖిలేశ్‌కి యింకా మోజుపోలేదు.
చిత్రంగానే రుూసారి మాయావతి, అఖిలేశ్- ఆర్‌ఎల్‌డి పార్టీని పక్కలో సత్రకాయలాగా- పెట్టుకుని రంగంలోకి దిగారు. ఎస్పీ, బిఎస్పీలు చెరో 38 స్థానాలలో పోటీ చేస్తున్నాయి. అమేథీ, రాయబరేలి సీట్లు రెండూ మాత్రం ముట్టుకోకుండా వదిలేశాయి. కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఏడెనిమిది సీట్లు ఈ మాయా, అఖిలేశ్ ఘట్‌బంధన్ కోసం వదిలేశారు. అదే ముందు ‘‘చూపు’’, ‘‘హోపు’’.
యూపీ పక్కనే వున్న బిహార్‌తో కలుపుకుంటే- లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలలో యిరవై శాతం సీట్లు అనగా 120 స్థానాలు భాజపాకి సంకటంగా తయారు అవుతాయి. మహాఘట్ బంధన్ అంటూ ‘పక్కా’గా ఏమీ లేకపోయినా- అఖిలేశ్ యాదవ్, మాయావతిలను లాలూ ప్రసాద్ సుపుత్రుడు తేజస్వీ యాదవ్ వచ్చి కలిశాడు. తెగ పొగిడేస్తున్నాడు ఆ యిద్దర్నీ. దాని ప్రభావం ఎన్నికల తరువాత కనబడే అవకాశం చాలా వుంది.
విశాఖపట్నం ఆంధ్రాకి మేజర్ రేవుపట్టణమే కాక, స్పెషల్ ఎట్రాక్షన్ అయిపోయింది. అక్కడికి ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు ‘బసపా’ చీఫ్ మాయావతి బహు ఉరకలు వేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్‌కీ, అతని అభిమానులకీ గొప్ప ఆనందం కలిగించింది ఈ సందర్శన. మాయావతి తానే స్వయంగా- ‘‘ఏనుగు అంతటి నాయకురాలిని నేను. కేవలం దళిత జనోద్ధరణ కోసమే నేను పెళ్లీప్రేమా లాంటి మగ సంబంధాలు లేకుండా, యిట్లా అవివాహితగా జీవితాన్ని అంకితం చేశాను..’’ అని చెప్పుకొంది. ‘ప్రజల కోసం- అంబేద్కర్ సరసన- కాన్షీరామ్ జతగా- అంతటి మహోన్నత సేవలు చేస్తూ వస్తున్నాను కనుకనే- నిర్భయంగా నా కంచుబొమ్మల్ని- నేనే- భావితరాలకొక ప్రేరణగా మిగలాలనే ఉద్దేశంతో ఆవిష్కరించాను’’ అని చెప్పుకుంటున్న ఆమె కవి హృదయం ఎరిగిన మహానటుడు పవన్‌కళ్యాణ్- మరింక ఆలశ్యం చెయ్యకుండా- ‘‘చాయ్‌వాలా చౌకీదార్ కాంగా లేనిది జన సమ్మోహక నాయకురాలు మాయావతి దేశ ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు?’’ అన్నాడు.
మనలోమాట.. పవన్‌కళ్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి ఏల కారాదు? ఆమాటే మాయాజీ అన్నది- రాష్ట్రానికి తగిన ముఖ్యమంత్రి ‘పవన్ భాయ్ సాబ్’ మాత్రమేనని. అట్లా జనసేన, బ.స.పా.కి ప్రధానమంత్రి పదవినీ- బదులుగా, ఆమె ఆంధ్రా చీఫ్ మినిస్టర్ పోస్టుని ‘పవర్’కళ్యాణ్ అనే వెండితెర అగ్ర తారకీ వైజాగ్‌లో- సముద్రం, జనసముద్రం ఘోష సాక్షిగా- యిచ్చి పుచ్చేసుకున్నారు యిరువురూ-
మాయావతీజీ కానీ, దీదీ మమతాజీ కానీ తమ మనసులో ఏముందో? మనసులో మాటని బయటపెట్టే అవకాశం కోసం చూస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి యు.పి. సోదరి ప్రియాంకా- అతి ప్రేమగా రంగంలోకి రావడం వల్ల- వాళ్లు చెప్పుకుంటున్నంత ‘‘మేలు’’ జరగకపోవచ్చును గానీ- కాంగ్రెస్ పార్టీకి మాయావతీ ప్రపంచంలో- యోగి ఆదిత్యనాథ్ కాషాయ రంగంలో ఒక స్పెషల్ ‘స్టార్’. స్ర్తి ఆకర్షణగా మాత్రం ప్రియాంకా ప్రస్తుతం వార్తల్లో కథాకళి మొదలు భాంగ్రా దాకా అన్నిరకాల డాన్సులూ చేస్తూ- స్పీడుగా జనాలమధ్య రోడ్డుషోలూ, నాయనమ్మని ఇమిటేట్ చేస్తూ- చేస్తున్నది. కాకపోతే యు.పి.లో అసలు కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాయే! అతను పొత్తులకు రెడీ!
మాయావతి- ‘‘నన్ను ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనబడుతున్నది. వాళ్లు మా వోట్లు చీల్చే ప్రయత్నమే ఎక్కువగా చేస్తున్నారు.’’అని ఉద్ఘాటించింది. ట్రెండ్ చూడగా ఎన్నికలు అయిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి కొత్త సమీకరణలు రావచ్చును. అప్పుడు మాయాజీ యింకా స్పష్టంగా ‘్భముడి వాటా’కి బేరం పెట్టవచ్చును. కాకపోతే భా.జ.పా.కి ఈ బ.స.పా.- ఆమాటకొస్తే తృణమూల్ కాంగ్రెస్‌లకు అట్టడుగు జనాలలో వున్న పట్టు-‘యోగి’ పుంగవుని ధర్మమాని వున్నదా? అన్న అనుమానం వస్తున్నది.
భాజపా- ‘మేం దేశ భద్రత మీద- మోదీ జనాకర్షణ మీదా మా ప్రచారం కేంద్రీకరిస్తున్నాం.’- అన్నమాటలు ఉత్తరాదిన మరీబాగా వినిపిస్తున్నవి. మహారాష్టల్రో శివసేన తమతో కలిసి వున్నా- విడిగావున్నా- భారతీయ జనతాపార్టీకి ‘ఏకు మేకు’గా మారిపోయే అవకాశాలున్నాయి. ఇక కింగ్‌మేకర్‌గా కె.సి.ఆర్. ఎలాగూ వుంటాడుగా- తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు- దీదీని వెనకేసుకొచ్చే అవకాశాలు యిక్కడ కనబడుతున్నాయి. ఎందుకు అంటే- ‘‘అబ్బే! నాకు ప్రధాని పదవి మీద మోజులేదు’’ అని కే.సి.ఆర్. రుూమధ్య అనడమే దానికి కారణం. ఏది ఏమైనా యిక కేంద్రంలో - ‘ఎవరిది ప్రభుత్వం?’ అన్న అంశమే అన్నిచోట్లా మన ఏరియాలో ముఖ్యాంశం అవుతుంది.
ఆల్ ‘అయిస్’ ఆర్ ఆన్ లోక్‌సభా రిజల్ట్స్!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512