వీరాజీయం

సూర్యుడొక్కడే.. రాష్ట్రాలు రెండు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేట్రేగిపోతున్నాడు చండ ప్రచండంగా... అక్కడా దంచుతున్నాడు, ఇక్కడా వాయిస్తున్నాడు... ఎవరు..? కేసీఆర్, చంద్రబాబు అను కున్నారా?.. కాదు.. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ఇద్దరు ముఖ్య మంత్రులున్నారు. ఉండుగాక- కానీ, సూర్యభగవానుడొక్కడే. ఎటువంటి పక్షపాతం లేకుండా- ఎండలు మెండుగా హైదరాబాద్‌లోను, అమరా వతిలోను ఒకే లెవెల్లో నిప్పులతో చెరిగి - జనాల వొంట్లో తడిని పీల్చేస్తున్నాడు . ఉత్తర తెలంగాణ, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, ఒంగోలు, కర్నూలు నగరాల్లోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. ఆదివారం రామగుండం, విజయవాడ, ఒంగోలు, నాగ్‌పూర్‌లలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన దేశంలోనే అత్యధికంగా బ్రహ్మపురిలో (మహారాష్టల్రో) 46.4 డిగ్రీలు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలుగా రికార్డు అయ్యింది. మనకి 47 డిగ్రీలు చూపిస్తోంది.
ఈ శతాబ్దారంభం నుంచి అనగా 1901 తర్వాత దారుణ వేడి సంవత్సరం 2018 అని భారత వాతావరణ శాఖ లోగడ అన్నది గాని . ఈ ఏడాది అంతకు మించి పోయి దేశంలో సగటున 0.5 డిగ్రీలు-అధిక వేడిమి నమోదవుతున్నది. ఇంతవరకూ వెబ్‌సైట్ ఎల్‌డొరాడో వెల్లడించిన లెక్కలను చూస్తే- గత శుక్రవారం భూగోళంపై- అత్యధిక వేడి ప్రాంతం ఇండియాలోనే మధ్య భారత్ పేరుతో నమోదైంది. అందుకు మేము తీసిపోయామా? అని తెలుగు రాష్ట్రాలు పోటీపడి వేడెక్కిపోతున్నాయి.
పగటెండ రాత్రి వేడిగా మారిపోయ శరీరంలోని, వస్తువులలోని తేమని పీల్చేస్తున్నాయి. దీనికి తోడుగా రాజకీయ కక్షల కారణంగా దేశంలో ఏసీ గదుల్లో కూడా వేడిమి దంచేస్తోంది. హీట్ వేవ్ తోడుగా హాట్ పోలిటిక్స్‌ల మధ్య సలసల కాగిపోతున్నది ఇండియా- దట్ ఈజ్ భారత్. మోదీ, మమతా దీదీలు వాతావరణాన్ని మరింత అగ్నిగుండం చేస్తున్నారు. కాలం చెల్లిన ప్రధానివి నువ్వు... నేను నీతో మాటలాడేదే మున్నది? .. అంటున్నదామె. నేనోసారి విమానయానం చేస్తే మీ రాష్ట్రంలో బెటర్.. మరో విడత బెంగాల్‌లో పోలింగ్ ఉన్నది కదా? దానికి ఏమైనా సాయం చేయొద్దా? అని అనుకుంటున్నాడు గడుసు ప్రధానమంత్రి మోదీ. ఇది ఇలా వుండగా -మధ్యలో ఈ ఫోనీ - తుఫాన్ ఒకటి -పోనీ లే మనల్ని వదిలేసి ఓడిశాని ఇలా ‘‘నాకేసి’’, బెంగాల్ మీద పడ్డది అనుకుంటే -మనకి ఉన్న తడి -తేమా వూడ్చుకుపోయింది. కాకపోతే, ఒడిశాలో వోట్లు అన్నీ పుట్టలో దాగిన పాముల్లాగా ఈవీఎంల పొట్టలో దాక్కున్నాయి గనుక - ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధానమంత్రికి వేదిక మీద, విమానం మీద మర్యాదలు చేశాడు. కాని కేంద్ర బలగాల మధ్య నలిగిపోతున్నానని వాపోతున్న మమతా దీదీ ఇప్పుడు మోదీ రాక తనకి ముప్పు తెస్తుంది అని భయపడుతున్నది, ‘‘మే 19వ తేదీ తర్వాత రావయ్యా... నో ప్రాబ్లెం’’ అని అంటున్నది.
మన ఏపీలో అన్ని ఊళ్లూ బెజవాడలమే అన్నట్లు 45 డిగ్రీలకి అవతలి తట్టు చేరుకుంటున్నాయి. ఇక గ్రామాల్లో తాటి చెట్లు కొబ్బరి చెట్లు కూడా మొహాలు వేలాడేశాయి. ఇటు ఒంగోలు, కర్నూలు అటు ఆదిలాబాదు అన్నీ మండిపోతున్నాయి. హైదరాబాదు సిటీ కాంక్రీటు జంగిల్ కనుక కొత్తగా రాత్రుళ్లు కూడా వడగాడ్పులు నగర సంచారం చేస్తున్నాయ. ఇక-ఊరకుక్కలు కూడా నోరుమూసుకు పడుంటున్నాయ. సూర్యుడు ఓ వారం రోజులుగా వెలుతురు ఇవ్వడానికి బదులు జనాల మీద నిప్పురవ్వల చెలగాటం మొదలు పెట్టాడు.
భాజపా మీద -పోలింగ్ కేంద్రాలలో - కేంద్ర బలగాలు ‘‘మామీద జులుం చేస్తున్నారో’’ అని ఇతర రాష్ట్రాలు గోల, గొడవ. నిజానికి ఈసీ అనే వ్యవస్థ స్థితి దారుణం అయింది. రెండు వేపులా వాయించ బడుతున్న ‘డోలు’ లాగా అయింది దాని బ్రతుకు..ఎక్కమంటే ఎద్దుకి కోపం, దిగ మంటే శివుడికి కోపం- ఇదీ పరిస్థితి ఎన్నికల కమిషన్ ది. అందరూ ‘నంబి కొండాయ కి లోకువ -కాని నాకు నంబి కొండాయ లోకువ’’ అన్న సామెత చందాన- సుప్రీం కోర్టు ఎప్పుడు మొట్టికాయ వేస్తుందో? తెలియదు.. ఇదంతా అమాయకుడు, అర్భకుడు అయిన సామాన్య వోటరుకి మండుటెండలో దూలగుండాకు రాసుకున్నట్లుగా ఉటున్నది. ప్రతిసారి ఎన్నికల సంస్కరణలు చెయ్యాలి.. ఎమ్మెల్యేలు అంగడి సరుకు కారాదు.. అంటారు.. ఏవో చట్టాలు సూచిస్తారు- కాని ఓ పార్టీ గుర్తు మీద ఎన్నికలు గెలిచి - మరో పార్టీకి అమ్ముడు పోకుండా ఆపే చట్టం చట్రం తీసుకు రాగల దమ్ముల్లేవు. మామూలుగా ఓటరు దేని మీద తన ఆమోద ముద్ర వేస్తాడు? - పార్టీ గుర్తు మీదే కదా? అదే స్వతంత్ర అభ్యర్ధి అయితే వాడికి గొడుగో, గ్లాసో ఏదో ఉంటుందిగా ఓ చిత్రమయిన గుర్తు. దాని మీద నొక్కుతాడు.. అవతల ఎండ, ఇవతల ఈ ఎన్నికల పోరు తీరుతెన్నుల మీద వర్రీ - ఇదీ నాన్ మోదీ భక్తులు -డెమోక్రసీ ప్రియులు అయిన వారి మనాది. మోదీ భక్తుల సంగతి వేరు. వాళ్లకి మోదీ తప్ప ఇంకేమీ కానరాదు. నరేంద్ర దాస్ మోదీ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అంటే వాళ్ళకి -కిట్టదు- గలాటాలు, ఘర్షణలు ఇవన్నీ మోదీజీ చుట్టూ తిరుగుతున్నాయి -అచ్చేదిన్ కేవలం ఆయన హక్కు అని భక్తజనుల నమ్మకం. ఎవరేమి అనుకున్నా మాయావతి ప్రధాని కాగలనని అనుకున్నా ఎండలు కేర్ చెయ్యవు. అవి మరో వారం దాకా బట్టి బల్లార్చేస్తాయి.
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే నగరాల్లో ఎండల వేడిమి అధికంగా చెలరేగుతున్నది- గ్లోబల్ వార్మింగు అంటారు- అదో ఫాషన్బుల్ వర్డ్. అం దుకు కారణం నగరాలలో చోటుచేసుకుంటున్న మార్పులేనని నిపుణులు అంటున్నారు. అందుకే, మధ్య భారత్‌లోని కొన్ని పట్టణాలు ప్రపంచంలోనే 15 అత్యంత వేడి పట్టణాల జాబితాలో చేరాయి. పెద్దఎత్తున నిర్మాణం పనులు జరుగుతుండటంతో గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని నగరాలు, పట్టణాలు శరవేగంగా మారిపోతున్నాయి. స్థిరాస్తి వ్యాపారాల కోసం వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. దాంతో పచ్చని చెట్లు కను మరుగవుతున్నాయి. తారు, కాంక్రీటు రోడ్లు విస్తరిస్తున్నాయి. భారీ భవనాలు వెలుస్తున్నాయి. ఏసీల వాడకం పెరిగిపోతోంది. ఆ ఏసీల నుంచి వెలువడే వేడి గాలిలో కలవడంతో బయటి వాతావరణం మరింత వేడెక్కిపోతోంది. క్లోరో ఫ్లోరో కార్బన్స్- పదిహేను అంతస్తుల కాంక్రీటు మేడలు -ఇవే పొయ్యి విసిరి రాజేసినట్లు ఎండని ఎక్కువ చేస్తాయి.
మన బెజవాడ జనసాంద్రత విషయాని కొస్తే ప్రపంచ రికార్డులలో ఉన్నది కూడా. కేఎల్ రావు లాంటి వాళళు బెజవాడలోని గాంధీ కొండమీద చెట్లు నాటమన్నది ఎందుకు? జనాభా అధికంగా ఉన్న నగరాల్లో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి.ఆయా నగరాలను సమీపిస్తుండగానే వేడిలో తేడా తెలిసిపోతుంది. ఆ విషయం ఇప్పటికే మనలో చాలామంది గ్రహించే ఉంటారు. నిర్మాణాలతో పాటు ఇతర మార్పుల కారణంగా నగరాల్లో గాలి ప్రయాణ వేగం తగ్గిపోతోందని, దాంతో ఉష్ణోగ్రత్తలు పెరిగిపోతున్నాయని పూణెలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్. అమిత్ ధోర్డే మాటలను మనం గౌరవించాలి.
‘నగరాల చుట్టూ ఉన్న పంట పొలాలను, పచ్చని చెట్లను తీసేసి తారు, కాంక్రీట్ రహదారులను నిర్మించి సూర్యుడిని మీరే మీ పీకల మీదకు తెచ్చుకుంటున్నారు. నలభై నగరాల్లో ఎండలు మరీ మండిపోతున్నాయి. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతోంది’ అని ఓ అధ్యయనంలో తేలింది. యూరప్ దేశాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రమే పెరుగుతున్నాయి. కారణం కాంక్రీటు నిర్మాణాలు పెరగడమేనని అని నివేదికలు నొక్కి చెబుతున్నాయి. (ఏసీ గదుల్లో కూకొని ఎన్నయినా చెప్పవచ్చు) కాంక్రీటు నిర్మాణాలు, తారు రోడ్లు మధ్యాహ్నం వేళ వేడిని గ్రహించి, రాత్రి విడుదల చేస్తాయి. నరుడా..! నీ కోరిక చల్లదనమే అయితే విసనకర్రలు కొను.. పానకం తాగు.. అంటున్నదో బామ్మ. గ్లూకోజు, కొబ్బరి నీళ్లు ఉన్నాయా? నువ్వో మొండిఘటానివి.. పోయి ఆవకాయ పనులు, మాగాయ విషయం చూసుకో.. వడియాలెడతావా తల్లీ.. వెల్‌కమ్.. పద.. టెర్రస్ మీదకి.. ఛలో డాబామీదకి.. ఎర్రని ఎండలో ఏమి హాయిలే హలా.. బూడిద గుమ్మడి వడియాలకు జై.. అప్పడాలదే పైచేయి..
బై ది బై క్యారీ ఆనియన్స్ విత్ యూ.. అప్ ఎబౌవ్ దేర్- నాట్ ఐస్ వాటర్!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512