వీరాజీయం

ఈ ఉత్కంఠ తప్పదు.. ఇంకొక్క వారం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హమ్మయ్య..! ఎట్టకేలకు చివరి విడత పోలింగ్‌కి వచ్చేశాం.. మరో రెండు రోజుల తర్వాత ఆదివారం నాడు- ఈనెల 19వ తేదీన ఏ డవ- (ఆఖరి) విడత పోలింగ్ పూర్తయిపోతుంది. ఇక ‘శబ్దకాలుష్యం’ తగ్గుతుందని అనుకుంటూ సామాన్య జనం పోలింగ్ చరమాంకం కోసం ఎదురుచూస్తున్నారు. బిహార్‌లో ఎనిమిది స్థానాలకి, ఝార్ఖండ్‌లో మూడు సీట్లకి, మధ్యప్రదేశ్‌లో ఎనిమిది, పంజాబ్‌లో పదమూడు, హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు, ఉత్తరప్రదేశ్‌లో పదమూడు, చండీగఢ్‌లో ఒకటి.. ఇలా ఒకటి తక్కువ అరవై పార్లమెంట్ స్థానాలకి వోటర్లు బారులు తీరనున్నారు. దీంతో ఏప్రిల్ 11న మొదలైన ఎన్నికల జాతర వచ్చే ఆదివారం నాటికి ముగుస్తుంది.
మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గనుక దాదాపు అన్ని పార్టీల నాయకులంతా కంఠనాళాలు తెగేలాగ తెగ వాగి వాగి- ఎవరికి ఎవరూ తీసిపోనంతగా వ్యక్తిగత నిందలతో దుర్భాషలాడుకున్నారు. ‘వాగి వాగి- గెల్చు నోరు నోవని వాడూ’ అన్నాడు వేమన. ఆ విషయంలో ఫస్టుమార్కు మాత్రం ప్రధానమంత్రి హోదాలో దేశమంతటా ఉరుకులు పరుగులుగా, అతి సుళువుగా ప్రచారం నిర్వహించిన శ్రీమాన్ నరేంద్రదాస్ మోదీదే. అటు తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీదే. ‘అలుపెరుగని దేశ పర్యటన’- అనంగానే ఓ ‘టీనేజర్’ అన్నది- ‘మోదీజీకో జ్యాదా గుస్సా ఆతాహై’- అంటే నరేంద్ర మోదీజీకి కోపం ఎక్కువగా వస్తుంది. రాహుల్ గాంధీ చెరగని చిరునవ్వులు చిందిస్తూ ‘‘సింపతీ కార్డు’’నే ప్రయోగిస్తూ పర్యటిస్తూ ఉండగా, భాజపా అధినేత మోదీజీ మాత్రం ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యల మీద ‘‘రెట్టింపు’’ స్పీడుగా ప్రతివ్యాఖ్యలు- తిట్లు ఒకటిగా, రెండుగా అంటిస్తూ- ఎక్కడికక్కడ జనాన్ని వినోదపరచడంలో కొత్త రికార్డు సంపాదించాడని చాలామంది అంటున్నారు. రాహుల్ మాత్రం- మోదీజీది ‘ద్వేషం’.. మాది ‘ప్రేమ’ అంటూ ఎక్కడికక్కడ జోకులు, చతురోక్తులు వేస్తూ వుంటే మనవాడు ‘పప్పు’ కాదు రోయ్! అంటూ ప్రతిపక్షాలవాళ్ళు తెగ మురిసిపోయారు..
అయితే మాటకు మాట, తిట్టుకు తిట్టు అందించే పనిని రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ తీసుకుంది. జనాల మధ్యకి దూసుకుపోయి తమాషాలు చేయడం.. వంటివన్నీ నాయనమ్మ దగ్గర నేర్చిన విద్యలన్నీ చాలా వున్నాయి ఆమెకి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కాంగానే మరింత పదునెక్కాయి అవి. మోదీజీని అమిత్‌షా ఒక్కడే మోయడం కష్టమే అయింది. ఎందుకంటే అంతా ఒక ‘కూటమి’లో లేకపోయినా, అన్ని భాజపా వ్యితిరేక పార్టీలకీ ఒక్కడే ‘‘టార్గెట్’’- మన నరేంద్రదాస్ మోదీ- అదీ వాస్తవం.
చివరి విడతలో మోదీజీకి 2014నాటి ‘వేవ్’ వంటిది ఏదీ ఎటు దృష్టి సారించినప్పటికీ కనపడక పోవడంతో ‘అచ్ఛేదిన్’లు ఎవరికి వస్తాయి.? తనకా? మమత- మాయావతి- రాహుల్ గాంధీలకా? అన్నది తెలియదు. ఒక్కో ‘న్యూమరాలజిస్టు’ ఒక్కో లక్కీ నెంబర్ చెబుతున్నాడు.
ప్రధాని మోదీని చివరి విడత దాకా ఎవ్వరూ అతని కుటుంబ వ్యవహారాల మీద వేలెత్తి చూపించి తిట్టలేదు. ఇదొక సుగుణం. ఎన్నికల రణరంగంలో దీన్ని ప్రతిపక్షాలు ముఖ్యంగా దక్షిణాది నాయకులు కూడా పాటించారు. నిజానికి ప్రస్తుత ఎన్నికల ఫలితాలు వచ్చాక కేంద్రంలో అధికార పీఠాన్ని ఆశిస్తున్న నాయకులలో ఎవరికీ కూడా ఆలుబిడ్డలు, భర్త-సంతానం ఉన్నారు? నరేంద్ర మోదీ పెళ్లయిన బ్రహ్మచారి అయితే, రాహుల్ గాంధీ ఘోటక బ్రహ్మచారి. ఇక మాయావతి, మమతా బెనర్జీలు ‘బ్రహ్మచారిణులు’ అన్న విషయం గురించి అందరికీ తెలుసు. ఎన్నోసార్లు మోదీ ‘‘హవాయి చెప్పల్స్‌ధారి’’అంటూ మమతను ఎద్దేవా చేశాడు కూడా.
ఎన్నికల ఫలితాలు వచ్చాక వెనుకటి రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి లాగా లేదా ఈరోజుల్లో చంద్రబాబులాగా మనుమణ్ని ఎత్తుకుని లేదా వారిని వేలు పట్టి నడిపిస్తూ వేదిక ఎక్కే వాళ్లెవ్వరూ లేరు. తాతల దాకా ఎందుకు? తండ్రులూ, తల్లులూ కూడా లేరీ ‘త్రయం’లో.. మమత, మాయా, రాహుల్, మోదీలది ‘అలక్ నిరంజన్ క్లబ్బే’. కాకపోతే- తన తల్లిని కలుసుకుని మోదీజీ ఆమె ఆశీస్సులు తీసుకోవడం అనే రసవత్తర ఘట్టంలోని వీడియోలు గట్రా ప్రచారంలో వున్నాయి. కానీ ప్రతిపక్షాలకు యిక్కడ ‘మేత’ ఏమీ దొరకలేదు. కాకపోతే, మోదీ అమ్మగారి గదిలో జవహర్‌లాల్ నెహ్రూ ఫొటో గోడమీద కొలువై ఉందిట!
ఇక్కడే- ఈ చివరి విడతలో రెండు అనుకోని ‘ఈవెంట్స్’ (తెలుగులో ఏమంటే బాగుంటుందో..) జరిగాయి. ఎన్నాళ్లగానో అక్కసుగా ఎదురుచూస్తున్న బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతీ బెహన్ అందామనుకున్న మాట అనేసింది. ‘కేవలం రాజకీయ లబ్ధి కోసం భార్యను మోదీ వదిలేశారు’అన్నది. ఇంతవరకూ ఆ మహాఇల్లాలు, మోదీ భార్య అయిన యశోదా బెన్ మీద గౌరవంతో ఎవ్వరూ ఆమె గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. గాని ఇప్పుడు మాయావతి దెబ్బకు విలవిల్లాడిన నరేంద్రుడు- రాహుల్ గాంధీ మీద, వాళ్ల అమ్మానాన్నల మీద తుపాకీ గురిపెట్టాడు. నిజానికి మోదీ ‘బీసీ’ కులం వాడు కాదు, అప్పర్ కాస్ట్‌వాడు అన్నది కూడా మాయాబెహన్. దానికి జవాబు లేదు.
ఇక్కడే.. ఈ చివరి యుద్ధఘట్టంలో వున్న యాభై తొమ్మిది స్థానాలలో ఏ ఒక్క ప్రాంతంలోనైనా ముఖ్యంగా యూపీ, బెంగాల్‌లో మోదీ పార్టీకి అభిముఖంగా వున్న పార్టీలకి ‘‘వోటర్ల సానుభూతి’’ లభించిందీ అంటే- ఫలితాలు వచ్చాక అది గొప్ప ‘‘ఎఫెక్ట్’’ ఇస్తుందని పొలిటికల్ పండిట్స్ మధ్య ఆసక్తికరంగా చర్చలు సాగుతున్నాయి. ఈలోగా తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణాదిన ‘ఫెడరల్ ఫ్రంట్’ పర్యటన ఒకటి వార్తలలో ‘మెరుపులే’గాని పిడుగులు లేకుండా అయిపోయింది. వ్రతం చెడ్డా ఫలం దక్కింది అన్నట్లు కేసీఆర్ తీర్థయాత్రలు మాత్రం ఒక జైత్రయాత్ర లా సాగింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తమిళ సాంప్రదాయం ప్రకారం ‘‘పొన్నాడై’’(శాలువ) ఒకటి కేసీఆర్ మెడలో వేశాడు. అంతే.. ఇంతకు మించి ఏం జరిగింది?
తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొత్తానికి ఊరట లభించింది. ఆయన అనుకున్నట్టు మొత్తానికి ‘ఎన్నికల కోడ్’లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ‘నువ్వేం కంగారుపడకు..’ అంటూ స్టాలిన్ నుంచి చంద్రబాబుకు సందేశం కూడా అందింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎండలు ఫెళ్ళున కాస్తూ వున్నా- ఇపుడు కాస్త ప్రశాంతత కానవస్తోందని అనిపిస్తోంది. సరే.. శుక్రవారం సాయంకాలం అన్ని నోళ్ళు, అన్ని బాకాలు బంద్ అయిపోతాయి!
లెట్ దేర్ బి ‘కామ్‌నెస్’ హియర్.. దేర్.. అండ్ ఎవ్వెరి వేర్!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512