వీరాజీయం

అయ్యో.. దేశమంతా ఇలా మండిపోతోందేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృగశిర కార్తెకు కూడా ‘ముష్టి’ వేసినట్టు మూడు వానచినుకులు రాలినై. దేశమంతా ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రా ష్ట్రాలూ-నిలువునా మండిపోతున్నాయ్! మామూలుకన్నా ఆరునుంచి ఏడు డిగ్రీల ‘వేడిమి’-దానికితోడు వడదెబ్బ ఓ చెంపన కొడుతూ- రెండోవేపుఉక్కబోత- విపరీతమైన ‘గుమాయింపూ’ ఉంటూ- ఎండలు జనాల్ని పెనం మీద పేలగింజల్లాగా వేపుకొని తింటూ వుంటే- దాన్ని ‘హీట్ వేవ్’ అంటారని- వాతావరణ పరిశోధక శాఖ వారు చెబుతూ వుంటారు.
నిజానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎండలు ఊపందుకొని ముప్ఫయి అయిదునుంచి నలభై లోపు డిగ్రీల ఎండ ఎడాపెడా వాయించి- మే, జూన్ నెలల్లో నలభై దాటి అగ్నిజల్లులు కురిపిస్తే- దాన్ని మామూలుగా ‘ఎండాకాలం’ అంటాం. కానీ ఏప్రిల్, మే నెలల్లోనే- భానుడి భగభగలు- చండ ప్రచండ కరాళ నృత్య విన్యాసాలు చెలరేగిపోతే, జూన్ నాటికి జనాలు ‘వొరుగు’లైపోతారు. చెరువులు ‘పర్ర’లైపోతాయి. ఈ ఏడాది అయితే దారుణ పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రా, తెలంగాణల్లోనూ మామూలుకన్నా ఎక్కువ- నలభై డిగ్రీలు దాటి ఎండ వీరంగం వెయ్యడంతో- జననష్టం కూడా సంభవించింది.
అంతకుముందే ఒడిశాను తీవ్రమైన ఎండ - ‘వాత’పెట్టి మరీ- జననష్టం, జల నష్టం విపరీతంగా కల్పించి మరీ వచ్చింది. ఇంతటి ‘అగ్నికీల’ల మధ్య ఎన్నికలు పూర్తి అయిపోయి- బడా మెజారిటీతో ప్రభుత్వాలు గద్దెనెక్కినా- మనకీ, కేంద్రానికీ కూడా ఎండాకాలం నరకం చూపెడుతున్నది. వాతావరణంలో అనుకోని మార్పులు, కుదుపులు ఏర్పడడం వల్లనే ఈ దుస్థితి వస్తుంది అని అంటున్నారు విజ్ఞులు.
మరి ‘అది ఎందుకు?’ అంటే- రుూ భూమి చిత్ర విచిత్రంగా, ఓ పద్ధతీ పాడూ లేకుండా, ఓ చోట ‘‘టాప్ హీట్’’ కాగా- మరోచోట అమితంగా ‘‘చల్లబడి పోవడం’’ చేస్తోందిట. దీనికి- ఈ లోకంలో ముఖ్యంగా- స్కాములూ, స్కాండల్సూ కారణమా? అంటే- సైంటిస్టులు ‘వెర్రిమొహం’ వేస్తున్నారు. అలాంటిదేమీ లేదు. ఢిల్లీలో ఈనెల 11న మామూలుగా ఎండ వేడిమి నలభై డిగ్రీలు ఉండగా- అది కాస్తా ఈ ఏడాది నలభై ఆరు డిగ్రీలకు చేరుకొంటుదట! ఈసారి సూర్యభగవానుడు మరో నాలుగు, ఐదు డిగ్రీలు ఎక్కువ ‘బోనస్’గా వడ్డిస్తున్నాడు. అదే రీతిన ఢిల్లీకీ, పల్లెకీ మధ్య పక్షపాతం ఎందుకు? అని దేశంలో ఉత్తరాదిన మరీ దారుణంగా- దక్షిణాదిన దారుణంగా ఎండలు ‘పండుగ’ చేసుకుంటున్నాయి.
‘‘బెజవాడా..? అక్కడ వాన పడ్డదా? అంటే అదే లేదు...’’ ‘‘హైదరాబాదూ.. ఏమిటి నీ సంగతి..? అంటే ఒక్కచుక్క పడితే వొట్టు..’’
అదుగో- జగన్ ప్రమాణ స్వీకారం ముందు- ‘కురిసింది వానా- వీచింది ‘్ఫ్యన్’గాలీ- సారీ... నిజంగా ‘గాలీ’-అంటున్నది రాజధాని కాని రాజధాని బెజవాడ దుర్గమ్మ సాక్షిగా. మరి- వైజాగ్‌కేం మాయరోగం? అదిలాబాదుతో పోటీ పడి..? నలభై డిగ్రీలు దాటని వూరంటూ వుంటే- కుక్కలకి మారుపేరు పెట్టాలి- అంటున్నారు ఎండ బాధితులు.
ఇట్లా మునె్నన్నడూ లేదు- హైదరాబాద్‌లో పగలంతా ఎండకాసి- సాయంకాలం అయ్యేపాటికి క్రిందినుంచి పైకెగసిన నీళ్లన్నీ చిరుమేఘాలై- గుట్టలకి ‘్ఢ’కొట్టుకుని- వాన కూడా కాదు, వడగండ్ల వాన పడిపోయేది. దీనే్న ‘లోకల్ రైన్స్’ అంటారు. కానీ ఏమిటో? యిక్కడ కేసీఆర్, అక్కడ జగన్ కూడా మధ్యాహ్న మార్తాండ తేజంతో పెట్రేగి పోతూంటే- సూర్యుడు- బాజాభజంత్రీ సెలబ్రేషన్స్ మొదలెట్టాడా? అన్నట్లుంది వాళ్లకి దీటుగానా? పోటీగానా?
సరే, మన సంగతి అట్లుండనిండు. జూన్ పది దాటింది. అదుగో... అదుగో రుతుపవనాలు- నల్లని మబ్బులు బారులు బారులు... మన రాష్ట్రానికి దారులు..దారులు వెతుక్కుంటూ వస్తున్నాయి అంటున్నారు. అంతలో మళ్లీ- ‘రైలుబండి నిరవధికముగా లేటుగా నడుచుచున్నది’- అంటున్నారు రైల్వే అనౌన్సుమెంటు లాగ. యూపీలో మరీ యింత ఎండా? అక్కడి ముఖ్యమంత్రి యోగీ ఏదయినా ‘‘యాగం’’ చేయకూడదా? అంటే యాగాలు, యజ్ఞాలూ చేసే స్వాములు అంతా యిక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే తిష్ఠవేసుక్కూర్చున్నారు. అక్కడ యూపీలోని ‘బాండా’ అనే వూళ్లో నలభై తొమ్మిది డిగ్రీల ఎండ! ‘‘వామ్మో!’’ మరో పాయింట్ రెండు డిగ్రీలకి పెరిగి ధర్మామీటరు మూలుగుతోంది.
అన్నింటి కన్నా ఎడారి రాష్ట్రం- రాజస్థాన్‌లో లోగల- ‘చురూ’ అనే ప్రాంతం గరిష్టంగా ‘చుర్రు’మనే వూరు. అది రుూసారి మరీ, ‘‘పండుగ కోడిపుంజులా’’ చెలరేగింది. ఏకంగా 53.2 సెంటీగ్రేడు డిగ్రీల గ్రీష్మ తాపాన్ని కలిగిస్తోంది. విదర్భ, మధ్యప్రదేశ్, హరియాణా యింకా అనేక ఈశాన్య ప్రాంతాల్లో ఎండలు- ‘నలభై అయిదుకు తగ్గం.. బేరం పెట్టకండి’ అంటున్నాయి. ఒక్క గుజరాత్‌లో మాత్రం మరో రెండు రోజుల్లో అరేబియన్ సముద్రంలోని ‘‘వాయు’’తుఫాన్‌కు గురి అవుతుందేమో? అని అంటున్నారు.
‘ఇంకో రెండురోజులు.. ఇంకా ఒక్క మూడురోజులలో.. వస్తున్నాయ్ రుతుపవనాలు’ అంటూ ఊరిస్తున్నాయి... ఊరడిస్తున్నాయి తప్ప- పవిత్ర అలహాబాదులో మామూలుకన్నా తొమ్మిది డిగ్రీలు ఉష్ణం- ఉగ్రరూపం దాల్చి- 49 డిగ్రీల దగ్గర నిల్చింది- ఏదో- ఒకటి నుంచి అయిదు వరకూ, అభివృద్ధి రేటుకి తట్టుకుంటాం గానీ- ఇదేమిటి? చక్రవడ్డీలాగ పెరిగిపోయి- కాల్చుకు తింటున్నాయి ఎండలు!
‘కుళాయిల్లో’ను లేవు, బాటిల్సులోనూ లేవు నీళ్లు! బీర్ బాటిల్స్‌లో మాత్రం- నగరాలలో పుష్కలంగా ‘ద్రవం’ లభిస్తోందిట. యాభై డిగ్రీలు దాటితే యిక అది ‘కలి’కాలమే. ‘హీట్ వేవ్’ ఏమిటి? ‘ఫైర్ వేవే?’ అనంటున్నారు- చాలా చాలా గ్రీష్మ శిశిరాలు లోగడ చూసిన పెద్దలు.
‘‘మరీ యింత ‘యిది’ ఎరుగం బాబూ!’’ ఎక్కడ చూసినా, గొంతు తడిచేసుకుంటూ అంతా యిదే మాట... దాహం.. దాహం అని.
‘‘ఇంట్లోనే పడి చావండి’’ అంటారు ఏలినవారు, వైద్యులు, వాతావరణ నిపుణులు. గాని పొట్ట గడవొద్దా? స్కూళ్ల మాదిరి వేసవి సెలవులు ఇచ్చేస్తే- ప్రభుత్వ ఆఫీసుల్లో, కార్ఖానాల్లో పనులెలా నడుస్తాయి? హర్యానాలో, పంజాబ్‌లో కూడా నలభై ఏడు డిగ్రీలు దాటింది ఎండ. ఈ ‘నలభై ఏడు’ ఏదో మ్యాజిక్ ఫిగర్‌లా వుంది.
అదేమిటి బాబూ- జమ్మూలో ‘నలభై ఒకటి’ ఎండ నిలకడగా కాస్తోంది? నాగపూర్‌లో మామూలుకన్నా చాలా ఎక్కువైంది. ‘హీట్’ లెవెల్ నలభై ఏడు అయింది. రాజస్థాన్‌లో ఇరవై తొమ్మిది ప్రాంతాలను ‘డేంజర్ జోన్‌లు’గా ప్రకటించింది అక్కడి గవర్నమెంటు.
జనాలను నీడపట్టునే వుండమంటున్నారు అందరూ.. నీడలోనా? అక్కడా ఉడుకే... పాపం! కొన్నిచోట్ల ‘కప్పలకు పెళ్లిళ్లు’ చేస్తున్నారు. అవి సంబరాల వేడి తాకిడికి- ‘బెక బెక’లు ఆపేసి నోళ్లు వెళ్లబెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా, ఇంగ్లండ్‌లో చాలాచోట్ల- ‘ముప్ఫయి ఏడు దాటింది..’ అని జనాలు ఆర్తనాదాలు చేస్తూ వున్నా- వరల్డ్‌కప్ క్రికెట్- మైదానాలను మాత్రం వెక్కిరించినట్లు వానలు వెంటాడుతున్నాయి. ‘‘చెరో పాయింటూ’’ పారేస్తారు- సరే, ఆట మజాకోసం పడి చచ్చే జనాల మాటేంటి? అందుకనే ‘దేవుడు వుండాలి!’అంటానని అన్నాడు వో బజ్జీలరావు. ఇంతటి ఘోర ప్రకృతి వైపరీత్యానికి ఎవర్ని ‘బోను’ఎక్కిస్తాం? దేవుడు లేకపోతే?
‘‘ఎండా! ఎండా! తగ్గు, ఆనక చలికాలంలో కావాలంటే ‘బాకీ’ తీర్చుకో,’’ అంటున్నారు గడుసు పిల్లలు- స్కూళ్లకు, (జూన్ పనె్నండున) పోతూ, పోతూ.. (ఎండ తగ్గందే స్కూళ్లు తెరిచేశారు గానీ!..) కిం కర్తవ్యం?
యూ బెటర్ ఆస్క్ ‘గూగుల్’ సెడ్ ఏ కిడ్.. ఆమెన్!

-వీరాజీveeraji.columnist@gmail.com 92900 99512