వీరాజీయం

ఓ గవర్నర్ గారి ‘హిట్ వికెట్’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రాష్ట్ర గవర్నర్ అనే ‘ఐరావతం’ అక్కడ ఖుషీగా కాలక్షేపం చెయ్యడానికేనా రాజభవనాలు? మన దేశంలో రాష్ట్రాలకు అధిపతులుగా నియమితులవుతున్న గవర్నర్‌లకు - రాజప్రాసాదాల్లాంటి భవనాలు, భోగభాగ్యాలూ ఏర్పాటవుతున్నాయి తప్ప మరొకటి కాదు- అన్నది మొదట్నించీ జనవాక్యం. ఈ మేక మెడ కింది తిత్తుల్లాంటి అలంకార ప్రాయ పదవుల్ని పల్చన చెయ్యడమో, వీలయితే ఎత్తేయడమో చెయ్యాలన్న ఆందోళన అప్పటప్పటి మన సువిశాల భారతావనిలో టీ కప్పులో తుపానులాగా సంభవిస్తూనే వున్నది. కానీ, పేపర్ వెయిట్‌లుగా మాత్రమే ఉపయోగపడే ఈ ‘ప్రజాధనం వేస్టు పోస్టు’ల్ని పెకలించేయాలి అన్న ఆందోళనలు జరిగాయ్.
అసలు వివాదాతీతంగా వుండవలసిన గవర్నర్ పదవులకు కేంద్ర ప్రభుత్వం ప్రలోభ కాముకుల్ని ఎంపిక చేయడం ఎందుకో అందరికీ తెల్సు. తాజాగా మేఘాలయలో కారుమబ్బులు కమ్మినట్లు గవర్నర్ షణ్ముఖనాథన్ గారి ‘బులపాటం’- అతని గవర్నర్ పదవికే ఎసరుపెట్టింది. ‘‘నేను రాజీనామా చేస్తున్నాను’’ అంటూ మేఘాలయ గవర్నర్ దేశమంతటా రిపబ్లిక్ డే సంబరాలు జరుగుతూన్నప్పుడు ఆ ఆనంద సమయంలో ప్రకటించవలసి వచ్చింది.
కథ ఎంత రసకందాయంగా మారిపోయిందీ అంటే మేఘాలయలో పత్రికలన్నింటికీ, షిల్లాంగ్‌లోని టీవీ చానల్స్ మొత్తానికి- టాప్ జెడ్ స్టోరీ దొరికినట్లయింది. ఎడాపెడా వాయించేస్తున్నారు- పాపం! షణ్ముఖనాథన్ దక్షిణాదిన చివరి రాష్ట్రం తమిళనాడుకు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (మాజీ) ప్రచారక్ గారు. 2015 మే నుంచీ అంబర చుంబిత మేఘ నిలయం అయిన కొండ రాష్ట్రానికి రాజ్యాంగ పరిరక్షకుడుగా నియమితుడై- రోజులు రంజుగా లాగించుకొస్తున్న పెద్దమనిషి!
రాజభవన్ అంటే అదో ‘కోట’ లాంటిది. అగడ్తలు, బురుజులు బయటికి కానరావుగానీ, అందులోపల ఏం జరుగుతుందోనని చూడాలనుకుంటే, కిట్టనివాళ్ళు అస్సలు పోలేరు. అంతా అస్మదీయులకే అక్కడ కులాసా దిలాసా దొరుకుతాయ్- అనుకుంటే, పప్పులో కాలేసినట్లేనని లోగడ కొంతమంది రసికప్రియులు, రాజకీయ ప్రకాండులు అడ్డంగా దొరికిపోయిన సందర్భాలున్నాయి.
పాపం! షణ్ముఖనాథన్ గారికి ఆరు ముఖాల దేవుడి పేరెట్టారు తల్లిదండ్రులు. ప్రచారక్ లాంటి నిష్కామ కర్మగా పేర్కొనబడుతున్న పదవులను అప్పజెప్పింది పార్టీ. రాజభవన్ రాజప్రాసాదం, అందులో నౌకర్లు చాకర్లూ సదుపాయాలు- నగిషీలు, జిలుగులు యివన్నీ వెనుకటి సంస్థానాధీశుల, నవాబుల లెవెల్లో వుంటాయనీ- ‘‘ఓసారి చూసొద్దారేటి?’’ అని ఉవ్విళ్ళూరే అమాయక జనాలు వుంటారేమో గానీ- యిలా సదరు భద్రతా నిలయాల గోడలకి- ఏదో సామెత చెప్పినట్లు- చెవులే కాదు.. కళ్లు కూడా వుంటాయని జనాలకి అర్థం అయిపోయిందిప్పుడే.
పాపం! ఈ గవర్నర్ షణ్ముఖనాథన్‌కి సి.సి కెమెరాల బెడద లేదుగానీ, కిటికీ కన్నాలు, తలుపుల తాళం చెవి కన్నాలు వగైరాల ద్వారా- పీపింగ్ టామ్‌ల బాధలాంటిది ఏమీ తగల్లేదు కూడా. ఐతే, రాజ్‌భవన్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఆడామగా మొత్తం ఏకమై తలో ఆరోపణా- తల బొప్పికట్టేలాగా వేయసాగారు. మగవాళ్లకి గవర్నర్ గారి అంతర్ భవనంలో చోటు లేదుట!
‘మగాళ్లందర్నీ అవతల డ్యూటీలు వేసి దూరంగా తోలేయడమే గవర్నర్ సారు పని’ అని ఆయాలూ, నర్సులూ మొదలు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్లు- కార్యదర్శి స్థాయి మగ పురుషులు ఒక్కసారిగా ‘సారు’ని ఆరోపణలతో కుమ్మేశారు. వందమంది స్ట్ఫా రోడ్డుకెక్కారు. రాష్టప్రతికీ, ప్రధానమంత్రికీ ‘లకోటాలు’ కొట్టారు.
అసలు డిసెంబర్ ఎనిమిదో తారీఖుదాకా జనానాలాగా వెలిగిపోతున్న గవర్నర్ గారి ‘అల వైకుంఠపురం’ లాంటి కార్యాలయం - గుట్టు చక్కగా స్ర్తి జన పరిమళభరితంగా సాగిపోయిందట. కానీ, ఆ రోజు సాయంకాలం ఏడు గంటల వేళ ఒక ‘అందాల యువతి’- (సదరు సర్ట్ఫికెటు ఆ వనితామణికి ఇచ్చింది షణ్ముఖనాథన్ గారే)- ‘‘సారు రమ్మన్నారు. ఫైనల్ ఇంటర్‌వ్యూ చేస్తారు. ఆనక పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉద్యోగం యిస్తారు’’ అనుకొని హుషారుగా వెళ్లింది. ‘‘నువ్వు చాలా అందంగా వున్నావ్. అచ్చం ‘దీపికా పడుకొనె’ లాగానే వున్నావ్’’ అన్నాడట- ఆరుముఖాల దేవుడి పేరున్న - యించుమించు, ఆరు మొహాలున్నంత సంతోషంగా. అఫ్‌కోర్స్! గవర్నర్ గారు ‘‘అలాంటిదేం లేదు’’ - అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పాడు. కానీ, ఆ పడతి మాత్రం గవర్నర్ గారు తనని బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడనీ- అక్కున అదుముకున్నాడనీ తన బోయ్‌ఫ్రెండ్‌కి రహస్యంగా సందేశాలు పంపించింది. ‘‘గవర్నర్ గారి రుూ చొరవకి నేను ఏడుద్దాం అనుకున్నాను’’ అంటూ పూసగుచ్చినట్లు ఆ సన్నివేశాన్ని జర్నలిస్ట్ కూడా అయిన తన ఫ్రెండ్‌కి పంపింది.
నిజానికి ఆ అబ్బాయి కూడా పి.ఆర్.వో ఉద్యోగానికే వచ్చాడు గానీ, గవర్నర్ గారు మగాళ్లకి ఆ ఉద్యోగాలు ఇవ్వరుగా? అందుకని తన గాళ్‌ఫ్రెండ్ రాసినదంతా పత్రికలలోని తన ఫ్రెండ్స్‌కి అందరికీ యిచ్చేశాడా యువకుడు. జర్నలిస్టుల నోట్లో నువ్వుగింజ నానదంటారు అందుకే.. పతాక శీర్షికలకెక్కిన రుూ ఉదంతానికి మద్దతుగా రాజ్‌భవన్ ఉద్యోగులంతా- గవర్నర్ షణ్ముఖనాథన్ గారు రాజభవనాన్ని ఒక లేడీస్ క్లబ్‌లాగా చేశాడనీ- స్కాండల్ భవన్‌గా మార్చేశాడనీ- భారీ ఎత్తున పిటిషన్‌లు పంపించేశారు. దాంతో బర్తరఫ్ చేస్తారేమోనన్న భయంతో ఆయన రాజీనామా చేశాడని తస్మదీయుల ఉవాచ. కాకపోతే ఆ అమ్మాయి- అధికారులకిగానీ, మహిళా కమిషన్‌కు గానీ రుూ సంగతి రాయలేదు. ఈలోగా స్ట్ఫా ‘కళ్లెం’ అందుకున్నారు.
ఇట్స్ లైకే ‘హిట్ వికెట్’!
*