వీరాజీయం

‘కప్’కి చేరువగా ‘సెమీస్’కు భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హమ్మయ్య..! సెమీస్ మెట్టెక్కేశాం!’’. కానీ, రుూలోగా బంగ్లాదేశ్- భారత్ క్రికెట్‌సేన గుండెల్లో బాంబులు పేల్చింది. గెల్చింది మనవాళ్లే అయినా- ఓడిపోయినా, తోక ముడిచినా, పెద్దపులిలాగా- చివరిదాకా గాండ్రు గాండ్రుమన్నది బంగ్లా ఐతే, మన బూమ్ బూమ్ బూమ్రా నలభై ఎనిమిదవ ఓవర్‌లో పిడుగులు కురిపించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బౌలర్ అయిన బూమ్రా తన పేరూ, మన మాటా కూడా దక్కించాడు. ఓవర్ చివరి రెండు బంతుల్నీ నేలబారుగా ‘మిడిల్ స్టిక్స్’ మీదికి యార్కర్‌గా- సంధించి- రూబెల్, ముస్త్ఫాజుర్‌లు యిద్దర్నీ మట్టి కరిపించాడు. దాంతో బంగ్లాదేశ్ వీరోచిత పోరాటానికి తెరపడ్డది. కొహ్లీసేన యిరవై ఎనిమిది పరుగులతో విజయభేరి మోగించింది. ఇంక, యిప్పుడు ఎవరి మీద మన జట్టు ‘సెమీస్’ ఆడుతుందన్నది అభిమానులలో కుతూహలాన్ని రేకెత్తిస్తోంది.
ఏది ఏమయినా, పట్టికలో పదమూడు పాయింట్లు థళథళా మెఱిసిపోతూ- ‘‘ప్రపంచ కప్‌ని అందుకుంటారు మనవాళ్లు’’- అన్న ఆశలకు మొగ్గలు తొడిగాయ్. అవతల వానదేవుడు కరుణించాడు. ఇవతల చిన్న పిసరు ‘లక్’కూడా మన ఇండియన్ టీముని వరించింది. హార్దిక్ పాండ్యా బంతి బంతికీ బౌండరీలు బాదేశాడూ... సిక్సర్స్ లేపేస్తాడూ.. అన్న అంచనాలతో అతని ఆర్డర్‌ని పెంచి, ముందుగా పంపిస్తే- ఓ ‘బాతు’ సంపాదించాడు. కానీ, మనకి అదే కలిసొచ్చింది. బంగ్లా యిన్నింగ్స్‌లో పాండ్యా బౌలింగే- పది ఓవర్‌లలో అరవై పరుగులిచ్చినా మూడు వికెట్లు లాగేశాడు. దాంతో మన జట్టు పుంజుకుంది.
ఈ టీములో కొత్తగా చేరిన రుషభ్ పంత్- పాండ్యా లాగే ‘‘హడావుడి దాసు’’ స్థిరంగా ఒక్క క్షణం నిలబడలేడు. కానీ నూటికి నూరుపాళ్లూ ఆత్మవిశ్వాసం గల కుర్రాడు. ఇంగ్లండుతో ఆడుతున్నప్పుడు- బంతిని తన కాళ్లదగ్గరే వుంచేసుకుని- బ్యాట్‌ని ఝుళిపించి- థర్డ్‌మ్యాన్ దిశలో విసిరేసిన పంత్‌బాబు- ఈసారి బంగ్లాదేశ్ మీద చెలరేగిపోయి- ఆ జట్టుమీద ఒకే ఓవర్‌లో వరుసగా మూడు ‘్ఫర్’లు బాదేశాడు. ప్రేక్షకులూ అతని సీనియర్ ఆట‘గాండ్రూ’కూడా వెర్రెత్తిపోయారు. ఇతణ్ని మొదటి నుంచీ వెనకేసుకొస్తున్న సౌరభ్ గంగూలీ కామెంటరీ బాక్సులో వున్నాడు. ‘‘కుర్రాడు మాటదక్కిస్తాడు. నేను చెప్పలేదూ?’’ అన్నట్లు గంగూలీ మురిసిపోయాడు.
కానీ రుూ ఆట మనవాళ్లు చివరికి గౌరవప్రదమయిన పరుగుల (28) వ్యత్యాసంతో నెగ్గారూ అంటే-క్రెడిట్ ‘హిట్ మ్యాన్’ రోహిత్‌శర్మకీ, బూమ్‌బూమ్ జస్‌ప్రీత్‌కీ దక్కుతుంది. అతను ఒక దశలో ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్ దగ్గర ముందు బోర్లాపడ్డాడు. ఆనక వెల్లకిలా తిరిగి మూలిగాడు. ‘‘్ఫజియో థెరపిస్ట్’’వచ్చి అతణ్ణి డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకుపోయాడు. అప్పుడు చూడాలి- స్టేడియమ్‌లో వున్న ఇండియన్ ఫ్యాన్స్ మొహాలు! తప్పెట్లు, తాళాలూ ఆగిపోయాయి. అసలే ఒక బౌలర్ తక్కువ అన్నట్లుగా వుంది టీము. ఎప్పుడూ యిద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఇండియన్స్ రుూసారి- కేదార్ జాధవ్‌ని కూడా ఒగ్గేసి- ‘గోదా’లోకి దిగారు.
దైవాధీనం సర్వీసు హార్దిక్ పాండ్యా చేతిలో బంతిపెడితే- పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా వుంటుంది. జనం ఒక్కసారిగా టీముని సెలక్ట్‌చేసిన ‘్థంక్ ట్యాంక్’ని తిట్టడం మొదలుపెట్టారు. భువనేశ్వర్ కుమార్ తొడమీద నరాల తిమ్మిరితో బాధనుంచి బయటపడి బరిలోకి దిగాడు. భయపడుతున్నాడు కాస్త- ఆ సంకోచంలోనే అతడు ‘వైడ్ బాల్స్’ విసురుతున్నాడు. షబ్బీర్ (36), సైపుద్దీన్ (నాటౌట్ 51)లు, చివరికి ‘‘త్రోసిరాజు’’ అన్నట్లు- భారత జట్టు ఆటకట్టించేస్తారేమో? అన్నట్లుగా వుంది ఆట.
ఆ టైములో ‘భువీ’ ఒక అద్భుతమైన ‘ఔట్ స్వింగర్’ విసిరాడు. ‘ముర్తాజా’ దాన్ని ‘కట్’ చేశాడు. ధోనీ ‘జై హనుమాన్’-అన్న రీతిలో తన కుడిచేతి వేపు గాలిలో రుూది- బంతిని ఠక్కున పట్టుకుని- ‘‘నువ్వింకా ధోనీవే.. టీమ్‌కి రక్షకుడివే’ అనిపించాడు. అదొక టర్నింగ్ పాయింట్ అయింది.
ఐతే, కొత్తగా వేసుకున్న దినేష్ కార్తిక్ బౌలర్ కాడు. పంత్ కూడా బౌలర్ కాడు. కేవలం షమీ, పాండ్యాలమీద భరోసా పెట్టేసేసరికి, ఓ దశలో ‘జడేజా వుంటే ఎంత బావుణ్ణు?’అనిపించింది. మూడొందల యాభై పరుగులు తీస్తారు ఇండియన్స్ అనుకుంటే- చివరిలో నానాతంటాలూ పడి- మూడొందల పధ్నాలుగు పరుగుల దాకా బండిని రుూడ్చిన- వరల్డ్ కప్ ఫేవరిట్స్ కొహ్లీ జట్టు- ఇక పాండ్యాకే ఫుల్ కోటా - పది ఓవర్లు యివ్వాల్సిన స్థితి ఏర్పడ్డది. కాకపోతే- ఎప్పుడూ అధైర్యపడని హార్దిక్ మూడు వికెట్‌లు లాగేశాడు. ఇది మేఘంలో మెఱుపు- మరో మలుపు అయింది.
అయితే, రుూ మ్యాచ్‌లో యిద్దరే యిద్దరు మన హీరోలు అలాగే- బంగ్లా జట్టులో- పది ఓవర్లకే యాభై తొమ్మిది పరుగులిచ్చి- ఐదు వికెట్లు లాగేసిన ముస్త్ఫాజుర్ మహావీరుడిగా అందరి మెప్పూ పొందాడు. షకీబ్ (66) చివరిదాకా ఆడి- అజేయుడిగా మిగిలి- 51 పరుగులు చేసిన సైపుద్దీన్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. ‘‘అతను ఔట్ అయిపోవాలి.. దేవుడా! దేవుడా!’’ అంటూ స్టాండ్స్‌లో ఇండియన్ ఫ్యాన్స్ దండాలు పెట్టుకోడం కనపడ్డది. ‘‘సైఫ్’’ బాగా ఆడాడు.
‘తోక ముడుస్తుంది’ అనుకున్న బంగ్లా పులి 286 పరుగుల దాకా ‘గాండ్రించి’- ప్రత్యర్థి జట్టు నాయకుడు వీర కొహ్లీకి చెమటలు పట్టించింది. ‘అన్ని వంకరలూ గెలుపు తీరుస్తుంది’ అన్నట్లు- చివరికి ‘త్రీ ఛీర్స్’ కొట్టేశారు మనవాళ్లు.
ఈ గెలుపులో ముఖ్యాంశం- రో‘హిట్’ మ్యాన్- వరల్డ్ కప్‌లో నాలుగు సెంచరీలు చేసి శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర రికార్డుతో సమం చేశాడు. ప్రపంచ కప్ పోటీలలో ఐదు శతకాలు సాధించిన, ‘రికార్డ్ క్లబ్’లో చేరిన రోహిత్ యిప్పుడు మరో ఘనత కూడా అందుకున్నాడు. లోగడ సచిన్, సంగక్కర, రిక్కీ పాంటింగ్‌ల పేరున ఉమ్మడిగా రుూ రికార్డు వుంది. దాన్ని ‘చితగ్గొట్టాడు’ రుూ ముంబాయి తెలుగు వీరుడు. సచిన్ నలభై అయిదు మ్యాచ్‌లు, సంగక్కర 37 యిన్నింగ్స్, పాంటింగ్ 46 మ్యాచులు ఆడి, మొత్తం మీద ‘ఐదు శతకాల కీర్తి’ని సంపాదించగా- రోహిత్ కేవలం 15 మ్యాచ్‌లులోనే ఈ రంగుల జెండా ఎగరేశాడు! శభాష్!
ఐతే, చిన్న సెంటిమెంట్ వుంది మన వైస్ క్యాప్టెన్ అయిన రోహిత్ శర్మకి. పది పరుగులు తీసేలోగా-ఓసారి ‘చచ్చి బ్రతకాలి’. ఈసారి కూడా, అతని స్కోరు తొమ్మిది పరుగులు వుండగా ముస్త్ఫాజుర్ బౌలింగ్‌లో- తమీమ్ ‘క్యాచ్’ చేజార్చేసుకున్నాడు- రోహిత్ బ్రతికిపోయాడు! ఐతే, మన ‘హిట్ మ్యాన్’ యింక వెనుదిరిగి చూడలేదు. ఐదు సిక్సల్స్‌తో వీరవిహారం చేశాడు. ‘ఎడ్జ్‌బాస్టన్’ గ్రౌండ్ బాగా చిన్నది. ఈ మైదానంలో భారత్ మూడువందల యాభై పరుగులు చేయలేకపోడం- టీములో యిద్దరు స్పిన్నర్‌లను వేసుకోకపోవడం- రెండూ ఆశ్చర్యార్థకాలే!
సరే, కప్‌కి చేరువుగా- సెమీస్ బెర్త్‌మీద హాయిగా తిష్టవేసిన భారత్ క్రీడాకారులు ‘కప్’ని ఎత్తుకొచ్చి, మన కీర్తిప్రతిష్ఠలని యినుమడింపజేస్తారని, ఆబాలగోపాలం ‘అటు’ చూస్తున్నారు.... అటు...
కమాన్ బోయ్స్..! కమ్ బ్యాక్ విత్ 2019 కప్!!

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512