వీరాజీయం

క్రికెట్‌లో ఇవేం రూల్స్‌రా.. బాబూ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ చరిత్రలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ‘టై’ అవడం ఇదే తొలిసారి. ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చాలనుకుంటే అది కూడా ‘టై’ అయ్యింది. ఇదీ విచిత్రమే..! కానీ- మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టును విజేతగా ప్రకటించడం మరీ దారుణం. మరి ఇరుజట్ల బౌండరీలు కూడా సమానం అయితే అప్పుడు విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఇదెక్కడి రూల్స్‌రా బాబూ.. అంటూ క్రీడా ప్రపంచం యావత్తు ముక్కున వేలేసుకొని అలా ఉండిపోయింది. ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్స్‌కి వస్తాయని అనుకుంటే, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు ఫైనల్స్‌కి నాటకీయంగా వచ్చాయి. వీరోచితంగా పోరాడాయి. నువ్వా? నేనా?? అంటూ- బంతి బంతికీ చెమటోడ్చాయి. సరిగ్గా ధోనీ లాగే గుప్తిల్ కూడా చివర రనౌట్ ఐపోయాడు. దీంతో మ్యాచ్ ‘టై’కి దారి తీసింది. విస్తుబోయిన జనం ధోనీని రనౌట్ చేసిన- గుప్తిల్ ఎలాగయితే- ఇండియాకి చాన్సు పోగొట్టేదో అల్లాగే- గుప్తిల్ రనౌట్ కూడా రెండోసారి ఫైనల్స్‌కి వచ్చి న్యూజిలాండేర్స్‌కి నిలువెత్తు నిరాశ మిగిల్చింది.
ఇదంతా ‘ఖర్మ’ అన్నారు కొందరు. బంతి,బ్యాటు యుద్ధం కాదిది- రూల్స్ ఆడిన ట్రాజెడీ నాటకం ఇదీ అన్నారు క్రీడాప్రియులు. ఏది ఏమైతేనేమి? ఆతిథ్యమిచ్చిన ఇంగ్లీషు జట్టు 2019 ప్రపంచ కప్పును తనివితీరా ముద్దాడి మురిసిపోయింది. మురిసిపోయిందా? అంటే... కేవలం బౌండరీల లెక్కమీద- ఫ్లూక్ కాదా? ఇది? గెలిచినామే అన్న పక్క వంపు మిగిలింది. ఇదేమి చిత్రం.. బౌండరీలు కూడా ఖర్మ కాలి సమమైతే? ఓవర్‌త్రోల మీద- లేదా ఎక్స్‌ట్రా రన్స్ మీద- కప్పు ఎవరిదో నిర్ణయిస్తారా? ప్రాణాలిచ్చి ఆడారు ప్లేయర్స్ చివరికి యాంటీ క్లైమాక్స్ అయిపోయింది అంటూ దుఃఖపడ్డారు ఫ్యాన్స్. ఇద్దరికీ కప్ ఇచ్చి చెరో రెండేళ్ళు ఎంజాయ్ చేయండి అని వుంటే భూమి బొక్కడిపోతుందా? ఇదేం ఆటండీ బాబూ? అవతల వింబుల్డన్ టెన్నిస్ లెవెల్లో ఇవతల ఈ బాటు, బంతి యుద్ధం సాగింది. ఇంతకీ ఈ సూపర్ ఓవర్ ఏంటి?
సూపర్ ఓవర్‌ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలుత వన్ ఓవర్ వన్ సైడ్ ఎలిమినేటర్ యుద్ధం అని ముద్దుగా పిలిచేది. తర్వాత దాన్ని సూపర్ ఓవర్ అనే సంబోధిస్తోంది. నిజానికి 2008లో ట్వంటీ-20 క్రికెట్ కోసం ఈ సూపర్ ఓవర్‌ను ప్రవేశపెట్టారు. 2004లో ప్రారంభమైన అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ మ్యాచ్‌ల్లో ఏదైనా పోటీ టై అయితే, దాని ఫలితం తేల్చేందుకు బౌల్-ఔట్ పద్ధతిని అనుసరించేవారు. అంటే.. ఒక్కో జట్టు తరఫున ఎంపిక చేసిన బౌలర్లు వికెట్ల పైకి బాల్ విసరాలి.. ఎవరు ఎక్కువసార్లు బౌల్డ్‌చేస్తే వారే విజేత. అదో విడ్డూరం. కాని, సూపర్ ఓవర్‌లో మాత్రం ఆరు బంతుల్లో ఏ జట్టు ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టే కింగ్! కాని ఇది గుండెలు పిండేసిన పోటీ.. చూసినవాళ్ళకే- వొళ్ళు గగుర్పొడిచిందే ఫలితం ఇంకా షాక్ ఇచ్చింది- ఇంతకన్నా లాటరీ వేసి లేదా బొమ్మాబొరుసు వేసి కప్ ఒకరి చేత పెట్టరాదా? ఆడేవాడి కష్టం రూల్స్ చేసేవాడికేమి తెలుస్తుంది? కేవలం అదృష్టవంతులకు దక్కిన కప్పు ఇది. ఆట మాత్రం రెండు జట్లూ బ్రహ్మాండంగా ఆడాయి. ఏరంతా ఈది ఒడ్డున మునిగినట్లు అయింది న్యూజిలాండ్‌కి. ఈ విజయాన్ని అందించిన బెన్‌స్తోకేస్ నిజానికి- న్యూజిలాండు వాడే- క్రీస్తు చర్చి న్యుజిలాండ్‌లో జన్మించాడు. ఆ కుటుంబం అతని పనె్నండు ఏళ్ల వయస్సులో ఇంగ్లండుకి వలస వచ్చింది. వాళ్ళ నాన్న రగ్బీ ప్లేయరు. ఇంగ్లీషు జట్టుకి కోచ్‌గా వచ్చి సెటిల్ అయిపోయాడు. దీంతో బెన్ ఇంగ్లండులోనే క్రికెట్ కోచింగు తీసుకొని- కుడి చేతి బౌలర్‌గా పురచేతి బ్యాట్టింగు నేర్చాడు. గొప్ప ఆల్ రౌండర్ అయినాడు. అతని అరంగేట్రం 2011లో అయింది. మన ఐపిఎల్ వీరుడు కూడా. ఈ వరల్డ్‌కప్ స్పర్ధలో కూడా ఆటను 66.2 సగటు సాధించాడు. మెట్టినింటికి 465 పరుగులు సాధించి నజరానా ఇచ్చాడు.. ఆ మాటకొస్తే మోర్గాన్ డి కెప్టెన్ కూడా ఐర్లండు వాడు. అలాగే సూపర్ ఓవర్లో- యమగా బౌలింగు చేసిన ఇంగ్లండు జట్టు బౌలర్- స్పీడు మాస్టారు- జోప్రా ఆర్చర్ కరేబియన్ దీవులలో పుట్టిన బంతి వీరుడు. ఈ జోఫ్రా 150 మైళ్ళవేగంతో బంతిని బుల్లెట్‌లా విసురుతాడు. మొత్తానికి నిబంధనలు- సమవుజ్జీలుగా చివరిదాకా నిలిచిన జట్లలో ఒకరికి ఖేదం, ఒకరికి మోదం ప్రసాదించాయి. అంతా ఖర్మ అనుకుంటే ఎట్లా? కప్పుని రెండు జట్లకు అప్పగించి సరిగ్గా చెరిసగం కాలం- దగ్గర అట్టేపెట్టుకోమనాలి. అది న్యాయం. ఇక మన జట్టు ఓటమి కూడా కర్మ ఫలమే- గోల్డెన్ బ్యాటు వీరుడు సరిగ్గా ఫైనల్స్‌లో చతికిల బడటమేమిటి? న్యూజిలాండ్‌కి జేజేలు- ఇంగ్లండుకి జయహోలు.. క్రికెట్ గెలిచింది- జనాల హృదయాలు మనసులు కూడా కాచింది. కాకపోతే, రూల్సు మార్చాలి.. బుర్రపెట్టి ఆలోచించాలి.
కుడోస్ టూ బోత్ ది టీమ్స్! త్రీ చీర్స్ టూ క్రికెట్!

-వీరాజీ