వీరాజీయం

మా తెలుగుపిల్లకి విరిమల్లి పూదండ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి ఇండియన్ లేడీ బాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ ఇంకెవరు? మన తె లుగు పిల్ల. వెంకట సింధు.. బంగారు తల్లి. మన దేశం కంటున్న నలభై ఏళ్ల కలను పీవీ సింధు నిజం చేసింది. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌ని కైవసం చేసుకొని దేశ గౌరవాన్ని తన సత్తాని ప్రపంచానికి చాటింది. మన తెలుగు పిల్లకి విరిమల్లెపూల దండ అని కీర్తించండి.. ఆడపిల్లలు షటిల్ ఆటని ప్రేమించండి.. సింధుతో మొదలైన ఈ చరిత్రని కొనసాగించండి.. జయహో!
2017లో కూడా విజయం సింధూదే అని అందరూ భావించారు. కానీ.. తీవ్ర ఒత్తిడికి లోనై సింధూ బంగారు పతకం చేజార్చుకుంది. జపాన్ షట్లర్ నొజొమి ఒకుహర పసిడి ఎత్తుకుపోగా.. సింధు రజతంతో సరిపెట్టుకుంది. రెండేళ్ల తర్వాత ఇపుడు అదే జపాన్ షట్లర్ నొజొమి ఒకుహరతో పోరాడి విజయం సాధించింది. ఒకుహర బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ఆమెపై వ్యూహంతో ఎదురుదాడికి దిగింది. ర్యాలీలు ఆడడంలో జపాన్ షట్లర్లు సిద్ధహస్తులు. అందునా నొజొమికి ర్యాలీలలో తిరుగుండదు. కానీ ఆమె ర్యాలీలను ‘బాడీ స్మాష్‌ల’తో తిప్పికొట్టిన సింధు.. ఒకుహరను కట్టడి చేసి పడేసింది. ఇలా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్‌మెడల్ గెలిచిన ఏకైక భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఈ ఛాంపియన్ షిప్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన షట్లర్‌గానూ నిలిచింది.
ఒలింపిక్స్‌లో సిల్వర్ విజయం తర్వాత సింధు సాధించిన ప్రతిష్టాత్మక విజయాల్లో ఈ గోల్డ్ మెడల్ మరింత ప్రత్యేకమైనది. ఆమె అద్భుతంగా మారడానికి కారణం... కొత్త కోచ్ కిమ్‌జి హ్యున్ అని అంటున్నారు కాని చిరుప్రాయం నుంచి ఆమెను ప్రపంచ ఛాంపియన్ స్థాయిదాక కళ్ళల్లో వొత్తులు వేసుకుని పెంచి ఇంతదాన్ని చేసి, విజేతగా తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్‌కు ఫుల్ క్రెడిట్ ఇవ్వాలని చాలామంది అన్నారు. ఆమె బేసిక్ కోర్టులో కొట్టిన తిరుగులేని ఆఖరి షాట్‌కు ముందు గురువుగారి వేపు చూసింది. ‘ఆ ద్రోణుడు మందహాసం చిందించాడు. ఆ చిరునవ్వు చూస్తో మరుక్షణంలో స్మాష్... సింధు ప్రపంచ విజేతగా కెవ్వున కేకవేస్తూ’ విజయధ్వానం చేసింది. దీంతో ఆ 24 ఏళ్ల ‘తెలుగు తేజంతో’ తెలుగు నేల పంచరంగుల వెనె్నల వెదజల్లింది. ఒక్కసారి అత్యంత ప్రతిష్టాత్మక గోల్డ్ మెడల్ అందుకున్నది ఈ భారతమాత ప్రతినిధి. గత ఐదేళ్ల కష్టానికి సింధుకు సరైన ప్రతిఫలం లభించింది. తెలుగువాళ్ళు మరింత ఎక్కువగా పులకించిపోయారు. కీర్తించారు. కేరింతలు కొట్టారు.
వరుసగా 2013 నుండి ఇప్పటివరకు సింధు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలను గెలుచుకుంది. అయితే ఎప్పుడు కూడా ఫైనల్ విజేత కాలేదు.. ఇదేదో ఈ పిల్లకి శాపం అన్నారు కొందరు.. ఈసారి ఆ ముచ్చటను కూడా పూర్తిచేసుకుంది. 2013 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధు మొదటిసారి రజత పతకాన్ని అందుకుంది. ఆ తర్వాత కూ డా వరుసగా 2014లో రజతం, 2017లో సిల్వర్, 2018 లోనూ సిల్వర్ పతకాలను గెలుచుకుంది. 2017 ఫైనల్లోనూ ఫైనల్‌కు చేరిన సింధు ఇదే ప్రత్యర్థి ఒకుహురా చేతిలో బంగారు చేజార్చుకుంది. దాదాపు 110 నిమిషాల పాటు సాగిన అప్పటి సుదీర్ఘ ఫైనల్ మ్యాచ్‌లో సింధు చివరివరకు పోరాడింది. గోల్డ్‌ను మిస్సయ్యిం ది. కాని ఈసారి 38 నిమిషాలలోనే ‘ప్రత్యర్థిని నేలకరిపించి’ ఇంతవరకు మన వాళ్ళు సాధించలేకపోయిన ఘన విజయాన్ని- పతకాన్ని ఇలా చేత ధరించి ముద్దాడి ఆనందబాష్పాలు జలజలా విరిజల్లుగా కురిపించింది.
సింధునది పేరు మీద మన దేశానికి హిందూ దేశం అని పేరు వచ్చింది అంటారు గాని పూసర్ల వెంకట్ సింధు బ్యాడ్మింటన్ రాణియై ‘తెలుగునేలకి సింధు భూమి’ అని పేరు తెచ్చింది అన్నదో ఇల్లాలు. ఆమెకేం? క్రీడా స్ఫూర్తిగల కుటుంబంలో పుట్టింది అన్నారు. తల్లి తండ్రి కూడా జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, అక్క విద్య కూడా హ్యాండ్బాల్ బ్రహ్మాండంగా ఆడేది. ఆ పరంపరలో సింధు టాప్‌కి వచ్చింది.
జపాన్ ప్లేయర్స్ పొట్టిగా వున్నా ర్యాలీ గేమ్‌లో గ్రేట్. సింధు- టెన్నిస్ రాణి మార్టీనా నవ్రతిలోవా లాగ అయిదు అడుగుల పది అంగుళాల పొడగరి, బరువు అరవై కేజీలు.. ఈ తెలుగు పిల్ల 2011 నుంచి షటిల్ ఫీల్డుమీదకి ఒక కొత్త మెరుపుతీగ లాగా అవతరించింది. ఫైనల్ చేరే క్రమంలో సింధు యమగుచి, తైజుయింగ్ వంటి అగ్రశ్రేణి షట్లర్లను మట్టకరిపించి నేరుగా బంగారు పతకం అందుకుంది. ఇండియాకి వస్తూనే ఈ భారత స్టార్ షట్లర్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ రేపటి ఒలింపిక్స్ మెడల్ ఆశ అయింది. వెంకట సింధు మా సింధు... మా బంగారం అంటూ వెర్రెత్తి పోతోంది బ్యాడ్మింటన్ లోకం.
మంగళవారం నాడు దిల్లీ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది సింధు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమె తన ఆనందాన్ని ప్రధాని మోదీతో పంచుకున్నది. కేంద్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల నజరానాని ఇచ్చి బోణీ చేసింది. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్‌లో ఐదో స్థానంలో నిలిచిన సింధు ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ ర్యాంక్స్ నెంబర్ రెండుగా కొత్త మెట్టెక్కింది. త్వరలో ప్రపంచ నెంబర్‌వన్ అవుతుంది. అందులో అనుమానం లేదు.
మూనె్నళ్లయిందట మొబైల్ ఊసెత్తి. తినడం తాగడం నిద్దరోడం అన్నీ షటిల్ అభ్యాసంలోనే.- పసిదానిగా యాభై ఆరు కిలోమీటర్ల దూరం రోజూ ప్రయాణం చేసి వచ్చి నిరుపమానమైన అభ్యాసం చేసిన ఫలితం ఆమెకు ఇప్పటికి 32 పతకాల రూపంలో దక్కింది. పదిహేను టైటిల్స్‌ని ఆమె జేగీయమానంగా కైవసం చేసుకుంది. అదే ధ్యాస, అదే తపస్సుగా ఇరవై నాలుగేళ్ల ఈ యువతీ రేపటి ఒలింపిక్ పతకం మీద కనే్నసింది. వెంటనే ఫిట్నెస్ కోచ్ దగ్గరికి వెళ్ళిపోతానని ఇది రెస్టుకి టైము కాదని చెప్పింది. ఎనిమిదేళ్ళ పసికూనగా గోపీచంద్ అకాడమీకి యాభై ఆరు కిలోమీటర్ల దూరం నుంచి టంచన్‌గా వచ్చి సాధన చేసిన సింధు ఇవాళ భారతమాత ముద్దుబిడ్డ అయ్యింది. ఆ పిల్ల పట్టుదల, ఆట పట్ల ఆమె తపన మరెవ్వరిలోను చూడలేదని ద్రోణాచార్య, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత అయిన పుల్లెల గోపీచంద్ తెగ మురిసిపోతాడు. కదా మరి?
ఇక, ఆమెకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏనాడో డిప్యూటీ కలెక్టరు హోదా ఇచ్చింది. భారత పెట్రోలియం సంస్థ ఆమెకు పెద్ద ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. సింధు ఇవాళ ప్రపంచ సంపన్న క్రీడాకారుల్లో అయిదవ స్థానంలో సగర్వంగా నిలిచింది. బ్రాండ్ అంబాసిడర్‌గా ‘యాడ్ ప్రోమోటార్‌గా కూడా’ క్రికెటర్ విరాట్ కోహ్లిని వెనక్కి నెట్టేసింది. క్రీడారంగంలో ప్రతిష్టాత్మక ‘రాజీవ్ ఖేల్త్న్ర’ ఆమెను ఏనాడో వరించింది. ఇప్పుడు ఆమెలో ఆడపిల్లకి సహజమైన సౌందర్యరారధన మోజు ప్రబలింది. గ్లామర్ వైపు మనసు లాగింది. ప్రపంచ అత్యున్నత ఫ్యాషన్ మాగజైన్ల ముఖచిత్ర సుందరిగా.. నగలకి, దుస్తులకి మోడల్‌గా కూడా ‘స్మాషింగ్’. అయితే సింధు మన ఆడపిల్లలకి క్రీడాస్ఫూర్తిని ఇబ్బడిముబ్బడిగా అందిస్తుంది అనడంలో సందేహం లేదు. పొడగరి, గడసరి ఆడపిల్లలు ఇంకా నిటారుగా నిలబడి- బ్యాడ్మింటన్ కోర్టులకి మన టీన్స్ - జీన్స్ ధరించి అయినాసరే దారి తియ్యాలి. గల్లీ.. గల్లీ పిల్లకాయలు షటిల్ షటిల్‌గా కనపడాలి. ఈ పాటికే ఈ రంగంలో, మరి చదరంగంలో మన తెనుగుతేజం జేగీయమానంగా వుంది.. అది ఇనుమడించాలి..
హలో టీన్స్ కమాన్ ఏములేట్ గోల్డెన్ సింధు.. త్రీచీర్స్...

-వీరాజీ veeraji.columnist@gmail.com 92900 99512