వీరాజీయం

వినుడు వినుడీ... రూపాయి నోటు గాథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవర్నైనా అడగండి! మీరు రూపాయి కరెన్సీ నోటు చూశారా? అని.
- ఓ పిల్లవాడు చెప్పాడు. అది రిజర్వ్ బ్యాంకులో వుంటుంది. మేం చూడలేదు. పది రూపాయిల నోటుకే చెలామణి లేదు. రూపాయి నోటు ఎవడిక్కావాలి?- అనకండి. ఆ పిల్లవాడు చెప్పింది తప్పు రూపాయి కరెన్సీ నోటు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యిలేదు. దాన్ని గవర్నమెంట్‌వారే నేరుగా ముద్రిస్తారు. రూపాయి నాణెలు ఓ వెయ్యి తీసుకుపోవాలి అనుకోండి- ఓ జోలె సంచిలో పోసుకుపోవాలి.
అందుకనే, వెనుకటి రోజుల్లో ‘‘దుడ్డు’’కర్రలు ఉండేవి. ‘‘దుడ్డు’’ అంటే ‘‘డబ్బు’’.- డెబ్భై రూపాయిల ‘‘చేపాటికర్ర’’అన్న సామెత కూడా అలాగే వచ్చింది. ‘‘బోలు’’చేసిన కర్రలలో బంగారు నాణేలు, వెండి నాణేలు- రాజముద్రలు దాచుకుని అది పట్టుకుని రామేశ్వరం వెళ్ళినా, కాశీకి వెళ్లినా ఆ దుడ్డుకర్ర పట్టుకెళ్ళేవారు. దారిలో ఎవడైనా దొంగాడు పిచ్చిపిచ్చి వేషాలు వేసినా ఆ ‘‘దుడ్డుకర్ర’’తోనే ఓ మొత్తు మొత్తేవాళ్ళు. కాని నాణేలు దాచుకోవడం కష్టం. వాటిని కరిగించి వెండి, బంగారం, నికెల్ లోహాలని అమ్ముకుంటే ఎక్కువ ధర వచ్చేది. దాంతో కాగితం కరెన్సీ వచ్చింది. దానిమీద కాగితం ముక్కకి ఎక్కడయినా, ఎప్పుడయినా దానిమీద గల విలువగల నగదును మేం చెల్లిస్తాం’’అన్న హామీ ఉండేది. ఇది రిజర్వ్ బ్యాంక్ వేసేది. చెలామణీలోకి కరెన్సీ నోట్లు అవసరం వచ్చి గవర్నమెంట్‌వారు రూపాయి నోట్లు తామే ముద్రించారు. వీటి మీద ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంతకం వుండదు. ఇప్పుడు చిన్నసైజు రూపాయి బిళ్లలు కనపడుతున్నాయి. వాటితో ఇంక పెద్ద అవసరం లేదు. రూపాయి బిళ్ళ గుళ్ళో వెయ్యాలి. గాని యాచకుడి చేత బెడితే తిరగబడతాడు వాడు. కాని, పాత నోట్లు పాత నాణేలపై ఎంతోమందికి మోజువుంది యింకా. బ్రిటీష్ రాణి బొమ్మ ఉన్న ‘‘కాయిన్’’, ఎడ్వర్డ్ చక్రవర్తి ముద్రగల నాణెం అంటూ నాణేలు, పాత స్టాంపులు కలెక్ట్ చేసే వాళ్లు, ప్రదర్శించే వాళ్లు వున్నారు. ఆమధ్య అంటే 2016, నవంబరు, ఎనిమిదవ తేదీన ప్రధానమంత్రి మోదీగారు ప్రజల నెత్తిన ఓ పిడుగు ప్రయోగించారు. చెప్పాపెట్టకుండా ఐదువందల నోట్లని, వెయ్యి రూపాయల నోట్లని ‘‘చెల్లవు’’పొమ్మన్నాడు. ఇక లాకర్‌లు చిత్తుకాగితాల ‘‘డస్ట్‌బిన్’’లు లాగా అయిపోయాయి! అట్టి తరి: గడువులోగా చాలామంది బ్యాంకుల చుట్టూ తిరిగి కొన్ని కష్టార్జితం ఐన పాత నోట్లను జమలో వేసుకున్నారు గాని గడువు తీరాక కొందరి దగ్గర దొంగ సొమ్ము గాదు నిజం సొమ్ము దిగడిపోయింది. అట్లా పాత నోట్లను ‘‘సావనీర్‌లు’’గా, జ్ఞాపికలుగా, ‘‘్ఫన్సీ బహుమతులు’’గా, చరిత్ర గుర్తులుగా దాచుకుందామనుకున్నా మోదీగారి గవర్నమెంట్ ‘‘లోపల పడేస్తాం’’మిమ్మల్ని అంటూ బెదరించింది. సరే! దేవుడి హుండీలో పడేశారు భయస్థులు. పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయని. కాని పాపం! ఏడుకొండల వెంకన్నగారి దగ్గర కూడా గడువుతీరాక పడ్డనోట్లు తీసుకోం అన్నారు.
సరదాపడి పది రూపాయిల నాణేలు దాచినవాళ్లు సైతం అవీ, ‘‘రద్దు’’అయిపోతాయి కాబోలు అంటూ హడలి చచ్చారు. సంచులతో నాణేలు యిస్తే తీసుకోం అన్నారు బ్యాంకులు. ‘‘ఎక్కడ పెట్టుకుంటాం? వీటిని. పాత వెయ్యి రూపాయల్నే చిత్తకాగితాల లాగా గుట్టలుగా పడేస్తున్నాం’’ -అన్నది వాళ్ల రోదన. అంతా జరిగింది. కానీ మళ్ళీ ఎన్నికలు. అదే మోదీ టీము. రాజదండం అంది పుచ్చుకున్నది. కొంతమంది దగ్గర పాత నోట్లున్నాయి యింకా. ఓ పెద్దమనిషి రుూమధ్యనే సుప్రీంకోర్టు తలుపుతట్టాడు. ‘‘అయ్యలారా! వినండి నా దీన గాథ అన్నాడు. దీనుడేం కాదు. అతను తనదగ్గర ఒక కోటి పదిహేడు లక్షల నోట్లు ఉండిపోయాయి. వాటిని రిజర్వు బ్యాంక్ తీసుకుని నాకు మింజుమలే కొత్త నోట్లను యిప్పించండి మహాప్రభో! అని మొరపెట్టుకున్నాడు. తాను కట్టల్నీ ఈ మర్కంటైల్ (తమిళనాడు) బ్యాంకుకు తీసుకుపోయి తన అకౌంట్‌లో పడేసుకోమన్నాడు. అతను మధురై వాడు. పరాయివాడు కాదు. కానీ వాళ్లు ‘‘నో ఎక్సేంజి’’ అన్నారు. నేరుగా రిజర్వు బ్యాంకుకి ధరకాస్తులు, విజ్ఞప్తి నోటీసులు గట్రా యిస్తూ తగులుకున్నాడు. కాని వాళ్లు ‘‘యితమిత్థంగా’’ ఏమీ చెప్పలేదు.
‘‘యస్.ఆర్.నో’’ చెప్పాలిగా. ఇన్నాళ్ళకు రిజర్వు బ్యాంక్ జాలిపడ్డది. తీసుకోలేమండీ పాత నోట్లు అన్నది. అది ఏమిటో? మరి! యివతల యింకా పాత నోట్లకట్టలు ‘‘లారీల’’లో, ‘ట్రక్కు’లలో బయటకి వస్తున్నాయి. వాటిని ‘‘మారుస్తాం’’అంటూ దళారుల ముఠాలు కూడా రెడీగా వుంటున్నాయి. దీంతో పెద్ద కోర్టువారు గవర్నమెంట్‌కో‘‘లకోటా’’కొట్టారు. ఇది యిట్లుండగా వైజాగ్ దగ్గర ఓ ముఠా దొరికింది. పాత నోట్లు ‘‘నకిలీవి కాకపోతే’’తీసుకుని ఓ కోటి పాత నోట్లకి పదిహేను లక్షల కొత్త నోట్లు యిప్పిస్తాం అన్న సదరు ముఠా పోలీసులకు - ‘‘ఓ దొంగ పోలీసు శకటం’’తో సహా దొరికిపోయారు.
ఇట్లు పెద్దపెద్ద పాత నోట్లు వీధుల పాలవుతున్న దశలో కేరళ రాష్ట్రంలో ‘‘చెర్తోలా’’అను గ్రామంలో అరవిందకుమార్ పాయ్ అనే చిన్న ప్రాథమిక స్కూల్ టీచర్ వున్నాడు. అతనికి తపాలాబిళ్లల ‘‘కలక్షన్’’ హాబీవుంది. అందులో ‘‘లిమ్కా’’బుక్ రికార్డుకూడా వుంది. కాని మరేదైనా చేద్దాం- అనుకున్నాడు. అప్పటికి అతని వయస్సు యిరవై నాలుగు. ఇప్పటికి పదేళ్ళు కావస్తోంది. ముప్పయి నాలుగో ఏడు తొంగిచూస్తోంది. ఈయన ఒకసారి తనదగ్గర ‘‘రూపాయి నోట్లు’’ (పాత, కొత్తవి) అయిదువందలున్నాయి. అని- వాటిని యిలా అపురూపంగా దాచుకుంటున్నాను అని గ్రహించాడు. అతని హాబీ మారింది. ఈ స్కూలు మాష్టారు స్వతంత్ర భారతంలో 1947నుంచీ యివాళ్టిదాకా వస్తున్న రకరకాల చిత్ర విచిత్ర చరిత్రగల రూపాయి నోట్లను ఒకటిగాదు వరుసగా ఐదు ‘‘ఒకట్లు’’ ఓ దానిప్రక్కన వొకటి నిలబెడితే ఎంత సంఖ్య వస్తుందో అన్ని-గొప్పగా గర్వంగా ప్రదర్శించాడు. అంటే పదకొండువేల నూట పదకొండు- అయితే బ్యాంకుల్లో దొరికే ‘‘కట్టలు’’కావు యివి. ఓ కట్టలో వంద వుంటాయి. అవి, అయితే గాని, ఈతని ‘‘కలక్షన్’’లో ప్రతి నోటుకి ఒక కథ వుంది. ఓ చరిత్ర, ఓ శాశ్వత విలువ కలిగి వున్నాయి. అది గవర్నమెంట్ సెక్రటరీలలో ప్రతి ఒక్కడు సంతకం చేసిన నోటూ ఒక దానిని ఐనా మన అరవిందుడు తన ‘డబ్బీ’లో నొక్కేశాడు. కొన్నింటికోసం దాచిన అపురూపమయిన పోస్టల్ స్టాంపులను కూడా వదులుకున్నాడు. ఓ యిద్దరు ఆర్థికశాఖ సెక్రటరీల ‘‘నిశానీ’’వున్న రూపాయి నోట్లు యితనికి దొరకలేదు. ఆ యిద్దర్ని ఎలా మినహాయించడం.? వాటిని వేటాడి రూపాయికి వెయ్యి రూపాయలు యిస్తాను అనికూడా ప్రామిస్ చేసి ‘‘చరిత్ర’’చెప్పే రూపాయి నోట్లు సేకరించాడు. 1964 సంవత్సరంనాటి ఓ అపురూపమైన రూపాయి ‘‘కాయితం’’కోసం అతను పదివేలు సమర్పించుకున్నాడుట.
(ఔరా!) అతని ‘ఖజానా’-అనొచ్చు దానిని. అందులో ఇంకా అద్భుత చిత్రాలున్నాయి. ముక్కున వ్రేలేయించే చరిత్ర వుంది. అసలు మొట్టమొదట మన దేశంలో 1917లో రూపాయి ‘‘కాగితం’’వచ్చింది. ప్రథమ ప్రపంచ యుద్ధం తర్వాత ‘‘నాణాలు’’ముద్రించడానికి లోహం యొక్క కరువు ఏర్పడ్డది. అదీ కరెన్సీ నోటు పుట్టకకి కారణం. మొట్టమొదటి ‘‘రూపాయి కాగితం’’ పుట్టిన రోజు నవంబర్ 30, 1917. జ్ఞాపకం పెట్టుకోండి. రూపాయి కాసుమీద ఐదవ జార్జి చక్రవర్తి (కింగ్‌జార్జి అనే వారు) ముద్ర ఉండేది. ఆ కాయిన్ బొమ్మ రూపాయి నోటుకి కుడిప్రక్కన పై మూలమీద వేశారు. దీని ప్రింటింగ్‌ని 1926లో ఆపేశారు. (కాగితం కొరత కాబోలు) ఆనక మళ్లీ 1940లో ‘‘రూపాయి కాయితం’’ ప్రత్యక్షమయింది. మనవాడు ఈ ‘‘మచ్చు’’లు సేకరించాడు. అది అట్లుండగా మనం స్వతంత్రులం అయినాక మన సొంత రూపాయి కాగితం ఆగస్టు 12, 1949లో మూడు సింహాల బొమ్మతో వచ్చింది. అంటే రూపాయి కాగితం 70వ వార్షికోత్సవం చేసుకోవాలి. మనం యిప్పుడు కాకపోతే ఆ నోటు 1994లో శలవు తీసుకుంది. మళ్లీ సదరు చివరి రూపాయి కాగితం మీద మాంటేక్ సింగు అహ్లూవాలియాగారి సంతకం వుందిట. కాకపోతే 2015లో రుూ రూపాయి నోట్సు తగుమాత్రంగా ప్రింట్ చేస్తాం అని మన గవర్నమెంట్ చెప్పింది. కాని ఆ నోట్లు ‘‘మన కంట పడలేదు. ఇప్పటికీ అయితే’’ 2018 అని ముద్రించబడిన నోటుమీద సంవత్సరం అంకెని నిలువుగా ముద్రించారని అరవింద్ చెప్పాడు. అతను సేకరించిన ప్రతి రూపాయికి అక్షర లక్షల విలువచేసే గ్లామర్ ఉంది. చరిత్రలో ముఖ్యమైన తేదీలతో ముద్రింపబడిన రూపాయిలు ఉన్నాయి అరవింద్ దగ్గర ఉదాహరణకి 120849 అన్న సీరియల్ నంబర్‌గల నోటుంది. అది 12, ఆగస్టు (19)49లో ప్రింటు అయిందిట. ఇట్లా రూపాయి నోటు కథ ఎంతో వుంది చెపుతూ పోతే. చిత్రాతిచిత్రంగా..
- గ్రేట్! దిస్ యంగ్ టీచర్ ఈజ్ ఏ రోల్ మోడల్ టు కిడ్స్!

veeraji.columnist@gmail.com 92900 99512