వీరాజీయం

రోదసీ రంగంలో పెరిగిన మన హోదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రకోట బురుజు మీద త్రివర్ణాంకిత పతకం రెపరెపలాడిన తరువాత - ఫేల్యూర్ అన్న మాటని నిఘంటువులోంచి ఎత్తేసినది మన సైంటిఫిక్ రంగమే! ఇస్రో స్థాపించిన దాది మనవాళ్లు అంతరిక్షానికి నిచ్చెనలు కడుతూనే వున్నారు.
భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో దేశవాళీ ప్రజ్ఞాపాటవాలే గాదు- సరుకూ సరంజామా కూడా మనం సొంతంగా- అటు వాణిజ్యం, యిటు విజ్ఞాన రంగం- రెండందాలా రాణిస్తున్న మనవాళ్ల ప్రతిభ ప్రక్కలో బల్లెంలాగా వున్న చైనావాడు అచ్చెరువు పొందేటంతగా విజయకేతనం ఎగురవేస్తూనే వున్నది-
‘‘జయహో ఇస్రో! జేజేలు ఇస్రో’’అన్న బృందగానం ప్రపంచ సైంటిస్టుల గుండెల్లో మారుమ్రోగిస్తూనే వున్నది. ఇన్సాట్-3.డి.ఆర్. ప్రత్యేక వాతావర్ణ వీక్షక బుల్లి ఉపగ్రహం గురువారం సాయంకాలం కేవలం పదిహేడు నిమిషాల కాలంలో భూమికి 170 కిలోమీటర్ల సమీప కక్ష్యలో ప్రవేశించి డ్యూటీ ఎక్కేసింది. దీంతో యిక్కడ యువజనులు, విద్యార్థులు రోడ్లమీదికి పరుగులు తీసి- చాక్‌లేట్లు పంచుకుంటున్న దృశ్యాలు ఎక్కడా కానరాలేదు గానీ- పిటీ! రియల్లీ పిటీ! యువతరాన్ని ఉత్తేజపరిచే అవగాహనా పటిమ మనవాళ్లకి లేని కారణంగా- సందడి యినుమడించలేదు గానీ, ప్రపంచ నేత్రం అబ్బురపడి, రుూ సన్నివేశాన్ని- ముక్కున వేలేసుకుని మరీ చూసింది! అంతరిక్షయాన ఘనాపాటీ దేశాలలో మన హోదా మరో మెట్టు పెరిగింది. అంచాత, ‘మనవాళ్లు, వెధవాయ్‌లోయ్!’ అనకండి. అలా అన్న వెధవాయ్ చెంప ఛెళ్లుమనిపించండి. పాల పండ్లు వూడని ‘పిసురు’గాడి దగ్గర్నుంచీ- ఆఖరి ప్రస్థానానికి సిద్ధమవుతున్న వాడిదాకా - అందరికీ స్మార్ట్‌గా మొబైల్స్ నొక్కడం తెల్సును రుూ దేశంలో...
‘‘వాన పడుతోందా?’’ అనడిగితే, కిటికీలోనుంచి అవతలికి చూడడు. స్మార్ట్ ఫోన్ నొక్కుతాడు. ‘‘ఓ.కే. గూగూల్ విద్యానగర్‌లో వానపడుతోందా? అనడుగుతాడు.’’ ‘‘సికింద్రాబాద్ ఫోర్‌క్యాస్ట్ ఏమిటీ?’’ అంటాడు.
భూగోళం బొమ్మకి బూజు టోపీ పెట్టి- ‘‘ఇరవై రెండు డిగ్రీలు- చిన్న చిరుజల్లులు’’అంటూ బొమ్మతో సహా సమాచారం అందుతుంది-
కాని ఆ సమాచారం అదెక్కడినుంచి వస్తోంది? గ్రహచారం మన దేశానికి చాలా బాగున్నది రుూ రంగంలోనే, ఇన్సాట్ జియో సిక్రనస్ ఉపగ్రహం అందిస్తే వస్తోంది. ఈ విశాల భూగోళంలో ఇండియా అంత విశాలమయిన మ్యాప్ ఒకటి గీసినా- రుూ బుల్లి కృత్రిమ చందమామకి సూదిలో చుక్క పెడదామనుకున్నా చోటు దొరకదు. గానీ కేవలం 250 కోట్ల రూపాయలు ఖర్చుతో మనవాళ్లు ప్రయోగించిన రుూ బుల్లి హీరో ఇన్సాట్- 3.డి.ఆర్. అత్యంత అధునాతనమైన ‘వెదర్‌కాక్’ అవుతుంది.
జి.యస్.ఎల్.వి. ఎఫ్.ఫైవ్ అన్న పేరున్న రోదసీ ఉపగ్రహ వాహక రాకెట్ భూస్థిర కక్ష్యలో వొదిలిపెట్టిన రుూ బుల్లి ఉపగ్రహం బరువు కేవలం 2,211 కిలోలు మాత్రమే! కానీ దీనికి భూమీద సముద్రాలు, కొండలు సహా- అన్నిచోట్లా అన్నివేళలా సంభవించే వాతావరణ మార్పులు, చేర్పులు, కూర్పులు- అన్నిటినీ చూడగల కనులూ, వినగల చెవులూ ఆ సమాచారాన్ని అత్యవసరంగా బట్వాడా చేయగల శక్తిసామర్థ్యాలూ వుంటాయి.
ఇది పదేళ్లపాటు వెదర్ రిపోర్టర్, కిరికిరిలు లేని నిష్కామ రోదసీ సంచారి. ఇన్‌ఫ్రారెడ్ బ్రాండ్ ఇమేజింగ్- సముద్రాల ఉపరితల మార్పుల్ని పట్టుకోడానికి రెండు థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ బ్రాండ్ ఇమేజింగ్ ఏర్పాట్లు వగైరాలున్నాయి. దీని ప్రయోగానికి అయిన ఇంధనం ఖర్చు 1255 కిలోలేనంటే మీరు నమ్మరు.
‘‘మరి యిది ఒన్‌డే మ్యాచ్ పెట్టుకోడానికి ముందే, ఆరోజు వానపడుతోందో, లేదో చెప్తుందా?’’ ఓ బుల్లి కొహ్లీగాడి డౌటు. అలాంటివి రుూపాటికే మనవాళ్లు పంపించినవి ఆరు ఉపగ్రహాల్ని అంతరిక్షంలో డ్యూటీ ఎక్కించింది. అయినా అతి చిత్రమైనదీ పెద్దదీ అయిన ఉపఖండం ‘‘షేప్’’- చాలా యిబ్బంది పెడుతూనే వుంటుంది గానీ ఇన్సాట్ 3.డి.ఆర్. చాలా లోటుపాట్లను సవరిస్తుంది- అంటున్నాడు ఇస్రో విజ్ఞాని- గ్రేట్!
అయితే, అహమ్మదాబాద్‌లో, త్వరలో పనిచేసే స్పేస్ అప్లికేషన్ సెంటర్ కుదురుకొన్న తరువాత, ‘‘వచ్చే ఏడాది మా అమ్మాయి పెళ్లి ఫలానీ ముహూర్తానికి అహోబిళంలో నాటి వాతావరణం ఎలా వుంటుందో చెప్పగలరా?’’ అంటే- ‘‘ఓ.కే. మైబోయ్!’’అంటూ చెప్పే సామర్థ్యం మనవాళ్లకొస్తుందిట!
భూ కక్ష్యనుంచి యిది రెండు ముప్ఫయి అయిదు అంటే 70 కిలోమీటర్ల ‘ఎత్తు’న- బొడ్డు త్రాడు తెంచుకుని అమ్మ గర్భం లాంటి జి.యస్.ఎల్.వి.నుంచి బయటపడ్డప్పుడు ఇస్రో సైంటిస్టుల ఆనందం అవధులు దాటింది. ఇంతటి శుభవార్త అనే రొట్టెముక్కకి తేనె, వెన్న రాసినంత యిష్టమైన మరో వార్తకూడా అప్పుడే అందింది. చైనా దేశం లాంగ్ మార్చ్ 4సి రోదసీ వాహక నౌక ప్రయోగించిన యిటువంటి వెదర్ సాటిలైట్ ‘గోఫెన్-10 శాటిలైట్ బుడుంగ్‌మంటూ క్రిందనెక్కడో పడిపోయింది- అయ్యో! పాపం!
2013 తర్వాత చైనా దేశానికి యింతటి భంగపాటు జరుగలేదుట. ‘జయహో! ఇస్రో’ అంటూంటే ఓ బామ్మగారు అంటున్నది- ‘‘మన గ్రహచారం బాగున్నది. వాళ్ల గోచారం బాగులేదు’’- అని. గానీ మనది అపూర్వ విజయం. శ్రీహరికోట మనదేనోయ్! ఇస్రో ఘనత మనదేనోయ్!
కమాన్, లెటజ్ సెలిబ్రేట్ యిట్ ఎలౌడ్!!