వీరాజీయం

చెలిమికి ఇక చెల్లుచీటీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌జెడి పార్టీ అధినేత, బిహార్ మాజీ సిఎం లల్లూప్రసాద్ యాదవ్ జైల్లో లేకపోయినా శ్రీకృష్ణుడంతటి వాడే! కాకపోతే ఇప్పుడు మురళి చేతిలో లేని కృష్ణుడిలా కనిపిస్తున్నాడు. జైలు నుంచి వచ్చినా- బెయిలు అతణ్ణి స్వేచ్ఛగా బతకనిస్తోందే గానీ.. అదేం స్వేచ్ఛ? కాళ్లూ చేతులూ కట్టేసి, మైదానంలో వదిలేసి ‘ఇదంతా నీదే.. ఆడుకో’మని అన్నట్లుగా వుంది. ఇక బిహార్ సిఎం నితీష్‌కుమార్ జెడి (యు) పార్టీ బాస్ మాత్రమే అయినా, అర్జనుడంతటివాడే! ‘మహాకూటమి’ (గ్రాండ్ అలయన్స్)ని ఇప్పటిదాకా రెండు చేతులా కంట్రోలు చేసుకుంటూ బ్యాలన్స్ ఆట ఆడుతున్నాడు. నాటి కృష్ణార్జునుల మధ్యనే యుద్ధం రాంగాలేనిది, అభినవ ‘కవ్వడి’కి కృష్ణుడితో చెడిపోయి చొక్కాచేతులు మడిచి, గోదాలోకి దొకితే- ‘తాంబూలాలు ఇచ్చేశాను.. ఇక తన్నుకు చావండి’- అంటున్న శ్రీమాన్ నరేంద్ర మోదీ- ‘ది సుప్రీమ్’గారు వెనక్కి తగ్గేది లేదు. అలాంటి అవకాశం లేకుండా ఆయన ‘రద్దు’ యోధుడిగా ముందుకు దూసుకుపోతున్నాడు.
అందువల్ల ‘తాంబూలం నుంచి ఒక్క సోపుగింజ కూడా వెనక్కి తీసుకోడు’అని తెలిసిపోతోంది. ఆర్థిక వ్యవస్థలో జిడిపి తగ్గినా, బిజెపి జోరు తగ్గినా- అరచేతిలో ‘మొబైల్’. అందులో బాపురే! దానిలో పదునాలుగు భువనములూ చేపట్టేస్తున్నాడు. దేశంలోనే అతి పెద్ద మొండి రాష్ట్రాలలో ఒకటయిన బిహార్‌లో లల్లూ-నితీష్‌ల ‘జుగలబందీ’కి- ‘రద్దు రూపాయల’ బందీ అడ్డం పడ్డట్లే. లల్లూజీ ‘నో’ అంటున్నాడు. వెయ్యి రూపాయల నోట్లు చాలా పెద్దవేనేమో గానీ, అవి రైతుకున్న ఎద్దుల దాణా, ఎరువులకి చాలా వేలు అవసరం. పెద్దనోట్ల రద్దు వల్ల రైతు కుదేలవుతాడు’ అని అంటున్నాడు- ‘పశుదాణా ఫేమ్’ యాదవుడు. మొత్తం మీద లోపల ‘లుకలుకలు’ ఎన్నో వున్నట్లే- ఇపుడు బయటపడుతోంది. అంచేతనే, నితీష్‌కుమార్‌జీ ‘దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న నిశ్చయానికి వచ్చాడు. కాకపోతే, అసలు లోపల లోపల వున్న ప్రధానమంత్రి పదవి వ్యామోహం మీద ‘దింపుడు కళ్లం’ ఆశ కూడా పోలేదు అతనికి.
అందుకనే యుపి ఎన్నికలలో అలయన్స్ కట్టి రంగంలోకి దిగాలి. దిగి, తన ‘ఆలిండియన్ ఫేస్’ని ప్రదర్శించాలి. అయితే లల్లూ ఒక ‘బుల్లీ’. ఎడాపెడా వాయించేస్తే తప్ప అతనికి ఆకలెయ్యదు. నెత్తిమీద కిరీటం లేదు గానీ, నేనే రాజుని. అవతలివాడు ‘డమీ’నే. కావాలంటే దించేస్తానంటాడు. అతని అనుయాయులు, కుమారులు వగైరా వాళ్ల యిష్టం. మంత్రులుగా ఐనా గుఱ్ఱాలు ఎక్కుతారు. గాడిదల్ని కూడా తోలుతారు. వాళ్లు ముఖ్యమంత్రి నితీష్‌ని ‘కేర్’ చెయ్యరు. అటువంటి తరుణంలో- వెయ్యి, అయిదొందలు రూపాయినోట్ల (రద్దు) అంతిమ యాత్ర- రెండూ చారిత్రాత్మకంగా, అత్యంత ఉన్నత సంస్కరణలుగా నితీష్‌కుమార్ బాజా భజంత్రీలు పట్టుకుని ప్రచారం చెయ్యడంలో వున్న ‘లోగుట్టు’ ఎందరికో ఎరిక అయింది. అవతల ఇంచుమించు కాంగ్రెస్, ఆర్‌జెడి ‘్భయ్ భాయ్’ అంటున్నట్లే కనబడుతోంది. 2019లో మన దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అంటే మాత్రం లల్లూప్రసాద్‌కి వొళ్లు మండిపోతోంది. అదొక్కటి తప్ప కాంగ్రెస్ పార్టీకి, లల్లూకీ పొత్తు గ్రాండ్‌గానే సాగుతోందేమో. బిహార్‌లో మద్య నిషేధం పెట్టి నిభాయిస్తున్న నితీష్‌కుమార్- జనం హామీలు నెరవేర్చే సుప్రీం నాయకుడిని తానే కావాలనే కోరుకుంటాడు. లోగడ మోదీ విషయంలోనేగా నితీష్‌కి, ఎన్‌డిఏతో చెడింది. ఆలిండియా ఫేస్ కావాలి నితీష్‌జీకి. అయితే, లల్లూని- ‘వెళ్లి గేదెలకి పాలు పితుక్కో..’ అని తోలగల శక్తిలేదని తనకీ తెల్సు. అందుకని ముందు జాగ్రత్త చర్యగా, ముందర కాళ్లకి బంధంగా మోదీని నితీష్ ఉబ్బెస్తున్నాడు అని పరిశీలకుల అంచనా. లల్లూని బ్లాక్‌మెయిల్ చెయ్యడానికే నితీష్ భాజపా లీడర్స్‌ని దువ్వుతున్నాడన్నది- పాట్నాలో జనవాక్యం.
రాజకీయాలలో ‘పొత్తులు- కత్తులు’ కొత్త కాదు. ముఖ్యంగా ‘కలయికలు’, ‘సంఘటనలు’ లాంటివి ఎప్పుడూ పాకుడు నేల మీద పరుగులు లాంటివే. దీనదయాళ్ ఉపాధ్యాయ్‌ని, భాజపానీ తిట్టిన నోటితోనే నితీష్‌జీ - దీనదయాళ్ శత జయంతి వేడుకల కోసం ఏర్పడ్డ కమిటీతో తాను మెంబర్ కావడమే కాకుండా- హరివంశ్‌నీ, శరద్‌యాదవ్‌నీ కూడా సభ్యులుగా చేర్చాడు. ఎందుకయినా మంచిది- భాజపా ఎమ్మెల్యేల బృందంలో ఉన్నది ఎందరో? జె.డి.(యు.) ఎమ్మెల్యేలు ఎందరో? అని లెక్కలు చూసుకుంటే బెటర్ కదా అని చూసుకుంటున్నారు. రెండూ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 123 వస్తుంది. దాన్నలా గోడకి చేరబెట్టి వుంచాలన్న ‘వ్యూహరచన’ వున్నదనే అందరూ అంటున్నారు. లల్లూతో అంతా ‘యాదవ కుల కలకలం’గానే వుంటుంది- తప్ప సెక్యులరిజం, సర్వమానవ సంఘీభావం లాంటి కబుర్లు చెప్పడు.
లోపాయికారీగా భాజపాలోని కీలక నాయకులు కొందర్ని బిహీర్ ముఖ్యమంత్రి దువ్వుతున్నట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. కేవలం భాజపా బలమే ఈ ‘విచిత్ర సోదరులు’ అనగా లల్లూప్రసాద్, నితీష్‌లను ఒక్కటికా చేసిందంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వ్యాఖ్యానించాడు. అంటే అర్థం ఏమిటి? 23 సంవత్సరాల పాటు పరస్పరం మాటలు లేని ఎడమొహం పెడమొహం లాంటి నితీష్, లాల్లూప్రసాద్‌లు, ‘చేతులు కలిసిన చప్పట్లూ’’ అంటూ కలిశారే తప్ప- మనసులు కలవడం అన్నది ఉత్తమాట అని భాజపా వర్గాల అంచనా. జనతా పరివార్ మళ్లీ తన ప్రభావాన్ని బిహార్ రాజకీయ తెరమీద- పంచవర్ణ చిత్రంగా చూపించగలదన్న క్రిటిక్స్ కూడా వున్నారు. ఏది ఏమైనా నితీష్‌కుమార్- మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నట్లు, నరేంద్రుని బలగంలోని కీలక వ్యక్తులతో తరచూ భేటీ అవుతున్నట్లు బిహార్ పత్రికలు టాంటాం కొడుతున్నాయి. మరోవైపు లల్లూప్రసాద్ ప్రధాని మోదీ మీద పదమూడు బాణాల్లాంటి ప్రశ్నలు సంధించాడు. నోట్ల రద్దును ఒకే సంఘటనలోని, ఒకే గవర్నమెంట్‌లోని ఇద్దరు ప్రధాన నాయకులు- ఒకరు సమర్ధించగా, మరొకరు దుయ్యబట్టడం- రాజకీయ రంగం ఎనె్నన్ని లఘుటిప్పణిలకయినా ఆస్కారం ఇస్తుందన్నది- బిహార్‌లో రుజువవుతున్నది. జైల్లో వున్నప్పుడే బోలెడు పవర్‌ఫుల్‌గా వున్న లాలూని - అతను ఇటీవల విజయగర్వంతో విర్రవీగుతున్నప్పుడు ఎదుర్కోడం కష్టమే గానీ- ‘నిత్య సంకటం.. నూరేళ్లాయుష్షు’ అన్నట్లుగా వుందక్కడ. షాబుద్దీన్ జైల్లో నుంచి విడుదలై రావడం, రాంగానే పెద్ద పొలిటికల్ లీడర్ పోజులో నితీష్‌కుమార్‌ని విమర్శించడం జరిగింది- ఎంత పొగరు? ‘పొత్తు’? ఎదురుపడితే, చేతులు కలిపే పొత్తు వెనుదిరిగితే- విచ్చుకత్తుల చిచ్చుగా క్రమేపీ మారిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతవరకూ ఉపయోగించుకుంటుందన్నదే అమూల్యమైన ప్రశ్న.
‘ఎనీవే అలయన్స్ ఈజ్ ఇన్ ట్రబుల్ దేర్!’
*