వీరాజీయం

ఎంపి గారికి సుప్రీంకోర్టు అక్షింతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో కోర్టులు, హైకోర్టులు- సుప్రీంకోర్టు అయితే మరీను- ఎప్పుడూ బిజీయే. ‘్ధర్మసందేహాలు తీర్చడానికే న్యాయపీఠం’అన్న తీరు ఒకటయితే హైకోర్టు యిచ్చిన తీర్పు మీదనో, ‘స్టే’మీదనో అర్జెంటుగా సుప్రీంకోర్టు తలుపుతట్టడం రానురాను పరిపాటి అయిపోతోంది.
మొన్న శుక్రవారంనాడు సుప్రీంకోర్టుకు ఒక ఎంపిగారు- తనుంటున్న సర్కారీబంగ్లా ఖాళీ చేయించేస్తున్నారు గవర్నమెంటువారు- అర్జెంటుగా అభయహస్తం యిచ్చి సదరు గెంటివేతను ఆపివేయమంటూ గయోపాఖ్యానంలో ‘గయుడు’ మాదిరి అప్పీలు తీసుకుపోగా దేశంలో అత్యున్నత న్యాయపీఠానికి పీకలమొయ్యా కోపం వచ్చింది. పైగా ధర్మాసనం మీద చీఫ్ జస్టిస్ టి.యస్.్ఠకుర్‌గారే ఆసీనుడై వున్నాడు. ధర్మాసనం అంతటితో ఊరుకోలేదు. ‘‘కేసు తీసుకున్నాం. డిస్‌మిస్ చేశాం’’- అంటూ చీవాట్లు వేసింది.
క్రింద హైకోర్టులో శృంగభంగం అయింది. ఇక్కడ మొట్టికాయలు పడ్డాయ్. ఈ పిటిషన్ పెట్టుకున్న ఎంపిగారి పేరు- అధీర్ రంజన్ చౌధురి. కాంగ్రెస్ పార్టీ పాత కాపు. నాలుగుసార్లు లోక్‌సభకు పశ్చిమ బెంగాల్‌లోని బరహాంపుర్ నియోజకవర్గంనుంచి గెలుపు జెండా ఎగురవేస్తూ వస్తున్నాడు. అంటే, బాగా ముదురుకేసన్నమాట. గొప్ప చురుకుగా వుంటాడు.
2015లో ఒకసారి పశ్చిమ బెంగాల్ కలకత్తాపురిలో మమతాదీదీకి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో వీరంగం వేసి, అఖిల భారత్ ఖ్యాతి సంపాదించుకున్నాడు. ఆనాడు ‘‘సారు’’ పోలీసులనెదిరించి- తన చొక్కా ఫర్రున చించేసుకుని బోర విరుచుకుంటూ- ‘‘దమ్ముంటే నామీద చెయ్యి చేసుకోమనండి’’ అంటూ రెచ్చిపోయాడు.
అధీర్‌చౌధురీగారు 2012లో మన్‌మోహన్‌సింగ్‌గారి క్యాబినెట్‌లో ఒక చిన్న మంత్రి. అప్పుడు మంత్రులకి యిచ్చే బంగ్లా ఒకటి ఆయనకి కేటాయించారు. రోజులు మారాయ్ కానీ తాను మారలేదు- అతని యావా మారలేదు. ఈసారి ప్రతిపక్షంలో కూర్చున్నాడు. కానీ పాత వాసనలు ఏవీ పోలేదు. ‘‘ఇల్లు ఖాళీచెయ్యండి అధీర్‌గారూ- దీన్ని యింకో మంత్రిగారికి అలాట్ చేశాం’’- అన్నది గవర్నమెంటు. ఐతే నాకు న్యూమోడీబాగ్‌లోని చాణుక్యపురి నివాసం అలవాటయి పోయింది. వదలబుద్ధికాలేదు. దీనికి దగ్గిరగా నాకు గృహవసతి కల్పించండి. దూరంగా పోలేను’’అంటూ నెట్టుకు వస్తున్నాడు పలుకుబడి, ఆర్భాటంవున్న మాజీ రైల్వేశాఖ ఉప మంత్రికి దర్పంకూడా పోలేదు. పార్లమెంటులో కూడా ఎప్పుడూ నలుగురి కంటా పడుతూ వుంటాడు. పోయిన ఏడాది, అంటే 2015లోనే సారు- సభాపతిగారి ముందుకు దూసుకుపోయి- ‘బావి’లోనుంచి కేకలు వేశాడు. సహనం కోల్పోయిన సుమిత్రా మహజన్ యితణ్ణి సస్పెండ్ చేసింది. అంచేత మొత్తంమీద కొంచెం మెత్తగానే- ‘‘ఖాళీ కరోసాబ్’’- అంటూ గవర్నమెంటు చెప్పింది.
ఎన్‌డిఏ పాలనా యంత్రాంగం తాము ‘‘పోయినేడాదే జనవరి 22న వేరే ఇల్లు కేటాయించాం’’ అంటున్నారు.
‘‘అదేం లేదు. వీళ్లు కేటాయించాం అన్న ఆ యింట్లో యింకెవరో వుంటున్నారు. అందుకనే, నేను యిక్కణ్నుంచి కదలను. నేనేమన్నా వూరికే వుంటున్నానా? అద్దె కడుతున్నాను’’అంటూ చిందులుత్రొక్కిన అధీర్‌గారితో యిక వేగలేం అనుకొని, మొన్న రెండో తేదీన అధికారులు ఓ పది మంది పోలీసుల్ని వెంటేసుకుని వెళ్లారు. మాటలు మెత్తగానే వున్నాయి గానీ, తాత్పర్యం ఒకటే. ‘‘పోతారా? సామాన్లు బయటికి విసిరేయమన్నారా?’’అంటే- ‘‘ఏం? జోకా? వూరికే వుంటున్నానా? మా తాత ముల్లె యిది అన్నానా? హైఁ...’’అంటూ బెంగాలీ హిందీలో తన సహజధోరణిలో - టాప్‌గేర్‌లో పడిపోయాడు. ఈలోగా ఓ పది మంది జర్నలిస్టులు అటుగా వచ్చారు. ‘‘చూస్తున్నారా, రుూ దౌర్జన్యం’’ అంటూండగానే, శ్రీమాన్ చౌధురీగారి సామాన్లు కొన్నింటిని, నిజంగానే బయటపడేశారు పనివాళ్లు. అధికారంలో లేకపోతే, అంతేగా? అధీర్‌గారు అధైర్యపడ్డాడు. ఒక్క పూచిక పుల్ల యిందులోది పోయి నా- ఖబర్‌దార్, గవర్నమెంటు అచ్చుకోవా’’-అంటూ సుడిగాలిలా వెళ్లిపోయాడు. హైకోర్టుకెక్కాడు. మంచి లాయర్ (కపిల్‌సిబల్ కాదనుకుంటాను) పెట్టుకున్నాడు. దీనగాథ విన్న ‘‘హై’’ మేం ఆర్డర్‌వేసే దాకా- ఎక్కడి సామాన్లు అక్కడే వుంచి- ఆయనను ఉండనీయండి’’అంటూ ఆర్డర్ వేసింది. ఈలోగా ఏలినవారు కరెంట్ కట్ చేసేశారు. నీళ్లు బంద్ చేశారు. కోర్టు రుూ విషయంలో ఏమీ చెప్పలేదుగా మరి. అధీర్ రంజన్‌గారి ఆశ మర్నాడే అడియాస అయిం ది. నీకు ‘స్టే’అంటూ ఆర్డర్ యివ్వలేమయ్యా. యు బెటర్ వెకేట్ అంటూ హైకోర్టు ఓ స్ట్రోక్ కొట్టింది.
రంజన్‌గారు తక్షణం సుప్రీంకోర్టుకుపోయి- ‘కచ్చలో కందులు వేసినట్లు’ పిటిషన్ పెట్టి, తొందర ప్రదర్శించాడు. కానీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో వున్న ధర్మాసనం అక్షింతలు వేసి మరీ పంపింది. ‘‘నువ్వు ఎం.పీ.వి. ఇంకొకరికి అలాట్ చేసిన యింట్లో తిష్ఠవేసుక్కూర్చుంటానని వొచ చా? మర్యాదగా ఖాళీ చేయడం మంచిది.’’అంటూ హుంకరించే సరికి- రంజన్ చౌధురీగారు ఆకాశం వైపు చూశాడు. మరి అప్పీలుకి యింకెక్కడికి పోవాలి? అసలు పోయినేడాది నవంబర్‌లోనే 374 ముదురు ఎం.పీ.ల్లో 363 ఎం.పీ.లను ఇళ్లు ఖాళీ చేయించేసింది సుప్రీం. మిగతావాళ్లని ‘తోలేద్దు’రూ. మా ‘టైం వేస్టెందుకు?’’అంటూ వదిలేసింది. అందులో రుూ ‘సారు’ కేసు ఒకటి-
బెటర్ బి హోమ్‌లెస్ దాన్ షేమ్‌లెస్!