వీరాజీయం

కశ్మీర్‌లో ‘పొత్తు’ ఫినిష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సంకటం తప్పింది!

ఒక తలనొప్పి తగ్గింది. ఒకే ఒరలో విచ్చుకత్తుల కాపురం అన్నట్లుగా ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి రగులుతున్న అశాంతికి భాజపా గుడ్ బై కొట్టేసింది. కాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ పార్టీ ‘పీడీపీ’కి ‘తలాక్’ చెప్పేసింది . ఎలాగు తప్పేది కాదు కనుక చిన్న పొలిటికల్ అడ్వానే్టజ్ తీసుకుంది భాజపా. 1990 నుంచి ఆరేళ్లు గవర్నర్ పాలన కింద కొనసాగిన కశ్మీరానికి ఎనిమిదో సారి -కేంద్రపాలన -సైనిక భద్రత లభించాయి. అక్కడ గడచిన మూడున్నరేళ్ల భాజపా-పీడీపీ సంకీర్ణ పభుత్వ పాలన వల్ల కనీసం ఒక్క రోజైనా ప్రజలకి శాంత భద్రతల ఊరట లభించలేదు. పైగా పాలకులు అణచివేతలకు పాల్పడుతున్నారంటూ కశ్మీరీ యువత పెద్దఎత్తున తిరగ బడుతోంది. యువత రాళ్లదాడులు, భద్రతాసిబ్బంది భాష్పవాయుగోళాల ప్రయోగం, తీవ్రవాదుల ఆకస్మిక దాడులతో కశ్మీర్‌లోయ నిర్విరామంగా అట్టుడుకుతోంది. ఈ నాలుగేళ్లలో 619 మంది మిలిటెంట్లను సైన్యం హత మార్చింది. 2017లోనే 342 తీవ్రవాద ఘటనలు జరిగాయి. 213 మంది మిలిటెంట్లు బలయ్యారు. 80 మంది భద్రతా సిబ్బంది, 40 మంది అమాయక పౌరులు చనిపోయారు. నెత్తురు కూడే అయిపోయింది సామాన్యులకి.
కశ్మీర్‌లోయలోని దాదాపు 60 శాతం మంది ఇవాళ 30 ఏళ్లలోపు యువత. వీరికి భారత్‌పట్ల ఏ మాత్రం ప్రేమాభిమానాలు లేకపోగా.. ఆగ్రహంగానూ, అయోమయంలోనూ ఉన్నారు. భారత ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, అవమానించిందని, ఏకాకులమయ్యామనే భావన వారిలో ప్రబలి ఉంది. వారు స్వాతంత్య్ర కాంక్షతో రగిలిపోతున్నారు. భారత అణచివేతకు వ్యతిరేకంగా చావుకైనా సిద్ధపడతామని యువత బాహాటంగానే చెబుతోంది. దీంతో కశ్మీర్లో ముస్లింలను ఘోరంగా అణచివేస్తున్నారని వివిధ దేశాల్లోని ముస్లింలు భావిస్తున్నారు. పాకిస్థాన్, సిరియా, అఫ్గానిస్థాన్ తదితర దేశాలకు చెందిన తీవ్రవాదులు కశ్మీర్‌లోకి ప్రవేశించి.. స్థానిక యువతను మరింతగా రెచ్చగొడుతున్నారు. కశ్మీర్లో ఇప్పుడు తీవ్రవాదం వైపు మొగ్గుచూపుతున్న వారిలో అనేకమంది ఉన్నత విద్యావంతులు. కాస్తంత సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.
రెండేళ్ల కిందట హతమైన బుర్హాన్ వనీ ఒక ఉన్నతస్థాయి కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతుడు. సైన్యం చేతిలో చనిపోయిన ఇతని సోదరుడు ఖలీద్ రాజనీతి శాస్త్రంలో పట్ట్భద్రుడు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తీవ్రవాద గూపు నాయకుడు జకీర్ రషీద్ భట్ చండీగఢ్‌లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు. వీరంతా ప్రజల్లోకి చొచ్చుకుపోతూ.. కశ్మీరీ వేర్పాటు వాదాన్ని మరింతగా రెచ్చగొడుతున్నారు. గతసారి ప్రధాని మోదీజీ కశ్మీర్‌ను సందర్శించినప్పుడు అక్కడి యువతని ఉద్దేశించి- ‘మీకు టూరిజం కావాలా? టెర్రరిజం కావాలా? తేల్చుకోండం’టూ చేసిన హెచ్చరిక-అక్కడి యువకులలో ఎటువంటి ప్రభావం చూపెట్ట లేదు. మత తీవ్రవాదం నానాటికీ మితిమీరింది. సీనియర్ పాత్రికేయుడు, ‘రైజింగ్ కశ్మీర్’ పత్రికా సంపాదకుడు, లోయలో శాంతి స్థాపన కోసం శ్రమిస్తున్న షుజాత్ బుఖారీపై ఆయన కార్యాలయానికి సమీపంలోనే తీవ్రవాదులు కాల్పులు జరిపి, ఆయనను హతమార్చటంతో కశ్మీరే కాదు, యావద్దేశం ఒక్కసారిగా రగిలింది. గత 12 ఏళ్లలో కశ్మీర్‌లో ఒక జర్నలిస్టుని హతమార్చటం మొదటి సారి. లోయలో వేర్పాటు దెయ్యం జుట్టు విరబోసుకు తిరుగుతున్నదనడానికి ఇది ఒక మచ్చు తునక.
ఈ నెల 14న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ వెలువరించిన 49 పేజీల నివేదిక కూడా లోయలో సైన్యం పాత్రను పెద్దఎత్తున ఆక్షేపించింది. కశ్మీర్‌లో మానవ హక్కులఫై ఐరాస ప్రత్యేకంగా ఒక నివేదిక ప్రకటించడం ఆందోళనకరమైన విషయమే. ‘కశ్మీర్ వివాదంలో చాలాకాలంగా భారత -పాకిస్థాన్ రాజకీయ వ్యవహారాలే ప్రధాన చర్చనీయాంశాలుగా ఉంటున్నాయి గానీ.. వాస్తవానికి ఈ సంఘర్షణ లక్షలాది మంది కనీస మానవ హక్కులను మంటగలుపుతోంది’ అని నివేదిక వ్యాఖ్యానిస్తే, ‘‘్భరత ప్రభుత్వం సైనిక బ లాన్ని అతిగా వినియోగించకుండా ఉండటం తక్షణావసరం’’ అని ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ అల్ హుస్సేన్ అనడం పాక్‌కు మరింత ఊతం ఇస్తోంది. సైనికులకు ప్రత్యేకాధికారాల చట్టం వల్ల లోయలో సైనిక అత్యాచారాలు, దురాగతాలు హెచ్చు గా ఉన్నాయన్న ఆరోపణ మన దేశ శత్రువులకు ఒక ప్రచార ఆయుధం కానున్నది.
కమిటీలు ఏం చేశాయి?
అనేక ఏళ్లుగా కేంద్రం కశ్మీర్లో శాంతి మంత్రం జపిస్తూనే ఉంది. చర్చల కోసం ఎప్పటికప్పుడు కమిటీల్ని నియమిస్తూనే ఉంది. 2001లో అప్పటి వా జపేయి ప్రభుత్వం కె.సి. పంత్‌తో ఓ కమిటీని నియమించింది. కశ్మీర్ లోయ లోని వివిధ గ్రూపులతో చర్చలు జరిపిన కె.సి.పంత్- అక్కడ ఉద్రిక్తతలు నివారించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేం చేయాలనే దానిపై నివేదికను అందజేశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడుల్ని తీవ్రం చేయడంతో కేంద్రం మళ్లీ సైనిక శక్తికే ప్రాధాన్యత ఇచ్చింది. 2002లో వాజపేయి ప్రభుత్వం అరుణ్‌జైట్లీ కమిటీని, రామ్‌జెఠ్మలానీ కమిటీని నియమించింది. 2003లో వోహ్రా కమిటీ కశ్మీరీ వేర్పాటు వాదులతో చర్చలు జరిపి చర్చల ప్రక్రియను సాగించాలని సిఫార్సు చేసింది. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రముఖ జర్నలిస్టు దిలీప్ పడ్గామ్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని వేసింది. కశ్మీర్లోని 700 ప్రతినిధి బృందాలతో ఈ కమిటీ చర్చలు జరిపింది. లోయలో శాంతి నెలకొల్పడానికి తీసుకోవాల్సిన చర్యలతో సుదీర్ఘ నివేదికను తయారు చేసింది.
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత నవంబరులో నిఘా విభాగం మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మ నేతృత్వంలో చర్చల కమిటీని వేసింది. కానీ, తాము ఆ కమిటీతో చర్చించేది లేదని వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. వేర్పాటువాదులకు ‘పోస్టర్ బాయ్’ అని అంటారు బుర్హాన్‌ని. 2016 జులైలో భద్రతా బలగాలు అతనిని మట్టుపెట్టినప్పటి నుంచీ కశ్మీర్ లోయలో హింస ఇంకా పేట్రేగింది. ఆ తర్వాత నాలుగు నెలల పాటు వరుసగా జరిగిన హింసలో 100 మంది పౌరులు చనిపోయారు. భారత పాలనను వ్యతిరేకిస్తున్న యువత- సైన్యం దురాగతాలకు పాల్ప డుతోం దంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సైన్యం వైపు నుంచి ఏ చిన్న హింసాత్మక ఘటన చోటుచేసుకున్నా కాలేజీ విద్యార్థులు ఆఖరికి పాఠశాలల్లో చిన్నారులు కూడా వీధుల్లోకి వచ్చి.. సైన్యంపై రాళ్లదాడులకు పాల్పడుతున్నారు. వీరిని అదుపు చేయడానికి సైన్యం ప్రయోగించిన పెల్లెట్ గన్స్ వల్ల అనేకమంది తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. వీటిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో సైన్యం వాటి తీవ్రతను తగ్గించాల్సి వచ్చింది.
రంజాన్ ముస్లింలందరికీ పండుగే. కానీ కాశ్మీర్లో అశాంతి పండుగ అ య్యింది. కాల్పుల విరమణని పొడిగించాలని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అడగడం సబబుగా లేదు. ఆమె ముందుగా మద్దతు లాక్కొనే లోగా - భాజపా నేతలు అమిత్ షా ,రామ్ మాధవ్ లు తురఫు ముక్క కొట్టారు. 2019 ఎన్నికలలో ఒక ప్రచారాయుధాన్ని మోదీజీ ఇపుడు తన అంబుల పొదిలో పొందుపరచుకున్నాడని ఎందరో అంటున్నారు. అయితే , సైన్యం ఉనికి శాంతికాముకులకు కొంత ఊరట. గవర్నర్‌గా ఒహ్రా లేదా మరొక సంఘ్ పరివార్ హితుడు ఉన్నా -అక్కడ సైన్యందే పైచెయ్యి. మన సైన్యం దేశభక్తిని శంకించటం- నేరం, ఘోరం .
సైన్యంపై రాళ్లు విసిరే కుర్రాళ్ళను కేంద్రం భరించింది. వాళళూ ఇండియనే్స నని. ఈ సంగతి వారు గ్రహించేలాగా వాళ్ళను సంస్కరించాల్సిన బాధ్యత కూడా మోదిజీ అండ్ పార్టీ మీద ఉన్నది. 80 వేల కోట్ల రూపాయల ప్యాకేజి -ని కేంద్రం సత్ఫలితాలను ఇచ్చే విధంగా కొనసాగించాలి. కశ్మీర్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలు అనివార్యమైతే అవి రేపటి పార్లమెంటు ఎన్నికలతో పాటు పెట్టాలా? ముందే పెట్టాలా? ముఫ్తీ, ఒమర్ అబ్డుల్లాలు కూడా ఆశలు పెంచుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో అది తప్పదు. కాకపొతే, వాచాలత తగ్గించమని- ఇదంతా జవహర్‌లాల్ నెహ్రూ తప్పు కనుక రాహుల్ మీద కమిటీ వెయ్యాలని ఓ కుర్రవాడు సంఘ్ పరివార్ ఆరాధకుడు డ్రమటిక్‌గా అంటే-చప్పట్లు కొట్టడం మాని.. అమిత్ షా గారి ‘్థంక్ ట్యాంక్’ ఇప్పుడేమి చెయ్యాలి? ఇంకా ‘్థంకాలి’ పార్టీకి అతీతంగా. కాశ్మీర్‌లో శాంతి కోసం ఆలోచించాలి. గన్స్ కాదు వేరే గట్స్ మోదీజీ ప్రయోగిమ్చాలి.
బెటర్ లేట్ దేన్ నెవెర్.. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్!
*

--వీరాజీయం సెల్: 92900 99512