వీరాజీయం

నేరమేరా రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు మన సొసైటీలో నేరమేరా జేవితం, నేరమేరా శాశ్వతం అన్న మాట - ఉన్నమాటగా రాణిస్తున్నరోజులివి - అధికారం ఉంటేనే మేము ప్రజాసేవ చేస్తాము అన్నది పొలిటికల్ పార్టీలు ఘోషిస్తున్న రాజకీయనీతి. వాడికేమిరా? మొనగాడు -అంతటి నేర చరిత్ర మరొకడికి లేదు అని జనాలు వాళ్ళకిష్టమైన రాజకీయ నాయకుణ్ణి కీర్తిస్తున్న ప్రజా (అ)స్వామ్యమిది. ప్రజాస్వామ్యం అనే దీపం ఏర్పడిన శుభ సమయం లోనే దాని క్రింద నీడ లాగ నేర ప్రవృత్తి ఇనుమడిస్తూ వస్తున్నది. నేరం చేసి కోర్టులో కేసు నడుస్తూ వున్నప్పటికీ సదరు నేరం రుజువై -శిక్ష విధింప బడే దాకా కూడా ఎన్నికల్లో పోటీకి పోటుగాడిలాగా చెలామణీ అవ్వాల్సిందే నాన్న రాజకీయ సూత్రం - ఇప్పుడు మరింత పదిలమై సుప్రీమ్ కోర్ట్ లో ముద్ర వేయించుకున్నది..
క్రిమినల్ కేసులు కేవలం నమోదైనంత మాత్రాన, విచారణలో ఉన్నంత మాత్రాన సదరు అభ్యర్థులను పోటీకి అనర్హులుగా ప్రకటించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ అంశంపై పార్లమెంటే చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది.
నేరస్తులు రాజకీయాల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం చెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు ధర్మాసనంలో సభ్యులు.
అయ్యా! నెత్తి మీద తెలువుంది సార్ అంటే అదేదో నువ్వే తీసేయి బాబూ అన్నట్లు -అత్యున్నత న్యాయస్థానం -బంతిని పార్లమెంటు మీదకి నెట్టేసింది. ఎప్పటికి పార్లమెంటు? ఎప్పుడది సమావేశమై కొత్తగా ఓ బిల్లు తేవాలి? దాని మీద చర్చ రాజ్యాంగ మీమాంస వగైరా జరగాలీ? అవతల సార్వత్రిక ఎన్నికలు ప్రాంతీయ అసెంబ్లీల ఎన్నికలు తరుముకొస్తున్నాయి.. ఆ దశలో నేరస్తులు అయిన వారే అయినా, టెక్నికలుగా నిందితులు అనబడతారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గారి ఆధ్వర్యంలో వున్నా ధర్మాసనం ‘నేర చరిత్రను ప్రజలకు తెలపాలి.. నేరస్తుల చిట్టా అవార్జాలను బయట పెడుతూ జనాల్ని ఊదరగొట్టేలాగా -బహిర్గతం చెయ్యాలి అని చెప్పింది. ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసే తమ అభ్యర్థుల కేసుల వివరాలు నీటుగా వెబ్ సైట్లలో పెట్టాలి.. నేర చరిత్రధురీణుల గురించి ఆయా పార్టీలు ఏమీ దాచకూడదు అన్నది కోర్టు.
ఇది అన్యాయం.. అన్నాడో పార్టీ వీరాభిమాని -దీనివల్ల అభ్యర్ధులు పరస్పరం కష్టపడి దాచిన - మూట ముప్పిడి అవినీతి నేరాలను బహిర్గతం చేసుకొనే శ్రమ తప్పుతుంది.. ఖర్చులు మిగులు. వోటరుకి కూడా కొంతలో కొంత అవగాహన పెరుగుతుంది.. వోటు రేటు కూడా ఆ దామాషాలో పెంచుకోవచ్చును..’ అన్నాడో వోట్ల వ్యాపారి.
దీపక్ మిశ్రాగారు అక్టోబర్ ఒకటిన పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన చేతి క్రింద ముఖ్యమైన ’బెంచీ’ కేసులు చాలానే వున్నాయి - అంచేత -కేసులపై సారూ, తీర్పులు తొందరగా చెప్పేస్తున్నారు అన్నాయి అభిజ్ఞ వర్గాలు. అయితే ఈ స్పీడు కోర్టుల నత్తనడక మీద ఏమీ ప్రభావాన్ని చూపెట్టవ్!
సరే, ఎంపీ ఎమ్మెల్యేల నేరాలకు సంబంధించిన కేసులకు ప్రత్యేక కోర్టులను పెట్టి ఈ ఘోర నేరాలను వాటిలోకి -బదలాయంచమని -కోర్టువారు చెప్పారు. ఈపాటికే ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు పదకొండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఓకే... బాగుంది అలహాబాదులో ఓ ప్రత్యేక కోర్టు ఏర్పడి కేసుల విచారణ మొదలెట్టింది కూడాను ..
కాని దేశం మొత్తం మీద ప్రత్యేక కోర్టుల స్థాపన ఎప్పటికి పూర్తి అయ్యేనూ.. ఈ కేసుల విచారణకు న్యాయమూర్తులు ఎక్కడ దొరికేను? దేశంలో గల అమాం బాపతు కోర్టులను కలుపుకొని చూస్తే కూడా ఎన్జీవోల అంచనాలను బట్టి -పెండింగు కేసుల సంఖ్య మూడు కోట్ల ముప్ఫై లక్ష! -వీటిలో రెండుకోట్ల అరవై లక్షల కేసులు మాత్రం సబార్డినేటు కోర్టులలో వుండగా - మిగతావి ఉన్నత న్యాయస్థానాలలో మ్రగ్గుతున్నాయ! ఔరా? ఈ కుప్పలను ఎవరు క్లియర్ చేయగలరు? చెయ్యాలంటే అంత మంది జడ్జీ లను ఎట్లా నియమించాలి?-ఇప్పటికే జడ్జీకో వెయ్యి కేసుల లెక్కన పెండింగులో వున్నాయిట. పైగా పెండింగు కేసులలో నలభై ఆరు శాతం -ప్రభుత్వ కేసులేనట.. ఇట్టి తరి: ఎన్నికల రణరంగంలో వున్న ’అవీ జీవి’ పెట్టి దిగే మొనగాళ్ళ మాట ఎట్లా వున్నా, రాజకీయ హేమాహేమీలకు కూడా కొంత ఊరట. కాకపోతే- నేరాలమీద మీడియా బాగా పబ్లిసిటీ ఇవ్వాలని సుప్రీమ్ బెంచ్ వ్యాఖ్యానించడంతో బుల్లితెరకి నోటినిండా చేతినిండా పని .. పత్రికలకు మేతా, కాగా, కోర్టులలోని కేసులు జడ్జీల కొరత కారణంగా నత్తనడక నడవక తప్పనంతకాలం జనాలకు న్యాయం గగన కుసుమమే..

-వాంటెడ్ క్వాలిఫైడ్ జడ్జ్జెస్ ప్లీజ్ !