వీరాజీయం

పేరు మారినా.. ఊరు తీరు మారునా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్ నగరానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ‘ప్రయాగరాజ్’ అని పేరు మార్చేసి, ఈ సృష్టి మొత్తంలో ఏదో ఘనకార్యం సాధించానన్నట్లు మురిసిపోయాడు. ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ గౌరవార్థం ప్రజల సొమ్ములతో నూట ఎనభై రెండు మీటర్ల ఎతె్తైన విగ్రహం చేయించినంతగా ఉత్తరప్రదేశ్ ‘సన్యాసి ముఖ్యమంత్రి’ గొప్పగా సంబరం చేసుకుంటున్నాడు. ఇప్పుడు పేరు మార్పు అన్న వ్యామోహం ఉత్తర భారత రాష్ట్రాలలో ఒక వేలం వెర్రిగా మారిపోతోంది.
మహరాష్టల్రో వున్నదిగా ఘనత వహించిన శివసేన పార్టీ. వాళ్లు కూడా ‘అజ్జరబజ్జా’ అంటూ రంగంలోకి దూకారు. ఔరంగాబాద్‌ని ‘శంభాజీనగర్’గా మార్చాలని శివసేన సైనికులు అంటున్నారు. ఉస్మానాబాద్‌ని ‘్ధర్మివ్‌నగర్’గా మార్చాలని వారు కోలాహలంగా రచ్చకెక్కారు. పేరుమారితే ఊరు తీరుమారునా? పేరు మార్చడం అంటే అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. మన బెజవాడని ఏదో అద్భుతమైన ఘనకార్యం సాధించారన్నట్టుగా విజయవాడ అని మార్చారు. కృష్ణానదిపై జిల్లాకి పనికొచ్చే పంట కాల్వ తవ్వినంత ఖర్చు అయింది ప్రభుత్వ రికార్డులు మార్చడానికి. ‘చెరపకురా చెడేవు’అన్న సామెతను విస్మరించి ఇలా పేరు మార్చారు. గానీ, అది రైల్వేవారి గొంతులో పచ్చివెలక్కాయ అయింది. దేశంలో రాష్ట్రాలు, ప్రాంతీయతలు, మతాలు, అభిమతాలు, వైరుధ్యాలు వగైరాలు ఎన్ని వున్నా రైలు పట్టాలకివేమీ పట్టవు. అవి అడ్డమయిన ప్రాంతాల్లోనూ ఒకేలా పరిగెడతాయి. దానికి ‘జోన్స్’ వుంటాయి. కానీ, ఊరు పేరు మార్చడానికి అన్ని మండలాలలో, రైల్వేస్టేషన్లలో- పేరుమార్పు తేవాలంటే ‘చచ్చేంత’ పనవుతుంది.
అంచేత, ‘విజయవాడ’ అని ప్లాట్‌ఫామ్‌ల మీద రాశారేమో గానీ, దాని కోడ్ మాత్రం ‘బిజెడ్‌ఏ’ గానే వుండిపోయింది. కాకినాడని- ‘కోకనాడ’గా, విశాఖని ‘వైజాగ్’గా మార్చేశారు దొరలు. నోరు తిరగక అనుకొని, వాటిని సవరిస్తే- అది వేరే సంగతి. గానీ తెల్లారేపాటికి ‘పూణె’ అనే మహానగరానికి- ‘జిజియాపూర్’ అంటూ పేరు మార్చేయమని కొందరు కూర్చున్నారు. ఎందుకంటే రుూ నగరాన్ని శివాజీ మహరాజ్‌గారి మాతృమూర్తి ‘జిజియా బాయమ్మ’ అభివృద్ధి చేశారు కాబట్టి- అంటున్నారు.
ఛత్రపతి శివాజీని- మరాఠీ వాళ్ల ‘ప్రయిడ్’ని కించపర్చాలనే ఉద్దేశం మనకి యింత పిసరు కూడా లేదుగానీ- మాటిమాటికీ, అన్ని పేర్లూ, ఛత్రపతి వంశస్థులకే అంకితం చేయాలీ అంటే ప్రాక్టికల్ ఇబ్బందులు వుండవా? పైగా మహారాష్టల్రోగానీ, ఉత్తరప్రదేశ్‌లో గానీ వేరే జాతులూ, మతాలూ వున్న మనుషులు లేరా? వాళ్లకీ కోరికలుండవా?-
‘‘మరేదే చెప్పేది’’ అన్నాడో ‘్భక్తుడు’. ‘‘వోట్లకోసం కాంగ్రెసోళ్లు రుూ ముస్లిమ్ పేర్లని అట్లా వుంచేశారు. అది ఒప్పుకో..’’ అని కూడా అన్నాడు. ‘శివశివా!’ ఎంతమాట! అంటే అర్థం- యిప్పుడు అలహాబాద్‌ని ‘ప్రయాగ్‌రాజ్’ చేశారు. అక్కడే మైనార్టీ వోట్లకి ‘తిరాంజలి’ ఘటిస్తున్నారా?’’అంటే, ‘‘అభివృద్ధి కావాలీ అంటే, వాళ్లు మోదీకే వోటు వేస్తారు’’ అన్నాడు ధీమాగా ఆ భక్తుడు. వోట్లు ముందు పుట్టాయా? వూళ్లు ముందు పుట్టాయా? అది సరే గానీ, ‘‘రుూ పిచ్చి ముదిరి గుజరాత్‌లో రూపుకట్టింది. ఇదేదో ‘వైరస్’ కాబోలు అని అంటున్నాడు లల్లూప్రసాద్ యాదవ్ శిష్యుడొకడు- బీహార్ రాజధాని ‘పాట్నా’లో నిలబడి. అహ్మదాబాద్‌ని అర్జెంట్‌గా- ‘కర్నావతి’ అని మార్చి ఘనంగా నామకరణోత్సవాల్ని చేయాలంట!!
‘‘పేరు మార్పుకి ఆది కాలం నుంచీ ఎంతోకొంత ప్రాధాన్యత వున్నది గానీ, కమ్యూనికేషన్లు విస్తరించిన ఆధునిక దశలో రుూ వెర్రికోరికతో ‘‘ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లేవా? అంటే ఏమీలేదు,’’- అన్నాడో సాంప్రదాయ ప్రియుడు- సర్దుకోవాలి అని కూడా అన్నాడు.
‘‘అట్లా మారపోతే పోతే నా పేరు మార్చుకుంటాను’’ అన్నాడు సదరు పెద్దమనిషి. నేను అన్నది నిజంకాకపోతే ‘‘నాకు మారు పేరెట్టు’’- అనీ; ‘‘ఇట్లా కాలేదనుకో, నేను పేరు మార్చుకుంటాను’’- అంటూంటారు ఇంకొందరు.
‘హనుమాన్లు’ అను నేను ‘సుందర్‌కుమార్’గా పేరు మార్చుకుంటున్నాను’’-అని దినపత్రికలో చిన్న ప్రకటన యిచ్చేసినట్లు కాదు- ప్రతీ పేరుకీ ఒక చరిత్ర వుంటుంది. ఆమధ్య రుూ పిచ్చి బెజవాడకీ వ్యాపించింది. వీధుల పేర్లున్నాయి ఆ వూళ్లో అన్ని వూళ్లలో లాగే. బెజవాడలో గాంధీనగర్‌లో వున్న ప్రెస్‌క్లబ్‌కి పోవాలీ అంటే ‘మాకాని’ వారి సందులో నుంచి పోవాలి. దాని పేరు ఎలా మారుస్తాం?
గాంధీనగర్‌లో సత్యన్నారాయణపురం రోడ్డుమీదుగా- హనుమంతరాయ గ్రంథాలయం వున్న ఆసుపత్రి రోడ్డుకి ఆ కాస్త ముక్క- ‘జి.యస్.రాజు’ రోడ్డు అని పేరు మార్చారు. ఓకే. గానీ- యిక్కడ ప్రక్కవీధిలో ‘జానోలివ్ స్ట్రీట్’ అని వుండేది. దానిమీద బోలెడు ‘రీసెర్చి’ చేశారు(ట). అది ‘జానోలివ్’ అనే కలెక్టర్ దొరగారి పేరు. ఐతే, ‘జ్ఞానవల్లి’ వారి వీధి అని అసలు పేరు దీనికి వుందని నిర్ధారించారు. బాగానే వుంది. గానీ యివాళ తెలుగులో ఉచ్చరించడం ఎలాగూ సాధ్యం కాదు. రాయాలన్నా ‘జ్నా’అని (జ్ఞ)రాయాలి తప్ప అన్ని అక్షరాలూ అచ్చులోకి రావే. ‘వౌనం’గా అన్నమాటని ‘మవునం’గా అని రాస్తే- ఎంతటి పండితుడయినా, నోరు డాష్... డాష్...
అందువల్ల అరవ్వాళ్లల్లాగా మనం కూడా- ‘మహానుభావుణ్ని’- ‘మగానుభావుడు’ అని సంబోధించాల్సిందే. ఏదో కొంపల మీదికొచ్చి ఆత్మగౌరవం మట్టిపాలై- జాతి పౌరుషం బుగ్గిపాలైపోతూంటే, అప్పుడు అటువంటి పేర్లు మార్చుకోవాలి గానీ, ఈ పాడుప్రపంచంలో మన దేశం, మనం మాత్రమేనా, యింకా ఎన్నో దేశాలు కూడా వున్నాయి. కమ్యూనికేషన్లకి, అంతర్జాలాల కోడ్‌కి అనుగుణంగా, కొన్ని పాత పేర్లు- ఉదాహరణకి, ‘ఇండియా’ అన్న పేరే తీసుకోండి, మార్చడం కష్టం. ‘ఆర్యావర్తన్’ అనండిరా! మాది ప్రజలు యిచ్చిన ‘మాండేట్’-‘‘ అంటే కుదురుతుందా?
రాజ్యాంగబద్ధం, రాజ్యాంగయుతం అంటూ ఎన్నో సెంటిమెంట్స్‌ని చావుదెబ్బ తీస్తున్నామే?
‘సిమ్లా’పేరు ‘సిమ్లా’గానే వుంటే హిందూ మతం భ్రష్టుపడుతుందా? ‘సిమ్లా’ని- ‘శ్యామల’- అని మార్చాలట! మద్రాసు.. సారీ.. చెన్నైలో పాండీబజార్‌ని అలాగే పిలుస్తారు యిప్పటికీ. ఆ హైరోడ్డు- టి.నగర్‌లో వుంటుంది. తమిళులకి ‘‘టీ’’ పడదు. వాళ్లు ‘కాపీదాసులు’ తమిళంలో ‘్ఫ’లేదు. అంచేత దాన్ని ‘కాపీనగర్’గా మార్చాలీ అనేవాడు పాన్‌గళ్ పార్కుకి వచ్చినప్పుడల్లా- ఓ ‘‘చిత్ర నరసింహారావు’’. నిజానికది- ‘టి’అంటే, త్యాగరాయనగర్- అట్లా ఒక మహనీయుని పేరు గోవిందా! అయింది.
ఇవాళ ఒక పార్టీ వచ్చి, ‘‘మేం ‘్ఫర్శీ’, ఉర్దూ పేర్లు, నవాబులు, దొరలు, రాజుల పేర్లు మారుస్తాం’’- అంటే, రేపు మరో పార్టీవాళ్లు కమలానగర్ అని మారుస్తాం- అనరా? అసలిది కాలక్షేపం కోసం యింత పిసరు టైమున్న దేశమా? మనకి ప్రగతి కావాలి. మొబైల్స్ కావాలి. వ్యక్తి స్వేచ్ఛ కావాలి. నూటికి తొంభై తొమ్మిదిన్నర శాతం అంగీకరిస్తేనే వూరి పేరు మార్చాలి.
చరిత్రను అడుగు- విను- అంతేగానీ పేరుమార్చి చరిత్ర సృష్టించి- అదేదో ఘనకార్యమని- ‘‘వోట్ ఫర్ మీ’’ అంటూ పోవడం ప్రమాదం సుమా! సరే, గులాబీని ఏ పేరుతో పిలిచినా, అది గులాబీ గుబాళింపునే యిస్తుంది. కనుక ‘రోజ్’ని ‘ఆ ర్యోజ్’అని పిలుస్తామంటే దక్షిణాత్యులు కర్రుచ్చుకుంటారు. ‘ద్రవిడోజ్’- అనమంటారు. అంచేత- అమిత్‌‘‘షా’’లో ‘‘షా’’ వుండనివ్వండి!

లెట్ నేమ్స్ స్టాండ్ యేజ్ దే ఆర్!

-- సెల్: 92900 99512