క్రీడాభూమి

ఫీల్డ్ బయటే ఒత్తిడి: కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, మార్చి 14: మైదానంలో ఉన్నప్పటి కంటే వెలుపలే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని భారత స్టార్ బ్యాట్స్‌మన్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. భారత క్రికెటర్లు సోమవారం ఉదయం నాగపూర్ మైదానంలో ముమ్మర ప్రాక్టీస్ చేశారు. టి-20 వరల్డ్ కప్‌లో సోమవారం న్యూజిలాండ్‌ను ఢీ కొనేందుకు కెప్టెన్ మ హేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, జస్ ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా, హర్భజన్ సింగ్ తది తరులు నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడ్చారు. నెట్స్ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, మైదానంలో ఉన్నంత సేపు ఎంతో వ్యూహాత్మ కంగా నడుచుకునే వీలు ఉంటుందని కోహ్లీ అన్నాడు. ఒక రకంగా అదే పూర్తి రక్షణాత్మక స్థలమని వ్యాఖ్యానించాడు. ఫీల్డ్ వెలుపల ఏ విధంగా వ్యవహరిస్తు న్నాం.. ఎంత ఒత్తిడిని తట్టుకోగలం.. అన్న అంశాలను ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని అన్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ ఒత్తిడి సహజమని పేర్కొన్నాడు. పైగా, అభిమానుల అంచనాలు చాలా ఉన్నతంగా ఉంటాయని, వాటిని కాపాడేందుకు ప్రయత్నం చేయాలన్న ఆలోచనే ఒత్తిడిని పెంచుతుందని అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, మైదానంలో ఉన్నంత సేపు ఆటపైనే దృష్టి ఉంటుంది కాబట్టి ఒత్తిడి తీవ్రత అంతగా తెలియదని కోహ్లీ చె ప్పాడు. కానీ, ఒకసారి మైదానం విడిచిపెట్టి బయటకు వస్తే, ఒత్తిడి పెరుగుతుందని అన్నాడు. మేజర్ టోర్నీలు జరుగుతున్న సమయంలో ఎంత జాగ్రత్తగా మసలుకుంటామన్నది కీలకంగా మారుతుందని చెప్పాడు. టి-20 వరల్డ్ కప్‌లో విజయం సాధించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఒక ప్రశ్నకు సమాధా నంగా కోహ్లీ తెలిపాడు.