రాష్ట్రీయం

వీసా వచ్చినా చిక్కులెన్నో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదివే సబ్జెక్ట్‌పై అవగాహన లేకపోయినా..
తగినంత డబ్బు లేకపోయినా వాపసే!
స్పష్టం చేస్తున్న ఇమిగ్రేషన్ అధికారులు
హైదరాబాద్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్ధులు అమెరికాలోనో, మార్గమధ్యంలో అబుధాబీలోనో చిక్కుకుపోతున్న ఘటనలు ఈ మధ్య పెరగడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వివరణ ఇచ్చింది. అమెరికాలో యూనివర్శిటీల సామర్ధ్యాలను పరిశీలించిన అక్కడి ఉన్నత విద్యావిభాగం ర్యాంకింగ్‌లను ఇచ్చింది. 4,726 విశ్వవిద్యాలయాలు ఏటా డిగ్రీలను ఇస్తున్నాయి. అందులో అట్టడుగు ర్యాంకింగ్ ఉన్న యూనివర్శిటీల్లో స్థానిక విద్యార్ధులు చేరే పరిస్థితి లేకపోవడంతో ఆ యూనివర్శిటీలు పెద్దయెత్తున ఇంటర్నేషనల్ విద్యార్ధులను ఆకర్షించేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయి. స్థానికంగా ఉన్న విద్యా కన్సల్టెన్సీలతో అవి లాలూచీ పడటంతో స్థానిక విద్యార్ధులను ఈ కన్సల్టెన్సీలు తప్పుదారి పట్టిస్తున్నాయి. అయితే విద్యార్ధులు విమానం ఎక్కేవరకూ అక్కడ ఉన్న పరిస్థితులు, బోధన సిబ్బంది, యూనివర్ళిటీ నేపథ్యం, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు వంటి వివరాలపై అధ్యయనం చేయకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అమెరికా చదువులకు వెళ్లేవారికి ఎఫ్-1 వీసా జారీ చేస్తుంది. అయితే వీసా జారీ సమయంలోనే ఎఫ్-1 వీసాపైనే రహస్యంగా ఇంటర్వ్యూల సమయంలో అభ్యర్ధులు ఇచ్చిన సమాధానాలను విశే్లషించి అనుమానాలు ఉంటే దానిపై ప్రత్యేక గుర్తులను నమోదు చేస్తుంది. ఆ గుర్తుల అర్ధాలు ఇమిగ్రేషన్ అధికారులకు మాత్రమే అర్ధం అయ్యేలా ఉంటాయి. ఇమిగ్రేషన్ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్ధులు ఇచ్చే పలు సమాధానాలే దీనికి కారణమని అంటున్నారు. ఇటీవల వీసా లభించాక అమెరికాకు బయల్దేరిన హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థికి, అమెరికా ఇమిగ్రేషన్ అధికారికీ మధ్య జరిగిన సంభాషణను ఉదహరిస్తున్నారు. సదరు అధికారికి, విద్యార్థికి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది.
ఇమిగ్రేషన్ అధికారి: మీ డాడీ పుట్టినరోజు
విద్యార్థి : తెలీదు
అధికారి: మీ అమ్మగారి పుట్టింటి పేరు
విద్యార్థి: (పుట్టింటిపేరుకు బదులు తల్లి పేరు మాత్రమే చెప్పాడు)
అధికారి: ఎపుడైనా మీరు అమెరికా వెళ్లారా?
విద్యార్థి: వెళ్లాను
అధికారి: చట్టబద్ధంగానే అమెరికా వచ్చారా?
విద్యార్థి: తెలీదు
అధికారి: మీరు ఏ ఫ్లైట్‌లో వచ్చారు?
విద్యార్థి: (తత్తరపాటు సమాధానం)
అధికారి: మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ?
విద్యార్థి: ఒక డాలర్
అధికారి: క్రెడిట్ కార్డు ఉందా?
విద్యార్థి: లేదు
అధికారి: మీ బ్యాగ్‌లో ఎంత డబ్బు ఉంది?
విద్యార్థి: 240 రూపాయలు
అధికారి: ఇంత తక్కువ డబ్బుతో అమెరికాలో ఎలా ఉంటారు?
విద్యార్థి: మూడు రోజుల్లో మా తల్లిదండ్రులు పంపిస్తామని చెప్పారు.
అధికారి: మీ కోర్సు ఫీజు ఎంత?
విద్యార్థి: 10 వేల డాలర్లు
అధికారి : తొలి సెమిస్టర్‌లో మీ సబ్జెక్టులు
విద్యార్థి : మూడు
అధికారి : ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఒక్కో సబ్జెక్టులో
విద్యార్థి: తెలీదు
అధికారి: ఒక్కో సబ్జెకుకు ఫీజు ఎంత?
విద్యార్థి: 1300 డాలర్లు అనుకుంటా
అధికారి: ప్రస్తుతం మీరు యూనివర్శిటీలో చేరారా?
విద్యార్థి: ఇంకా లేదు
అధికారి: ఒక్కో సెమిస్టర్‌కు ఎంత ఖర్చవుతుంది?
విద్యార్థి: ఐదువేల డాలర్లు
అధికారి: మూడు సబ్జెక్టులకు ఎంత ఖర్చు అవుతుంది?
విద్యార్థి: తెలీదు
అధికారి: ఫీజుల గురించి, సబ్జెక్టుల గురించి తెలుసుకోలేదా?
విద్యార్థి: లేదు, తెలిసిన వారిని అడిగా..
అధికారి: వారేం చెప్పారు?
విద్యార్థి: సబ్జెక్టుల ఆధారంగా ఫీజు ఉంటుందని, ఒక్కో సెమిస్టర్‌కు ఐదు వేల డాలర్లు అవుతుందని అన్నారు
అధికారి: మీరు ట్యూషన్ ఫీజు ఎప్పుడు చెల్లించాల్సి ఉంది?
విద్యార్థి: డిసెంబర్ 29లోగా
అధికారి : డిసెంబర్ 29న ఎంత చెల్లించాలో మీకు తెలుసా?
విద్యార్థి: (జవాబు లేదు)
అధికారి: మీరు ఉండటానికి అయ్యే ఖర్చు ఎంత?
విద్యార్థి: దాదాపు 300 డాలర్లు
అధికారి: ఆ ఖర్చును ఎవరికి చెల్లిస్తారు?
విద్యార్థి: రూమ్‌రెంట్ 270 డాలర్లు, ఇతర సామగ్రీకి 300 డాలర్లు
అధికారి: ఈ ఖర్చు గురించి ఎవరు చెప్పారు?
విద్యార్థి: ఫేస్‌బుక్‌లో..
చదివే సబ్జెక్టు గురించి అవగాహన లేకుండా, ఉండటానికి కావలసిన డబ్బు లేకుండా అమెరికా వద్దామంటే ఎలా అనుమతిస్తామని సదరు అధికారి ప్రశ్నించారు.