రాష్ట్రీయం

బంగాళాఖాతంలో అలల ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: బంగాళాఖాతంలో అలలు ఉవ్వెత్తున విరుచుకుపడుతున్నాయి. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని సముద్రతీరంలో నిన్నటి నుంచి అలల ఉధృతి పెరిగింది. విశాఖ, కాకినాడ సముద్రతీర ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు మీటర్ల మేర అలలు ఎగసిపడుతున్నాయి. ఇవాళ, రేపు కూడా రాకాసి అలల ఉధృతి కొనసాగుతుందని ఇన్‌కాయిస్‌ హెచ్చరించింది. దక్షిణ మహాసముద్రంలో అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర సముద్రతీరంలో సెకను వ్యవధిలో రెండున్నర మీటర్లకు పైగా అలలు ఎగసిపడతున్నాయి. విశాఖ తీరప్రాంతంలో ఈదురుగాలులు బలంగా వీస్తున్నాయి. సముద్రతీరప్రాంతాల్లో ఎవ్వరినీ స్నానాలు చేయనీయకుండా, జాలర్లను చేపల వేటకు వెళ్లనీయకుండా అధికారులు చర్యలు చేపట్టారు.