విశాఖపట్నం

ఆసుపత్రిలో ఆధునాతన వైద్య సౌకర్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఏప్రిల్ 20: సేవలకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. శుక్రవారం ఎన్టీ ఆర్ ప్రాంతీయ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫోటోథెరఫీ విభాగాలను మంత్రి ప్రారంభించారు. నక్కపల్లి హెటిరో కంపెనీ యాజమాన్యం ఇచ్చిన లక్షా 60 వేల రూపాయల నిధులతో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మూడు యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ఫోటోథెరఫీ విభాగాలను ఏర్పాటు చేసేందుకు సహకరించిన హెటిరో ప్రతినిధులను అభినందించారు. అనంతరం సీ - ఆర్మ్స్ అనే ఆధునిక ఎముకల శస్త్ర చికిత్స యంత్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. 11.5 లక్షల విలువైన పరికరాలను కొనుగోలు చేసేందుకు అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత ఎంపీ నిధుల ద్వారా 20 లక్షల రూపాయలు సమకూర్చారన్నారు. ఈసందర్భంగా ఈ ప్రాంత ప్రజల తరుపున ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ ఆసుపత్రిలో ఇటువంటి విభాగాలను ఏర్పాటు చేయడం ఇదే ప్రధమం అన్నారు. వంద పడకల ఆసుపత్రిని 150 పడకలుగా అప్‌గ్రేడ్ చేసామని, వివిధ విభాగాలను అభివృద్ధి చేసామన్నారు. ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న పరికరాలను అవసరమైన రోగులు ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ఈకార్యక్రమంలో ఆసుపత్రి సూపరెంటెండెంట్ సుధాశారదా, గైనకాలజిస్ట్ విజయశాంతి, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

నర్సీపట్నంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు
నర్సీపట్నం, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రకటించిన అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి డివిజన్ కేంద్రమైన నర్సీపట్నంలో అధికారులతో కలిసి మంత్రి పలు స్థలాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల నుండి పట్టణానికి వచ్చే వారికి అతి తక్కువ ధరకు పరిశుభ్రమైన భోజనం, టిఫిన్ అందించేందుకు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈక్యాంటీన్లలో ఐదు రూపాయలకు భోజనం లభిస్తుందన్నారు. తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న స్థలాలను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట ఆర్డీవో కె.సూర్యారావు, మున్సిపల్ కమీషనర్ జి.సురేంద్ర, తహశీల్దార్ వి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమణదారులకు కొమ్ము కాస్తున్న అధికారులు
* సమస్యను పరిష్కరించాలని దళితులు ధర్నా
నర్సీపట్నం, ఏప్రిల్ 20: తాండవ భూ నిర్వాసితులకు ప్రభుత్వం మంజూరు చేసిన సాగు భూములను ఆక్రమించిన భూస్వాములను తొలగించి నిరుపేదలైన దళితులను భూములను అప్పగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట దళితులు ధర్నా నిర్వహించారు. ఈభూములకు సంబంధించి రెవెన్యూ డివిజనల్ అధికారి అధికార దుర్వినియోగానికి, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. తక్షణమే జాయింట్ కలెక్టర్ సృజన సమస్యాత్మక పందూరు గ్రామంలో పర్యటించి నిర్వాసితులైన దళితులకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్ చేసారు. ఈసందర్భంగా భూ నిర్వాసితుల సంఘం ప్రతినిధి మాకిరెడ్డి రమణ మాట్లాడుతూ సాగునీటి ప్రయోజనాల కోసం నిర్మించిన తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కోటవురట్ల మండలం పందూరు గ్రామం వద్ద మిగులు భూమిని పునరావాసం కింద భూమిని కేటాయించిందన్నారు. నిర్వాసితులైన పేదలకు ధనికులు అప్పులిచ్చి వీటికి బదులుగా భూములను 99 సంవత్సరాల లీజు పేరుతో ఆక్రమించారన్నారు.సమస్యను పరిష్కరించాలని కోటవురట్ల తహశీల్దార్, ఆర్డీవోలను కోరినప్పటికీ ఆక్రమణదారులకు కొమ్ము కాస్తూ దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అధికారులు ఆక్రమణదారులకు అండగా నిలవడం దారుణమన్నారు. పందూరు గ్రామాన్ని జాయింట్ కలెక్టర్ స్వయంగా సందర్శించి వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. న్యాయమైన దళితుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ ఆందోళనలో తాండవ భూ నిర్వాసితులు, దళితులు పాల్గొన్నారు.