విశాఖపట్నం

సంఘీభావ దీక్షకు విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఏప్రిల్ 20: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావంగా అరకులోయలో శుక్రవారం నిర్వహించిన సామూహిక నిరాహర దీక్షకు విశేష స్పందన లభించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ధర్మ పోరాట దీక్ష ప్రారంభించిన వెను వెంటనే అరకులోయలో సర్వమతస్తుల ప్రార్థనలతో సంఘీభావం దీక్షను చేపట్టారు. స్థానిక తాహశీల్ధార్ కార్యాలయం ఎదుట ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రభుత్వ విప్, అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సంఘీభావ దీక్ష చేపట్టారు. నల్ల రిబ్బన్లను ధరించి చేపట్టిన ఈ సామూహిక దీక్షకు విశేష స్పందన లభించింది. ఊహించని విధంగా నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల నుంచి అశేష అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంఘీభావ దీక్ష వేదిక వద్ద పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, వ్యాపార, విద్యార్థి, స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాలు దీక్షలో పాల్గొన్నాయి. వేదిక ప్రాంగణంలో భారీ ఎత్తున అన్ని వర్గాల వారు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా సంఘీభావ దీక్ష చేపట్టి విజయవంతం చేసారు. సుమారు ఐదు వేల మంది శాంతియుతంగా దీక్షకు సంపూర్ణ మద్దతు పలికారు. సంఘీభావ దీక్ష ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే కిడారి అరకులోయ ముఖద్వారంలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్.విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్.టి.ఆర్. విగ్రహం నుంచి ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు. ఈ సందర్భంగా కిడారి మాట్లాడుతూ ప్రధాని మోడి నాలుగు సంవత్సరాలుగా ఐదు కోట్ల ఆంధ్రులను వంచించారని విమర్శించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్న నేపధ్యంలో చంద్రబాబును ప్రజల్లో చెడ్డ చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇతర రాజకీయ పార్టీలతో ప్రధాని చేసుకున్న రహస్య ఒప్పందాలు తమకు తెలియనివి కావని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎం.పి.పి.లు, జెడ్పీటీసీ, ఎం.పి.టి.సి., సర్పంచ్‌లు, నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన దేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
కోటవురట్ల, ఏప్రిల్ 20: వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.శ్రీ్ధర్ తెలిపారు. పశువులు వేసవిలో తక్కువ మేత తిని ఎక్కువ నీళ్ళు తాగడం వలన పాల దిగుబడి తగ్గుతుందన్నారు. తినే తక్కువ ఆహారంలో అధిక మొత్తంలో మాంసం కృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు లభించేలా పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాడి పశువులకు రోజుకు కనీసం ఐదు కిలోల మేలు రకం పచ్చిగడ్డి, ఏడు కిలోల ఎండుగడ్డి, రెండు కిలోల సమీకృత దాణా ఇవ్వాలన్నారు. గడ్డిని చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించాలన్నారు. దాణాతో పాటు ప్రతీ రోజూ 50 గ్రాములు ఖనిజ లవంణాలు మిశ్రమాన్ని ఇవ్వాలన్నారు. పచ్చగడ్డి లభ్యం కానప్పుడు మాగ వేసిన లేదా ఊరగడ్డిని మేపాలన్నారు. అదనంగా విటమిన్ ఎ తగు మోతాదులో పాడి పశువులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుబాబుల చెట్లు ఆకులను కలిపి మేపాలన్నారు. వేసవిలో లభ్యమయ్యే గడ్డి తక్కువగా ఉంటుందన్నారు. మండుటెండలో బయటకు పంపితే పశువులు వడదెబ్బకు గురవుతాయన్నారు. పశువులను పాకల్లోనే ఉంచి మేపాలన్నారు. వేసవిలో పశువులకు సోకే పారుడు వ్యాధి , జీర్ణకోశ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.