విశాఖపట్నం

హోదా సాధించేందుకే ధర్మపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 20: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘్ధర్మపోరాట దీక్ష’ చేపట్టారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు వెల్లువెత్తుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సీఎం దీక్షకు సంఘీభావంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి చెంగల్రావుపేటలో శుక్రవారం నిర్వహించిన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. అసంబద్ధ విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటారన్న నమ్మకంతోనే గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేశామన్నారు. పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు సాధించేందుకు బీజేపీ సహకరిస్తుందని భావించామని, మూడున్నరేళ్ల పాటు తాత్సారం చేసిన కేంద్రం తీరుతో విసిగి బయటకు వచ్చామన్నారు. గత ఎన్నికల్లో రాజకీయంగా నష్టమని తెలిసినా బీజేపీతో కలిసి పోటీ చేశామన్నారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై అప్పటి బీజేపీ రాజ్యసభ సభ్యులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ప్రకటన నిజం చేయాలని కోరామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో తలపడుతున్నారన్నారు. పలు సందర్భాల్లో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి విభజన హామీలపై స్పందించాల్సిందిగా చంద్రబాబు చేసిన ప్రయత్నాలను వమ్ము చేశారని ఆరోపించారు. తెలుగు ప్రజల ఆత్మాభిమానంపై బీజేపీ దాడికి తెగబడుతోందన్నారు. నీతి అయోగ్ నిబంధనల మేరకే హోదా ఇవ్వట్లేదంటున్న కేంద్రం అవసరమైతే నిబంధనలు సడిలించాల్సిందేనన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ దీక్షను విమర్శించి, చంద్రబాబు అదే బాటలో దీక్ష చేయడంపై స్పందిస్తూ ఇది ప్రజల మనోభావాల కోసం పోరాటమన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలున్నాయాని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా విభజన హామీలైన విద్యా సంస్థల ఏర్పాటుకు రూ.11 వేలకోట్లు అవసరమైతే కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసిందన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రం దిగి వచ్చే వరకూ టీడీపీ పోరాడుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహ్మాన్, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.