విశాఖ

ఘనంగా నూకాంబికా అమ్మవారి ఉత్సవాలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం(టౌన్),మార్చి 17: నూకాంబికా అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి పెద్ద జాగరం సందర్భంగా గరగలతో అమ్మవారిని ఊరేగించారు. అబీద్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా శ్రోతలను ఆకట్టుకుంది. శనివారం అమ్మవారి పండగ సందర్భంగా తెల్లవారు జాము నుంచి భక్తులు గుడి వద్ద బారులు తీరి కనిపించారు. భక్తులు అమ్మవారికి పసుపు,కుంకుమ,చీర సమర్పించుకొని పూజలు చేశారు. వేలాది మంది మహిళలు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ భక్తుల కోసం ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. సాయంత్రం బాణాసంచాతో సంబరం నిర్వహించారు. డప్పులు, మేళ తాళాలు, సాంస్కృతి ప్రదర్శనలు ఆకుట్టుకున్నాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు సంపతులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ మాకిరెడ్డి అప్పారావు, కమిటీ సభ్యులు భక్తులక ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రత్యేక దర్శనం పేరుతో ఈ ఏడాది 40టిక్కెట్టు ధర పెట్టడం పలువురు విమర్శలు గుప్పించారు.
ఘనంగా నూకాంబికా అమ్మవారి జాతర మహోత్సవాలు
కృష్ణాదేవిపేట, మార్చి 17: మండలంలో లింగంపేట నూకాంబికా అమ్మవారి జాతర మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుండి భక్తులు అదిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పసుపు, కుంకుమలు, తలనీలాలు సమర్పించున్నా. ఏజన్సీ, మైదాన ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయం వద్ద భారీ విద్యుత్ దీపాలకరణ సెట్టింగ్‌లు ఏర్పాటు చేసారు. గరగల జాగరణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వమించారు. జెడ్పీటీసీ వేణుగోపాల్; ఎంపీపీ లక్ష్మీనారాయణ, మార్కెట్ చైర్మెన్ అప్పలనాయుడు, ఆలయ చైర్మెన్ అప్పలనాయుడుతో పాటు పలువురు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు జాతర నిర్వహించన్నునట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.

బీపీసీ 8 రకానికి జాతీయ గుర్తింపు
కొయ్యూరు, మార్చి 17: బీపీసీ 8 రకం జీడిమామిడి అంటు మొక్క అన్నింటే మేలైందని బాపట్ల వై ఎస్సార్ ఉద్యానవిశ్వ విద్యాలయ శాస్తవ్రేత్త ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక అల్లూరి మ్యూజియంలో జీడిమామిడి సాగుపై రైతాంగానికి జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీసీ 8 రకానికి జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. అలాగే బీపీసీ 5, 9,10,11 రకాలను ఇటీవల విడుదల చేసామన్నారు. రాష్ట్రంలో 1.26 లక్షల హెక్టార్లలో జీడిమామిడి సాగు అవుతుండగా లక్షా 420 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందన్నారు. మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఒడిషా , తమిళనాడు, కర్ణాటక, గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ పంట ప్రధానంగా సాగు అవుతుందన్నారు. మన రాష్ట్రంలో విశాఖ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండువేల హెక్టార్ల వరకు సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. అంటు మొక్కలతో అధిక దిగుబడి సాధించవచ్చని ఒక్కొక్క అంటు మొక్క 30 రూపాయల వంతున అందించే విధంగా తీసుకుంటున్నామన్నారు. కావాల్సిన రైతులు ముందుగా వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. జిల్లాలో అనకాపల్లిలో కూడా ఈరకం అంటుమొక్కలు లభిస్తాయన్నారు. రైతులే నర్సరీలు ఏర్పాటు చేసుకుంటే ప్రభ్తువం రాయితీ అందిస్తుందన్నారు. ఈకార్యక్రమంలో కీటక శాస్తవ్రేత్త నాగేంద్రరెడ్డి, సాగు మెళుకువలు చీడపీడల నివారణ చర్యలను వివరించారు. మండల ఉద్యానవన అధికారి బిందు, ఎ. ఓ. విజయలక్ష్మి, సర్పంచ్ జోగిరాజుతో పాటు ఎ. ఇ. ఓ.లు, ఎంపీ ఇ ఓలు పాల్గొన్నారు.