విశాఖ

కార్యకర్తలు పార్టీ అభివృద్ధిపై దృష్టిసారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, మార్చి 20: రానున్న ఎన్నికల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు కార్యకర్తలు క్షేత్రస్థాయి నుండి పార్టీని అభివృద్ధి చేయడంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర రెడ్డి సూచించారు. నవరత్నాల కమిటీలకు శిక్షణా కార్యక్రమం స్థానిక వేంకటేశ్వరా కల్యాణ మండపంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి అధికారం కోసం కాకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలన్న లక్ష్యంతో శ్రమిస్తున్నారన్న విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలన్నారు. అబద్దపు హామీలతో ప్రజలను మోసగించి చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టడమే కాకుండా నాలుగేళ్లకాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయారని ఆయన విమర్సించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులతో అనైతిక పొత్తు పెట్టుకున్న చంద్రబాబునాయుడు వైఎస్ జగన్‌ను జైలుపాలుచేసినా అతని నాయకత్వం పట్ల ప్రజల్లో అపార నమ్మకం మరింత ద్విగుణీకృతమైందన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్, విజయనగరం సమన్వయకర్త మజ్జి శ్రీను, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త వరుదు కల్యాణీ తదితరులు మాట్లాడుతూ గతంలో పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా లేకపోవడమే కొంతవరకు పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైందన్నారు. ప్రస్తుతం పార్టీ అన్నివిధాలా అభివృద్ధి చెందిందన్నారు. నవరత్నాల గూర్చి వివరించి ఎన్నికల నాటికి పార్టీని బలీయమైన శక్తిగా రూపొంది ఓటర్లు పార్టీ పట్ల ఆకర్షితులయ్యేలా కార్యకర్తలు చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు భూమా కరుణాకర రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే దివంగత సిఎం రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ఆయా పార్టీల నాయకుల పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం అంకుపాలెం తదితర గ్రామాలకు చెందిన 50మంది భూమా కరుణాకర రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి పార్టీకండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏడువాక సత్యారావు, పల్లా నర్సింగరావు, ఎంవి శ్రీకాంత్, ఓరుగంటి నెహ్రూ, బొడ్డేడ సూర్యనారాయణ, వేచలపుప్రకాష్, మొల్లి ప్రసాద్, జయదేవ్, సూరిశెట్టి గోవింద, అల్లం రామ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

జాబ్ కార్డులు ఉన్న వారందరూ ఉపాధి పనుల్లో పాల్గొనాలి
కోటవురట్ల, మార్చి 20: జాబ్‌కార్డులు ఉన్న కూలీలందరూ ఉపాధి హామీ పనుల్లో పాల్గొనాలని ఎడీవో కళ్యాణి సూచించారు. మండలంలో కుంకుంపూడిలో జరుగుతున్న ఎర్ర చెరువు మరమ్మతు పనులను ఎడీవోను మంగళవారం పరిశీలించారు. ఆన్‌లైన్‌లో నమోదైన కూలీల మస్తర్లను ఈసందర్భంగా తనిఖీ చేసారు. ఉపాధి హామీ పనులు కూలీల వలసలను అరికట్టగలిగాయన్నారు. అనుకున్న లక్ష్యాన్ని ఇంకా లక్షా 80 వేల పనిదినాలు మిగిలి ఉన్నాయన్నారు. దీనిని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. మండలంలో 11,325 జాబ్‌కార్డులు ఉండగా 5,430 మంది ప్రస్తుతం పని చేస్తున్నారన్నారు. ఈ ఏడాది మండలంలో సుమారు రెండు కోట్లు విలువైన ఉపాధి హామీ పనులు జరిగాయన్నారు. ఎర్ర చెరువులో ఐదు లక్షల రూపాయలతో మరమ్మతులు చేయిస్తున్నామన్నారు . చెరువు పనుల్లో 285 మంది కూలీలు రోజూ పాల్గొంటున్నారన్నారు. కూలీలకు వేసవిలో అదనపు వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

నెలాఖరులోగా ఓడీ ఎఫ్ పూర్తి చేయాలి
కొయ్యూరు, మార్చి 20: మండలంలో ఈనెలాఖరు నాటికి శతశాతం ఓడీ ఎఫ్ సాధించాలని మండల ప్రత్యేకాధికారి కె.పార్వతమ్మ సూచించారు. స్థానిక ఎంపీడీ ఓ కార్యాలయంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీ ప్రత్యేకాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాను ఓడీ ఎఫ్‌గా తీర్చే ప్రయత్నంలో ఈనెలాఖరు నాటికి శతశాతం పనులు పూర్తి చేయాలన్నారు. పంచాయతీ ప్రత్యేకాధికారులు, మిగిలిన అధికారులు వారి వారి పంచాయతీల్లో ఇంటింటికి వెళ్ళి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీ ఓ ఇమ్మాన్యూయేల్, పలు శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

చంద్రన్న బీమాను సద్వినియోగం చేసుకోవాలి
గొలుగొండ, మార్చి 20: చంద్రన్న బీమాలో ప్రతీ ఒక్కరూ సభ్యులుగా నమోదు కావాలని జిల్లా తెలుగు యువత సభ్యుడు తుమ్మగుంట అప్పలనాయుడు అన్నారు. ఇటీవల పెసరాడ గ్రామానికి చెందిన తూమ్‌నూకరాజు కుటుంబానికి చంద్రన్న బీమా ద్వారా ఐదువేల రూపాయల నగదును మంగళవారం అందజేసారు. ఈసందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా ఎంతో మందికి ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ బీమా పథకంలో అర్హులైన ప్రతీ ఒక్కరూ సభ్యలుగా నమోదు కావాలని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో చంద్రన్న బీమా సభ్యురాలితో పాటు పెసరాడ గ్రామస్తులు పాల్గొన్నారు.