విశాఖ

అభివృద్ధి పధంలో వడ్డాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చెయ్యపేట, డిసెంబర్ 14: మండలంలోని వడ్డాది గ్రామం అభివృద్ధి పథంలో ఉందని మాజీ ఎంపిపి బత్తుల తాతయ్యబాబు అన్నారు. శుక్రవారం వడ్డాదిలో నూతనంగా ప్రారంభించిన ఆగ్రో మోటార్స్ సేల్స్, సర్వీస్ పాయింట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు, వ్యవసాయంతోపాటు వాణిజ్యం పరంగా అన్ని అందుబాటులో ఉన్ననాడే ఏ గ్రామమైనా, పట్టణమైనా అభివృద్ధి చెందుతుందన్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు కూడలి ప్రాంతంగా ఉన్న వడ్డాదిలో అన్ని రకాల వ్యాపారాలు, సర్వీసింగ్ సెంటర్లు వెలయటం వలన ఇటు ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయాదారిత ప్రాంతమైన ఇక్కడ వ్యవసాయ రంగానికి ఉపయోగపడే ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్ల సర్వీసింగ్, అమ్మకాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి తాతయ్యబాబుతో పాటు వైస్ ఎంపిపి దాడి సూరినాగేశ్వరరావు, వడ్డాది పిఎసిఎస్ అధ్యక్షులు దొండా సన్యాసిరావు, సయ్యపురెడ్డి సత్యనారాయణ, బుచ్చెయ్యపేట ఎఎస్‌ఐ ఎం రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఖాతాదారులకు మెరుగైన సేవలతో కెనరా బ్యాంక్ ముందజ
బుచ్చెయ్యపేట, డిసెంబర్ 14: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించటంలో కెనరా బ్యాంక్ ముందంజలో ఉందని కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ పి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని రాజాంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఖాతాదారుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ రుణాలు, వ్యాపార రుణాలు, దీర్ఘ, మద్య కాలిక రుణాలు, విద్యా రుణాలు ఇలా ఎన్నో సేవలను కెనరా బ్యాంక్ అందగిస్తోందన్నారు. అలాగే రైతులు, బడుగు, బలహీన వర్గాలు, వ్యాపారులు, విద్యార్ధులకు అవసరమైన అన్ని రకాల ఖాతాలను తెరుస్తున్నామని, డిపాజిట్లపై ఆకర్షణీయమైన వడ్డీని ఇస్తున్నామన్నారు. అలాగే ఆయా అకౌంట్లు, రుణాల గురించి వివరించారు. బ్యాంకు సేవలను గ్రామీణ ప్రజలు బాగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటి కింద వివిధ గ్రామాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. రాజాం కెనరా బ్యాంక్ మేనేజర్ తాజ్ మోల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మండల సర్పంచ్‌ల పోరం మాజీ అధ్యక్షుడు డేగల అచ్చింనాయుడు, పెద్ద సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు.
4.68 ఎకరాల ప్రభుత్వ భూమి రికార్డులు మార్చేచారు
* మొగలిపురం రెవెన్యూలోకోట్లాది రూపాయల విలువైన భూమి ప్రవేటువ్యక్తికి దారాదత్తం..?*
* జాతీయ రహదారి పనుల ఆర్‌సిఎంకు లీజుకిచ్చిన విశాఖ వాసి *
* జిల్లాజాయింట్ కలెక్టర్‌కు గండిబాబ్జీ ఫిర్యాదుతోకలకం *
* జెసీ ఆదేశాలతో జిరాయితీ భూమిలోకి రహదారి మెటీరియల్ తరలింపు*
సబ్బవరం, డిసెంబర్ 14 : జిల్లాలోప్రభుత్వ భూముల టాంపరింగ్‌కు సంబంధించి సిట్ లాంటి దర్యాప్తుబృందాలు నియమించినప్పటికీ వారి కళ్లుగప్పికూడా కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను రికార్డులు మార్చి ప్రవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వైనం మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ వెలుగులోకి తెచ్చారు. శుక్రవారం ఆయన స్థానిక విలేఖర్లకు కబురుపంపి తారుమారైన భూమిలోనే తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మొగలిపురం రెవెన్యూ పరిధిలోగల సర్వేనెంబర్ 233/5లో సుమారు 4.68 ఎకరాల ప్రభుత్వ భూమి (గెడ్డవాగుగాపేర్గొనబడి ) ఉంది. అయితే అనకాపల్లి- ఆనందపురం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎంతోవిలువైన ఈ భూమిపై పెద్దల కన్నుపడింది. అంతే ఆ భూమిని ఎఫ్‌ఎంబి రికార్డుల్లో తారుమారు చేసి 2016లో ఆ భూమిని ఆనుకుని కొనుగోలు చేసిన జిరాయితీ భూమి యజమానిగాపేర్గొంటున్న విశాఖ వ్యక్తికి వెబ్‌ల్యాండ్ తోసహా ప్రైవేటు భూమిగాసబ్ డివిజిన్ చేసి రికార్డులు సృష్టించారు. మరోవైపు గతంలో ఆరోపణల నేపధ్యంలో ఈ భూమి చదును చేస్తుండగా ప్రెస్ ఫోటోలు తీయటంతో ప్రభుత్వ భూమిగా నిషేధిత బోర్డులు పెట్టిన సంగతి తెల్సిందే. అవి ఉండగానే మరో అవినీతి వ్యవహారానికి అధికారులు పూనుకోవటం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తనకు సంక్రమించిన ఈప్రభుత్వ భూమిని జాతీయ రహదారి కాంట్రాక్టరుకు విశాఖకు చెందిన ఓ వ్యక్తి లీజుకు ఇచ్చాడు. దీంతో ఆ కాంట్రాక్టరు జిరాయితీ భూమితోకలిపి 10 ఎకరాల స్థలాన్ని మెటీరియల్, ఆర్‌సిఎం ప్లాంట్ నిర్మాణాలకు లీజుకు తీసుకుని పనులు మొదలుపెట్టాడు. ఈ విషయం మొగలిపురం ఎంపీటీసీ సభ్యుడు బైలపూడి సత్యం ద్వారా జిల్లాజాయింట్ కలెక్టరుకు మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ సృజన స్పందించి ఇక్కడి తహశీల్దార్‌కు ఆదేశాలు ఇవ్వటంతో గురువారం రాత్రి ఈస్థలం నుంచి మెటీరియల్‌ను ప