రాష్ట్రీయం

మేటి నగరంగా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ ఉత్సవ్‌లో సిఎం చంద్రబాబు ఎస్పీ బాలుకు స్వరకళా సామ్రాట్ బిరుదు ప్రదానం

విశాఖపట్నం, జనవరి 2: మేటి నగరంగా విశాఖను తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖలో జరుగుతున్న విశాఖ ఉత్సవ్ రెండో రోజు కార్యక్రమానికి శనివారం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విశాఖకు బ్రహ్మాండమైన భవిష్యత్ ఉందని అన్నారు. విశాఖ ప్రజలు చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో హుదూద్ తుపానును జయించారని అన్నారు. హుదూద్ ఆనవాళ్లు కూడా కనబడకుండా, ఇక్కడి ప్రజలు పచ్చదనాన్ని పెంపొందించారని చంద్రబాబు అభినందించారు. విశాఖకు సమీపంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. అనకాపల్లి-్భగాపురం మధ్య సుందర నగరాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు.
ఎస్పీ బాలుకి స్వరకళా సామ్రాట్ బిరుదు
ఈ సందర్భంగా సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు స్వర కళా సామ్రాట్ బిరుదును ప్రదానం చేశారు. సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ ఉత్సవ్ వేదికపై ఎస్మీ బాలసుబ్రహ్మణ్యంకు అందించారు. సన్మాన కార్యక్రమం తరువాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం అని అన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఆయన మరో 50 ఏళ్లు ఇటువంటి స్వరంతోనే ప్రేక్షకులను మెప్పిస్తారన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. బాలు, తను ఒకే జిల్లాకు చెందినవారమని, ఒకే కళాశాల్లో చదివామని చంద్రబాబు చెప్పారు. అనేక భాషల్లో పాటలు పాడి, ప్రేక్షక లోకాన్ని మెప్పించిన బాలు గానం ఎప్పుడూ తెలుగు వారి గుండెల్లో నిలిచిపోతుందని అన్నారు. సన్మానానికి ముందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎక్కడ స్ర్తిలు, భాష గౌరవింపబడుతుందో, మనషులతో పాటు మనసులు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. అది ఆంధ్ర రాష్ట్రం కావడం తన అదృష్టమని అన్నారు. వీటన్నింటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అన్నారు. చంద్రబాబుకు, తనకు చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయన్నారు. ఇద్దరం తరచూ కలుసుకోపోయినా, ఒకరినొకరం పరోక్షంగా గౌరవించుకుంటామని బాలు అన్నారు. ఒక మేధావి చెప్పినట్టు ఐదేళ్ల కోసం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం.. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి విపక్షాలు చేతనైతే సాయం అందించాలి తప్ప, విమర్శించకూడదని బాలు హితవు పలికారు. ‘సాయం చేయకపోతే, మానేయండి, కానీ చేసే మంచి పనులను అడ్డుకోకండి. దాని వలన ప్రగతికి విఘాతం కలుగుతుంది. జాతి జబ్బు పడుతుంది..అని అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుది ఉక్కు సంకల్పమని అన్నారు. (చిత్రం) విశాఖ ఉత్సవ్‌లో ఢంకా మోగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు * ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు స్వరకళా సామ్రాట్ బిరుదు ప్రదానం చేస్తున్న సిఎం