విశాఖ

ప్రత్యేక హోదాపై పెల్లుబుకిన నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, మార్చి 22: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్‌తో సాగుతున్న ఉద్యమం గురువారం మరింత తీవ్రస్థాయిలో పెల్లుబుకింది. ఉభయ కమ్యునిస్టు పార్టీల రాష్టవ్య్రాప్త పిలుపులో భాగంగా సిపిఎం, సిపిఐ పార్టీల నేతలు ఇక్కడి జాతీయ రహదారిని దిగ్భందనం చేసి రాకపోకలను స్తంభింపజేసారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీతోపాటు కాంగ్రెస్, జనసేన, ఇతర ప్రజాసంఘాల నేతలు ఈ ఉద్యమంలో పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. మరోవైపు పార్లమెంట్‌లో అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రత్యేక హోదా కోసం చేపడుతున్న ఆందోళనకు మద్ధతుగా అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నెహ్రూచౌక్ జంక్షన్‌లో రాస్తారోకో, నిరసన దీక్షలు తదితర ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో సాగిన ఈ ఉద్యమంలో జాతీయ రహదారిని దిగ్భందం చేయడంతో సుమారు మూడుగంటలపాటు జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. సుమారు పదికిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులనుద్ధేశించి వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి లోక్‌సభ వైసీపీ కమిటీ సమన్వయకర్త వరూది కల్యాణి, బొడ్డేడ యలమంచిలి సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, పట్టణ వైసీపీ అధ్యక్షులు జానకిరామరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాంజీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఐఆర్ గంగాదర్, సిపిఎం నేతలు బాలకృష్ణ, లోకనాథం, మళ్ల సత్యనారాయణ, సిపిఐ నేతలు మళ్ల మాదవరావు, వైఎన్ బద్రం, జనసేన పార్టీ కార్యకర్తలు శ్రీరామదాసు గోవింద, వేలం నూకరాజు, శ్రీకాంత్, మళ్ల శ్రీను, ఉత్తరాంధ్ర చర్చావేదిక సభ్యులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ పీలా నాగశ్రీను, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్‌బాబు, బుగిడి నూక అప్పారావు తదితరులు ఈ ఆందోళనకారులనుద్ధేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలి, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఫ్రకటించాలి, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలి తదితర డిమాండ్ల సాధన కోరుతూ ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్సించి నినాదాలు చేసారు. ఇక్కడి నెహ్రూచౌక్ జంక్షన్‌లో జరిగిన నిరసన శిబిరాన్ని ఉద్దేశించి జిల్లా దేశం ప్రధాన కార్యదర్శి బుద్ధ నాగజగదీష్, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల వెంకట్రావు, డాక్టర్ విష్ణుమూర్తి, సత్యవతి, జిల్లా దేశం నాయకులు నారాయణరావు, ఎంపీపీ వెంకట సావిత్రి, జిల్లా దేశం నాయకులు మళ్ల సురేంద్ర, జిల్లా దేశం కార్యదర్సి కొణతాల రత్నకుమారి తదితరులు ప్రసంగించారు. ఆందోళనకారులు నల్లబ్యాడ్జీలు దరించి ప్లకార్డులతో తమ నిరసన తెలియజేసారు. ప్రత్యేక హోదా ఉద్యమంతో స్తబ్ధతగా ఉన్న అనకాపల్లిలో మరోసారి నిరసన దీక్షలు, ధర్నాలు, ఆందోళనలతో దద్దరిల్లిపోయింది.

భారీగా మొహరించిన భద్రతా బలగాలు
జాతీయ రహదారి దిగ్భందం ఉద్యమానికి పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు మొహరించాయి. వజ్ర వాహనంతోపాటు ఆందోళనకారులను విధ్వంసానికి పాల్పడితే వారిని చిత్రీకరించేందుకు డ్రోన్ కెమెరాలు, చెస్ట్ కెమెరాలు తదితర అత్యాధునిక పరిజ్ఞానాన్ని బందోబస్తుకు ఈ పర్యాయం పోలీస్ బలగాలు వినియోగించాయి. డిఎస్పిలు వెంకటరమణ, పాపారావుల నేతృత్వంలో శాంతియుతంగా ఈ ఉద్యమం కొనసాగింది.

శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలు ముస్తాబు
చోడవరం, మార్చి 22: శ్రీరామనవమి ఉత్సవాలకు మండలంలోని పలు రామాలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు విళంబి నామ సంవత్సరంలోనే జన్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అందుచే ఈ ఏడాది శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆలయాలను రంగులతో అలంకరిస్తున్నాయి. ముంగిట చలువ పందిళ్లు వేసి ముస్తాబు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాలను విద్యుద్ధీపాలతో అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానంగా స్థానిక వ్యాపార వీధిలో వేంచేసియున్న అభయాంజనేయ స్వామి బోళ్లవీధి సీతారామాలయం తదితర దేవాలయాలను ఇప్పటికే ముస్తాబు చేసారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు కె. ప్రసాద్ శర్మ మాట్లాడుతూ శుక్రవారం నుండి 25వ తేదీ ఆదివారం వరకు మూడురోజులపాటు శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఫ్రధానంగా ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఉదయం ఆరుగంటల నుండి ఆంజనేయస్వామికి విశేష అభిషేక పూజలు జరిపి 8.24నిమిషాల శుభముహూర్తాన మేషలఘ్నంలో సీతారామ కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసామన్నారు. అలాగే మూడురోజులపాటు స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అర్చనలు
జరుగుతాయన్నారు.