విశాఖ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకరావుపేట, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ , విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని వైకాపా, కాంగ్రెస్, వామపక్ష నాయకులు డిమాండ్ చేసారు. గురువారం పాయకరావుపేట జాతీయ రహదారిపై అఖిల పక్ష నాయకులు బైఠాయించి ప్రత్యేక హోదాపై నినాదాలు చేస్తూ హైవేను దిగ్భందం చేసారు. ఈసందర్భంగా వైకాపా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా, విభజన హామీలను ఎన్డీ ఎ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ఫ్యాకేజీతో పాటు విశాఖలో రైల్వే జోన్, కడపలో ఉక్కు పరిశ్రమ , రామయ్యపట్నం పోర్టుతో పాటు కేంద్ర విద్యా సంస్థల నెలకొల్పడంతో బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ళుగా రాష్ట్రానికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి అఖిల పక్షాలు ఏకమై విభజన హామీలు నెరవేరే వరకు ఉద్యమిస్తామని అందులో భాగంగానే జాతీయ రహదారులు దిగ్భందతో పాటు కేంద్ర ఫ్రభుత్వానికి కనువిప్పు కలిగించేలా ఉద్యమాలు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొల్లబాబూరావు, వైకాపా నియోజకవర్గం సమన్వయకర్తలు చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, దగ్గుపల్లి సాయి, ధనిశెట్టిబాబూరావు, సీపీ ఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రావుజగ్గారావు, జె.వీ. ప్రభాకర్, అర్జున్, సీపీ ఎం మండల కార్యదర్శి దాస్, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి మెరిట్ స్కాలర్ షిప్‌కు ఎంపికైన విద్యార్థులు
పాయకరావుపేట, మార్చి 22: మండలంలో పెంటకోట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి మెరిట్ స్కాలర్ షిప్‌కు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు సి.మహేశ్వరరావు అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 నవంబర్‌లో జరిగిన జాతీయ స్థాయి మెరిట్ స్కాలర్ షిప్‌లో తమ విద్యార్థులు ఎస్.హేమ, ఎం. ఏజేబులు ఉత్తీర్ణత సాధించాలన్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరువేలు చొప్పున నాలుగు సంవత్సరాల పాటు అందిస్తుందన్నారు. ఈవిద్యార్థులను ఉపాధ్యాయులు మణికుమార్, వేణుగోపాల్‌లు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఉపాధ్యాయులు చిట్టిబాబు, కృష్ణరాజు, గణపతిలు అభినందించారు.

నాల్గవ యూనిట్ మరమ్మతులు పూర్తి
సీలేరు, మార్చి 22: స్థానిక జల విద్యుత్ కేంద్రంలో నాల్గవ యూనిట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తి మరమ్మతులకు గురి కావడంతో ఈపనులు గత నెల రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. ఈపనుల నిమిత్తం చెన్నైకు చెందని అభిరామ కంపెనీకి అప్పంగిచారు. పనులు పూర్తి కావడంతో ట్రయిల్ రన్‌గా గురువారం స్విన్నింగ్‌లో పెట్టారు. ఈసందర్భంగా డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ మాట్లాడుతూ నాల్గవ యూనిట్ మరమ్మతులు పూర్తయ్యాయని, ట్రయిల్ రన్‌గా వినియోగంలోకి తెచ్చేందుకు ఈ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామన్నారు. యూనిట్ మెరుగ్గా ఉంటే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

మరిడిమహాలక్ష్మి అమ్మవారి జాతరకు ఏర్పాట్లు
* ప్రారంభమైన అమ్మవారి జాతర మహోత్సవాలు
నర్సీపట్నం(రూరల్),మార్చి 22: నర్సీపట్నంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీమరిడిమహాలక్ష్మి అమ్మవారి జాతర గురువారం నుండి ప్రారంభించారు. గురువారం రాత్రి చిన్నజాగరణ కార్యక్రమంతో ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంట ఇలవేల్పుగా పిలిచే మరిడిమహాలక్ష్మి అమ్మవారి జాతర ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 30వ తేదీన జరిగే అమ్మవారి జాతరకు సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని , వారికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు , ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. 29న పెద్దజాగరణ , 30న అమ్మవారి పండుగ నిర్వహించనున్నారు. ఇప్పటికే పట్టణంలో రంగురంగుల విద్యుత్ లైట్లును ఏర్పాటు చేసేందుకు భారీ సెట్టింగ్‌లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ రెండేళ్ళకోసారి జరిగే మరిడిమహాలక్ష్మి అమ్మవారి జాతరకు గురువారం రాత్రి చిన జాగరణతో జాతర ప్రారంభం కానుంది.