విశాఖ

రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, సెప్టెంబర్ 21: స్థానిక వైద్య విధాన పరిషత్ ఏరియా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతుంది. అరకులోయ మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రితో పాటు గనె్నల, మాడగడ, సుంకరమెట్ట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు రోగుల తాకిడి అధికంగా ఉంది. ఈ ఆసుపత్రులకు రోజు రోజుకు వ్యాధిగ్రస్తుల తాకిడి పెరుగుతుంది. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, జ్వరాలు వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు చికిత్సల కోసం ఆసుపత్రులలో చేరుతున్నారు. ఏరియా ఆసుపత్రిలో ప్రతి రోజు 50 నుంచి 70 మంది వరకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో రక్త పరీక్ష గది నిత్యం రోగులతో కిటకిటలాడుతుంది. మండలంలో దోమలు వ్యాధి చెందుతుండడంతో డెంగ్యూ, మలేరియా, జ్వరాలు వంటి వ్యాధులు విజృంభించి ఈ ప్రాంత వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందుజాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ ఫలితం కానరావడం లేదు. గ్రామాలలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉండడమే కాకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడంతో వ్యాధులు విలయతాండవం చేస్తున్నాయి. దీంతో ఏరియా ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగుల సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది. గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.