విశాఖ

ఆశ్రమాల్లో వౌలిక వసతులకు నిధులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, సెప్టెంబర్ 21: అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాల్లో వౌళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ స్థానిక డి.ఇ. వంశీక్రిష్ణ తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అరకులోయ మండలంలోని ఏడు వసతి గృహాలకు, డుంబ్రిగుడ మండలంలోని పదకొండు, అనంతగిరి మండలంలోని పనె్నండు వసతి గృహాలకు సుమారు 123 కోట్ల రూపాయలతో వౌళిక వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. ఆశ్రమాల్లో అదనపు తరగతులు, మరుగుదొడ్ల నిర్మాణం, మంచినీటి సదుపాయాలు వంటి వాటిని ఈ నిధులతో చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పురాతన డిగ్రీ కళాశాల వసతి గృహాన్ని మరమ్మతులు చేసేందుకు 15.3 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టనున్నామని ఆయన చెప్పారు. ఈ భవనాన్ని మరమ్మతులు చేసిన తరువాత ఏకలవ్య పాఠశాల నిర్వహణకు అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు. క్రీడా పాఠశాల భవన మరమ్మతులకు 9.8 లక్షల రూపాయలు మంజూరైనట్టు ఆయన చెప్పారు. నాబార్డు నిధులతో యండపల్లివలస, డుంబ్రిగుడ గురుకుల బాలికల పాఠశాల, అరకులోయ బాలుర గురుకుల పాఠశాల, అనంతగిరి, భీంపోలు పాఠశాలలకు అదనపు భవనాల నిర్మాణానికి 10 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరైనట్టు ఆయన తెలిపారు. ఒక్కొక్క భవన నిర్మాణానికి కోటి 75 లక్షలు వెచ్చించనున్నట్టు ఆయన చెప్పారు. లోతేరు ఆశ్రమ పాఠశాలలో అదనపు భవన నిర్మాణానికి కోటి 50 లక్షలు, డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ ఆశ్రమ పాఠశాలలో భవన నిర్మాణానికి 3 కోట్ల 76 లక్షలు, జి.బొడ్డాపుట్టు రహదారి నిర్మాణానికి కోటి 20 లక్షలు, అనంతగిరి మండలం చెరుకుమడత రహదారి నిర్మాణానికి కోటి నాలుగు లక్షల రూపాయలు మంజూరైనట్టు వంశీక్రిష్ణ వివరించారు.