విశాఖపట్నం

తన దాకా వస్తే కానీ... (కథానిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మన యూనివర్శిటీ ప్రొఫెసర్ రమణగారిని ముఖ్య

అతిథిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం’’ అంటూ

మైక్‌లో వినిపించడంతో లేచి వెళ్లాను.
జ్యోతి ప్రజ్వలన తర్వాత అంతర్ కళాశాలల వక్తృత్వ

పోటీల్లో ఇచ్చిన టాపిక్‌పై విద్యార్థుల ప్రసంగాలు

మొదలయ్యాయి. వాటిని చూస్తూనే నేను గతంలోకి

జారుకున్నాను.
* * *
క్లాసులో పాఠం జోరుగా సాగుతోంది. ముందు

వరుసలో కూర్చున్న వాళ్లంతా లెక్చరర్ చెప్పేది

శ్రద్ధగా వింటున్నట్లు నటిస్తున్నారు. నేను వెనక

బెంచీలో కూర్చుని కునికిపాట్లు పడుతున్నాను.
ఇంతలో అటెండర్ ఏదో నోటీసు తీసుకొచ్చి లెక్చరర్‌కి

ఇచ్చాడు.
అది చదివిన మా లెక్చరర్‌గారు ‘‘విద్యార్థులారా

మన కాలేజీలో రేపు సాయంత్రం ‘అవినీతి అనేది

మన దేశ భవిష్యత్తుకు తీరని దెబ్బ’ అనే అంశంపై

వక్తృత్వ పోటీ జరగనుంది. ఆసక్తి ఉన్న వారు పేర్లు

ఇవ్వొచ్చు. బహుమతులు కూడా ఉన్నాయి’’

అంటూ ప్రకటించి నోటీసును అటెండర్‌కి ఇచ్చేసారు.

అటెండర్ వెళ్లిపోయాడు.
ఆ విషయం వినగానే నాలో ఏదో కసి

మొదలయింది. ఫస్టియర్‌లో సగం రోజులు

గడిచిపోయాయి. అయినా నాకు విద్యార్థుల్లో

ఆశించినంత గుర్తింపు రాలేదు. అదే ఆ శ్రావణ్‌గాడు

అంటే అందరికీ ఇష్టమే. ఇలా అయితే కాలేజీ

లీడర్‌గా ఎదగడం కష్టం. ఎలాగైనా ఈ పోటీలో

పాల్గొని బహుమతి కొట్టాలి. పది మంది దగ్గరా

గంటల కొద్దీ మాట్లాడే నాకు స్టేజిపై మాట్లాడడం ఒక

లెక్కా? అనిపించింది.
నిజానికి మాది ఆ నగరానికి దూరంగా చిన్న ఊరు.

అక్కడ సరైన కాలేజీ లేకపోవడం వల్ల మా

తల్లిదండ్రులు ఈ కాలేజీలో చేర్చారు. ఇక్కడ మంచి

రూము, నచ్చింది తినడానికి మెస్, ఖర్చుకి

అడిగినంత డబ్బిస్తున్నారు. దాంతో నా జీవితం

మూడు సినిమాలు, ఆరు సిగరెట్లుగా

గడిచిపోతుంది.
రూముకి చేరిన నాకు రేపు ఎలా మాట్లాడాలో ఒక

పట్టాన బోధపడలేదు. సినిమాలు చూసి వాటి

ఆధారంగా మాట్లాడే నాకు అవినీతి మీద టాపిక్

ఎలా మొదలుపెట్టాలో బోధపడడంలేదు. ఇంతలో

నా రూమ్మేటు కామేశం సుడిగాలిలా వచ్చి ‘‘ ఏమిటి

సంగతి?’ అన్నట్లు చూసాడు. వాడికి విషయం చెప్పి

ఏమైనా పాయింట్లు చెప్పమన్నాను.
‘‘ముందు టిఫిన్ తిని, సిగరెట్ పీలిస్తే పాయింట్లు

తడతాయి’’ అన్నాడు. అవసరం నాది కనుక

సరేననక తప్పలేదు.
హోటల్‌కి వెళ్లి పీకల దాకా టిఫిన్ మెక్కి, ఒక

సిగరెట్ ప్యాకెట్ కొనిపించుకున్నాడు. రూముకి

వెళ్లాం ఇద్దరం.
‘‘ ఈ టాపిక్ మీద తప్పక మాట్లాడాలంటావా?’’

బ్రేవ్‌మని తేనుస్తూ అన్నాడు కామేశం.
నాకు ఒళ్లు మండిపోయింది. అయినా ఏమీ

అనకుండా ‘‘అవును మాట్లాడాలి. బాగా మాట్లాడి

గుర్తింపు తెచ్చుకుని విద్యార్థుల ముందు పేరు

తెచ్చుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు గొప్పగా

చెప్పుకునేలా ఫేమస్ అవ్వాలి’’ అన్నాను.
దానికి వాడు బిగ్గరగా నవ్వాడు. ‘‘ ఇదేమైనా

సినిమా అనుకున్నావా? హీరోలా గొప్పగా

మాట్లాడడానికి? ఎవరైనా స్టేజి మీద మాట్లాడుతుంటే

కామెంట్స్ చేయడం, కింద నుండి అల్లరి చేసి వారు

మాట్లాడకుండా చేయడం అలవాటున్న

మనకెందుకు చెప్పు ఇలాంటివి? ఇక గుర్తింపు

అంటావా? వచ్చే సంవత్సరం ఎలక్షన్లలో పోటీ

చేసినపుడు గెలవడానికి సవాలక్ష మర్గాలున్నాయి’’

అన్నాడు.
నాకు మండిపోయింది.
అది గమనించిన కామేశం ‘‘సరే అయితే పక్కవీధిలో

నాకు తెలిసిన రచయిత ఒకాయన ఉన్నాడు.

అతను మనకు కావలసింది రాసి ఇవ్వగలడు’’

అంటూ అతని దగ్గరకి తీసుకెళ్లాడు.
కుర్తా, పైజామా, జులపాల జుత్తు, గొరిగేసిన

మీసాలతో కార్టూన్లలో రచయిత బొమ్మలా ఉన్న

అతను కాగితాల మీద ఏదో బరబర రాసేస్తున్నాడు.
అతనికి విషయం చెప్పాడు కామేశం.
‘‘అదెంత పని? ఒక గంటలో మీరు మాట్లాడవలసింది

రాసి ఇస్తాను’’ అంటూ మమ్మల్ని పంపేసాడు.
గంట తర్వాత కొన్ని కాగితాలు మాకు ఇచ్చాడు.
‘‘ ఓ వంద రూపాయలు ఉంటే సర్దంది. నా కథకు

పారితోషికం రాగానే ఇచ్చేస్తాను’’ అన్నాడు. తిరిగి

రావని తెలిసినా మా అవసరానికి ఆదుకున్నాడనే

భావనతో అతనికి వంద రూపాయలు ఇచ్చి

వచ్చేసాం.
అతను రాసింది అర్ధం కాకపోయినా నాకు తెలిసిన

స్టైల్లో రాసుకుని ప్రిపేర్ అయ్యాను.
* * *
మర్నాడు సాయంకాలం నాలుగు గంటలకు

అందరినీ మీటింగ్ హాలులో కూర్చోబెట్టారు.

ప్రిన్సిపాల్‌గారొచ్చి మాట్లాడారు. ‘‘జీవితంలో

కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ప్రయోజనకరం. బాగా

మాట్లాడే వారికి తగిన గుర్తింపు లభిస్తుంది.

ఇందులో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు’’

అని చెప్పి ఒక సీనియర్ లెక్చరర్‌ని కార్యక్రమ

నిర్వాహకునిగాను, ఇద్దరు లెచ్చరర్లని

న్యాయనిర్ణేతలుగా నిర్ణయించి ఆఫీసు రూము వైపు

వెళ్లిపోయారు.
‘‘ ఈ లిస్టులో ఉన్న వారిని వరుసగా పిలుస్తాను.

ప్రతి ఒక్కరికి మూడు నిముషాలు సమయం

ఇవ్వబడుతుంది. ఆల్‌దబెస్ట్’’ అన్నారు సీనియర్

లెక్చరర్.
ముందు ఒక విద్యార్థి దుర్యోధనుడిలా నడుస్తూ

వచ్చి ‘‘అధ్యక్షా’’ అంటూ నాటకీయంగా మొదలుపెట్టి

మాట్లాడసాగాడు.
బాగా బట్టీ పట్టినట్లున్నాడు నాటకంలోని డైలాగులు

చెబుతున్నట్లు చెప్పసాగాడు. అయితే సడన్‌గా

అతని మాటలు ఆగిపోయాయి. చదివింది

మరిచిపోయినట్లున్నాడు. తలపై కొట్టుకుంటూ నానా

అవస్థలు పడ్డాడు. అయినా పాపం చదివింది గుర్తు

రాలేనట్లుంది అందరికీ నమస్కారం పెట్టి స్టేజీ

దిగిపోయాడు.
తర్వాత మరో విద్యార్థి వచ్చి మెల్లగా

గొణుగుతున్నట్లు మాట్లాడసాగాడు. అందరూ

‘‘లౌడర్’’ అంటూ గట్టిగా అరవసాగారు.
దాంతో ముందే వణుకుతున్న ఆ విద్యార్థి మరింత

వణికిపోతూ మాట్లాడలేకపోయాడు.
‘‘పాపం చలిజ్వరంలా ఉంది స్టేజీ దిగు నాయనా’’

అని గట్టిగా అరిచారు స్టూడెంట్స్. కామెంట్స్ ఎక్కువ

కావడంతో అతను అర్ధంతరంగా మాట్లాడడం ఆపేసి

స్టేజి దిగిపోయాడు.
మరో విద్యార్థి వచ్చీ రాగానే యమస్పీడ్‌గా స్పీచ్

ప్రారంభించాడు. వీడెవడో బాగానే మాట్లాడుతున్నాడే

అనుకునే లోపల ఎవరో పీక నొక్కినట్లు ఫ్యాంటు

జేబులో చెయ్యి పెట్టి ప్రేక్షకుల వైపు చూస్తూ

నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
‘‘ముందు జేబులో నుండి చెయ్యి తియ్యి’’

విద్యార్థులు గట్టిగా అరవడంతో ఫ్యాంటు జేబులో

నుండి చెయ్యి తీసేసాడు.
ఒక కాగితం బయట పడింది. అందులో రాసి ఉన్నది

చదవాలని ప్రయత్నించాడు. అయితే అతని రైటింగ్

అతనికే అర్ధం కాలేదు కాబోలు ఒక్కో అక్షరం

కూడబలుక్కుంటూ చదవసాగాడు. ఈలోగా టైమ్

అయిపోయినట్లు బెల్ మోగడంతో ఒక్క గెంతులో

స్టేజీ మీద నుండి దిగిపోయాడు.
మరికొంత మంది ఫరవాలేదనిపించారు. ఇంతలో

శ్రవణ్ పేరు పిలవగానే అతను హూందాగా వచ్చి

మాట్లాడసాగాడు. అతని ఉపన్యాసం గంభీరంగా

సాగిపోతుంది. మధ్యలో చలోక్తులు, సూక్తులు,

కొటేషన్లు, శ్లోకాలతో తాను చెప్పదలచుకున్నది

అద్భుతంగా చెప్పాడు.
విద్యార్థులంతా హర్షధ్వానాలు చేశారు.
ఇంకో విద్యార్థి స్టేజ్ ఎక్కుతూనే కాళ్లు, చేతులు

ఊపేస్తూ, భరతనాట్యం చేసినట్లు మాట్లాడసాగాడు.

‘‘నేటి నాయకులు అవినీతి దేశ పురోభివృద్ధికి

గొడ్డలిపెట్టు, పారదెబ్బ, సుత్తిదెబ్బ, మేకు దెబ్బ’’

అంటూ ఆవేశంగా స్టేజీపై ఉన్న ఒక్క దెబ్బ వేశాడు.

దాని మీద ఉన్న ఫ్లవర్‌వాజ్ ఎగిరిపడి కార్యక్రమం

నిర్వహిస్తున్న సీనియర్ లెక్చరర్ బట్టతలకు

తగిలింది.
అతను ఆ విద్యార్థి వైపు కోపంగా చూసాడు.
‘‘సారీసర్’’ అంటూ ఆ విద్యార్థి వేదిక దిగిపోయాడు.
కొందరు మాట్లాడే ధైర్యం లేక జారుకున్నారు.
అందరూ చెప్పేది విని, అందులోని పాయింట్లను

పట్టేసి బాగా మాట్లాడాలనుకుని నా పేరు చివర్న

రాయించుకున్నాను. మరో ఇద్దరి తర్వాత నా పేరు

పిలిచారు.
నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
అంత వరకు అందరితో పాటు కామెంట్ చేసిన నాకు

స్టేజీ ఎక్కగానే ఒళ్లంతా చెమటలు పట్టేసాయి.

చిన్నగా వణుకు ప్రారంభమయింది.
తడబడుతూ మైక్ ముందు నిలబడగానే కింద ఉన్న

వాళ్లు సముద్రంలా కనిపించారు. ఏం మాట్లాడాలో

మరిచిపోయాను. ఇంతలో మైక్ సైరన్‌లా

కూతపెట్టింది. ఎవరో వచ్చి సరి చేశారు. నా పరిస్థితి

గమనించిన ఆర్గనైజర్ ఇక ఉపన్యాసం

మొదలుపెట్టమన్నారు. ఏదో మాట్లాడాలనుకున్నా

గొంతు పెగలలేదు. ఏం చెయ్యాలో తెలియక చేతులు

కట్టుకుని తిరిగి వదిలేసాను. కాళ్లు దూరం చేసి

చుట్టూ చూశాను. దాంతో మా వానరసేన

(మిత్రబృందం) ‘‘మాటలు రావేమోరా పాపం బెల్లం

కొట్టిన రాయిలా ఉండిపోయాడు’’ అన్నారు.
‘‘నీళ్లు కావాలేమో పెదాలు తడుపుకుంటాడేమో’’

ఒక విద్యార్థి అన్నాడు. నా పరిస్థితి గమనించిన

ఆర్గనైజర్ జాలిగా నవ్వాడు.
‘‘తర్వాత మాట్లాడుదువుగాని స్టేజీ దిగు’’ అని

ఒకరు.
‘‘ఇటొచ్చీ’’ అని ఇంకొకరు.
‘‘ఇక బజర్ నొక్కండి సార్’’ అంటూ మిగిలిన వాళ్లు

కామెంట్ చేశారు.
ఎలాగో ధైర్యం తెచ్చుకుని నాలుగు మాటలు

మాట్లాడానో లేదో లయబద్ధంగా చప్పట్లు

ప్రారంభమయ్యాయి.
నా స్పీచ్ వారికి నచ్చి కొడుతున్నారనుకుని మళ్లీ

మొదలుపెట్టాను. ఈసారి చప్పట్లతో పాటు విజిల్స్

కూడా మొదలయ్యాయి.
‘‘నువ్వు ఇచ్చిన టాపిక్ కాకుండా ఇంకేదో

మాట్లాడుతున్నావు’’ మా ఆర్గనైజర్ నావైపు

చూస్తూ అన్నాడు.
అప్పుడు నాకర్ధమయింది వాళ్లంతా ఎందుకు

చప్పట్లు కొడుతున్నారో. ఒళ్లంతా చెమటలు

పట్టేసాయి. అందరికీ ఒక దండం పెట్టి స్టేజీ

దిగిపోయాను.
దూరంగా ఉన్న కామేశం పళ్లికిలిస్తూ చేయి

రమ్మన్నట్లు పిలుస్తున్నాడు.
అతని దగ్గరకి వెళ్లాను.
‘‘ముందే చెప్పాను కదరా మనలాంటి వాళ్లం కింద

నిలబడి కామెంట్లు చేయగలం కానీ వేదికలెక్కి

మాట్లాడలేమని’’ అన్నాడు.
‘‘ ఆ విషయం ఈరోజు అనుభవంతో అర్ధమయింది.

కాలేజీ ఫంక్షన్లలో ఎవరైనా స్టేజీ ఎక్కి మాట్లాడితే

చాలు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసి వాళ్లను

డిస్టర్బ్ చేసి కిందకు దిగే వరకు ఊరుకునే వాళ్లం

కాదు. లెక్చరర్లు ఎంతో కష్టపడి ప్రిపేర్ అయి

క్లాసులో పాఠాలు చెప్పాలని చూస్తే వాళ్లనూ ఇలాగే

అల్లరి చేసినా సహనంతో క్షమించి పాఠాలు

చెబుతున్నారు. ఇక ముందు ఇలాంటివి కట్టిపెట్టి

శ్రవణ్‌లాంటి విద్యార్థుల సాయంతో, లెక్చరర్ల

సహాయంతో మెలకువలు నేర్చుకుని మంచి వక్తగా,

ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలి’’ అని మనసులో

మాట దృఢంగా నిశ్చయించు నిశ్చయించుకుని

ప్రయత్నం చేసిన నేను యూనివర్శిటీలో పెద్ద

పదవికి ఎగబ్రాకి అన్ని కళాశాలల్లో వక్తృత్వ

పోటీలను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేస్తూ

ముఖ్య అతిథిగా వెళ్లడం మరపురాని అనుభూతిగా

నిలిచిపోతుంది.
‘‘సార్ పోటీలు ముగిసాయి. ఇక విజేతల పేర్లు

ప్రకటించి బహుమతి ప్రదానం చేయడానికి మీరు

స్టేజీ పైకి రావాలి’’ అని పిలవడంతో వేదిక వైపు

నడిచాను. టేబుల్‌పై ఉన్న జ్ఞాపికలు నన్ను చూస్తూ

నవ్వుతూ స్వాగతం పలుకుతున్నట్లు అనిపించింది.

- సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ,
ఎంవిపి కాలనీ,
విశాఖపట్నం-530017.
సెల్ : 9989397651.

మినీకథ

కృతజ్ఞత

ఒక అడవి మార్గాన గురుశిష్యులిద్దరు నడుచుకుని

వెళుతున్నారు. ఆ మార్గంలో స్పృహ లేని స్థితిలో

ఒక వృద్ధుడు కనిపించాడు.
ఒంటి నిండా బురద, మలమూత్రాదులతో అతని

నుండి దుర్వాసన వస్తోం. ‘‘దాహం దాహం’’ అంటూ

వృద్ధుడు విలవిలలాడుతున్నాడు. శిష్యుడు ముక్కు

మూసుకుని అసహ్యంగా ముక్కు చిట్లించాడు.

గురువు ఆ వృద్ధునికి చేరుకున్నాడు. తన

కమండంలోని నీళ్లను తాగించి సేదదీర్చాడు. పక్కనే

ఉన్న కుంటలోని నీటిని తెచ్చి వృద్ధుని శరీరం

శుభ్రం చేసి తన వద్దనున్న పొడిబట్ట చుట్టి చెట్టు

వరకు నడిపించి కూర్చోబెట్టాడు.
శిష్యునికి ఇదంతా అర్ధం కాలేదు. ఇంత సేవ

చేయడం అవసరమా? అదే గురువున అడిగాడు.
‘‘నాయనా నేను అతనికి చేసిన సేవ గోరంత. అతని

ముఖంలో కనిపించిన కృతజ్ఞత కొండంత’’ అని

విడమరిచి చెప్పాడు గురువు.
‘‘గురువుగారూ ఇంతకీ కృతజ్ఞత అంటే ఏమిటి?’’ అని

ప్రశ్నించాడు శిష్యుడు. దానికి గురువు చిరునవ్వు

నవ్వి నాయనా కృతజ్ఞతకు అర్ధం చెప్పడం ఎవరికీ

సాధ్యం కాదు. అది అనంతం. అయితే ఈ భూమీ మీ

నివసించే పద్దెనిమిది లక్షల జీవరాశి సృష్టించి సృష్టి,

స్థితి, లయమునకు కారణమైన వారికి ప్రతిరోజూ

కృతజ్ఞత చెప్పాలి. ముఖ్యంగా మేధస్సు ఉన్న

మనుషులు భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి అనే

పంచభూతాలకు. ఆ పంచభూతాలను సృష్టించిన

దేవునికి ప్రతిరోజూ కృతజ్ఞతలు చెప్పాలి. తన జన్మకి

కారణమైన తల్లిదండ్రులకు, తనకి జ్ఞానం అందించిన

గురువుకి, ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేయాలి’’

అన్నారు.
శిష్యుడికి అర్ధమయింది.
నాటి నుండి గురువు మార్గంలోనే నడిచి

పునీతుడయ్యాడు. కృతజ్ఞతకు సరైన అర్ధం చెప్పిన

గురువుకి జీవితాంతం కృతజ్ఞుడై సేవలో తరించాడు

శిష్యుడు.

- టంకాల సత్యంనాయుడు,
సారధి గ్రామం,
రాజాం నగర పంచాయతీ పోస్టు,
శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 9395355952.

పుస్తక సమీక్ష

జీవన సమస్యల ముఖచిత్రం

తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ఒక ప్రత్యేక

స్థానముంది. దీనికి పద్య గేయ ప్రక్రియలు రెండు

జంట ప్రవాహాలు. కాలానికి నిలువుటద్దంగా మారిన

అనేక జీవన సమస్యలు దీనిలో

ప్రవాహప్రతిబింబాలు. ఈ నేపథ్యంలోంచి తనదైన

సొంతశైలితో ప్రత్యేక ముద్ర వేసుకోగలిగారు కవి

బుడితి రామినాయుడుగారు. వాజ్మయూఖాలు

ఇతని రెండవ కవితా సంపుటి. స్వతహాగా రంగస్థల

నటుడైన ఈ కవి పద్య, గేయ రచనలు చెయ్యడంలో

మంచి దిట్ట. సహజ శైలితో సరళ సుందరంగా

సాగిపోతోంది నడక. సామాజిక అనుభవాలను

అనుభూతులతో జోడించి ఆత్మాశ్రయ, సామూహిక

చింతనలతో, పలు రకాల హెచ్చరికలతో వ్యవస్థను

మేల్కొలుపుతూ దిశానిర్దేశనం చేస్తారు కవి.
పెద్ద చదువు చదివి వృద్ధి జెందెదవని
అమ్మానాన్న చదువ నంపినారె
విద్య నేర్వబోయి వెకిలి రాగింగులా
ఆత్మవంచనన్న నదియే కదర అంటూ హితబోధ

చేస్తారు రామినాయుడుగారు. పెద్ద చదువులతో

వృద్ధిలోకి రావలసిన యువతరం, విద్యను

అభ్యసించడానికి బదులు ర్యాగింగుల పేరుతో

ఆత్మవంచన చేసుకొని పెడతోవ పడుతున్న

విధానాన్ని దుయ్యబడతారు కవి. విద్యాలయాలకు

చీడపురుగులా దాపురించిన ఈ విష సంస్కృతికి

తుది వీడ్కోలు పలకాలనే అంతర్లీన భావన

ఇందులో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సంఘ

సంస్కరణలో భాగంగా నవతరాన్ని చైతన్యంతో

మేల్కొల్పడానికి అక్షరాల్ని రచనాయుధంగా

మలిచారు రామినాయుడు.
అన్యభాషలెన్ని యచ్చియున్నను గాని
మరువదారు తెలుగు మాతృభాష
తల్లిభాష మనకు దైవసమానము
తెలుగు నేర్వవయ్య కలుగు జయము అని
అంటారు ఓచోట. పరాయి భాషలెన్ని నేర్చినా,

మాతృభాషైన తెలుగును విస్మరించకూడదు. దైవ

సమానమైన తల్లి భాష తెలుగును అభ్యసిస్తే

అన్నింటా జయము కలుగుతుంది అంటారు కవి. ఈ

మాటలు అక్షరసత్యాలు. మాతృభాషలో పట్టు

సాధించిన వాడికి మిగతాభాషలన్నీ, అవలీలగా,

అలవోకగా పట్టుబడతాయి. ఈ నేపథ్యాన్ని

సామాజిక వస్తువుగా మలచుకొని అచ్చమైన

తెలుగు పద్యాన్ని హృద్యంగా అందిస్తారు

రామినాయుడు.
మూఢ విశ్వాసాలు కవితలో ముస్లిం సాంప్రదాయక

వివాహ వ్యవస్థ బంధాన్ని తూర్పారబెట్టే ప్రయత్నం

చేస్తారు కవి.
మూడుసార్లు తలాక్ పలికి
మగడు పొమ్మని చెబితే
మతమేదైనా, భారత
వనితల కెంతటి కష్టం అంటూ నిలదీసే ప్రయత్నం

కనబడుతుంది. ముచ్చటగా మూడుసార్లు తలాక్

ఉచ్ఛారణతో సుదీర్ఘ వైవాహిక వివాహబంధం

శాశ్వతంగా వీడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఒక

విషాద చేదు నిజంగా భావప్రకటన చేస్తారు. ఈ

అంతర్మథనంలో మతం పేరుతో భారతీయ ముస్లిం

వనితలకు పడుతున్న దుర్గతిని నిలదీసే కంఠంతో

ప్రశ్నిస్తూ వర్తమాన సమాజానికి సవాలు

విసురుతారు. ఈ రకమైన సామాజిక స్పృహ

భావితరాలకు ఆదర్శవంతమైన ఆలోచనా

మార్గానికి కొత్తబాట పరుస్తుంది.
అయ్యో! భారతదేశం శీర్షికలో నిర్భయ సంఘటనను

పోలిన అరాచక పోలికను కవితాత్మకంగా తేటతెల్లం

చేస్తారు కవి.
అర్ధరాత్రి కాదుగదా
అపరాహ్ణం లోనైనా
ఒంటిగ ఆడది వెళితే
తుంటరులకు చిక్కినట్టే అంటారు. అత్యాచారాలు,

మానభంగాలు, అఘాయిత్యాలతో అట్టుడికిపోతున్న

ప్రపంచం స్ర్తి మనుగడకు, స్వేచ్ఛకు, నిర్భయత్వానికి

భరోసా ఇవ్వలేని రోజులివి. లైంగిక పరమైన

దాడులతో వ్యవస్థ ఎలా మారిపోతుందో చెప్పడానికి

అద్దంపట్టే కవిత ఇది. స్ర్తిలపై సామూహికంగా

జరుగుతున్న తిరుగుబాట్లను ఎద్దేవా చేస్తూ వ్యంగ్య

స్పృహతో ధ్వనిప్రధానంగా చిత్రించిన రచన ఇది.

విషయంలో బిగువుకంటే వ్యక్తీకరణలో చిక్కదనమే

చక్కదనంగా మారింది. వచనశైలిలో

కవిత్వీకరించడం సామాన్య జనానికి

అందుబాటులోకి వచ్చింది.
ఇలా పాతకొత్తల మేలుకలయికతో రచనాభిరుచిని

కొనసాగించడంలో కవిది అందెవేసిన చెయ్యి. గ్రాంధిక

భాషా నడకతోపాటు గేయ సాంప్రదాన్ని పోలిన

సరళవచనానికి కూడా పెద్దపీట వేసినట్టయింది.
పలు రకాల వ్యక్తులపైనా, పుష్కర గోదావరిపైనా,

మాతృభాషపైనా, రక్తదానంపైనా, నీటిపైనా, పుష్కర

తుఫానుపైన రాసినా దేని ప్రత్యేకత దానిదే. వస్తు

వైవిధ్యం కనిపిస్తుంది. అభివ్యక్తిలో ఆధునిక

పోకడలను అందుకున్నట్లయితే ఈ సంపుటి

మరింత శక్తివంతంగా రూపుదిద్దుకుంటుంది.

భవిష్యత్తులో మరిన్ని మేలైన రచనలు వాసిలో

ఉన్నత ప్రమాణాలను అందుకోవాలని ఆశిస్తూ కవి

బుడితి రామినాయుడు గారి కృషిని మనస్ఫూర్తిగా

అభినందిస్తూ ఆస్వాదిద్దాం!

- మానాపురం రాజా చంద్రశేఖర్.
సెల్ : 9440593910.

మనోగీతికలు

కదన కుతూహలం
అవును నమ్మండి నమ్మకపోండి
చెప్పేవాడికి వినేవాడుంటే కదా కథ చెప్పేది
అది ఉత్కంఠభరితంగా భయం గొలిపేలా ఉంటేనే
రసవత్తరంగా సాగినట్లు లెక్క
ఒళ్లంతా గగుర్పొడిచి గుండె పట్టేస్తేనే కదా
కదన కుతూహలం
ఆకలి బాధతో అల్లల్లాడి
పెంటకుప్ప చివర్లోనో మురిక్కాలువ మొదట్లోనో
చెత్త ఏరుకు తింటున్నాడని
హృదయ విదారకంగా చెప్తేనే రాసిన వాడికి చప్పట్లు
ఒళ్లు కప్పుకోవడానికి గుడ్డ ముక్కే తప్ప
మార్చుకోవడానికి మరొకటి లేదని
కళ్ల నిండా అప్పటికప్పటి జాతిలో
వార్తాకథనం చదివితే
అదీ కథనం మధనం
కాల్చుకు తినే మొగుడు, మోసం చేసే ప్రియుడు
అవమానం చెందిన శరీరం
సహనం చచ్చిన కళేబరం ఆడదంటే
కడివెడు కన్నీరు కథాసాగరం
ఎల్‌కెజిలో థీసిస్ సిలబస్‌తో
చిట్టిపిల్లలు దిగాలు పడి ఏడుస్తుంటే
పువ్వూ సహజంగా వికసించే వరకు టైము లేదని
పట్టి లాగాల్సిందేనని కథ చెప్తే
అదో సెనే్సషనల్
తన నీడ తనని తరుముతోందని భయపడే మనిషికి
మాయేదో మర్మమేదో తెలియనంత పరుగు
ఒకటే పరుగు పరుగు పరుగు!

- బులుసు సరోజినీ దేవి,
విశాఖపట్నం. సెల్ : 9866190548.
ముడుపులు
ముడుపులు అందనిదే
మూలవిరాట్టైనా ముందుకు రాడు
మనిషి ఆశాజీవి
అందుకు తాను చేయని పనంటూ ఉండదు
ఎంతటి నైచ్యానికైనా దిగజారుతాడు
నేటి సమాజంలో
నైతిక విలువలకు తిలోదకాలు
అన్నింటా అవినీతి అందలమెక్కి కూర్చుంది
కార్యాలయాల్లోను, కార్ఖానాల్లోను
విద్యాలయాల్లోను, చివరకు దేవాలయాల్లోను
విలయతాండవం చేస్తోంది
పేరుకు మాత్రమే ధర్మోరక్షతి రక్షిత:
అనే నినాదం
బల్ల కింద చెయ్యి చాపాలని ఒకటే ఆత్రం
లంచం ఇచ్చేవాడు పుచ్చుకునే వాడు
ఇద్దరూ నేరస్థులే
ఇచ్చే వాడిని ఆపగలిగితే
పుచ్చుకునే వాడికి జంకు పుడుతుంది
స్థాయిని బట్టి స్థానం అన్నట్లుగా
ప్రతి దానికీ ఓ రేటు
కదిలే ఫైలుకి కాలున్నా
బరువు పెడితే కానీ కదల్లేని పరిస్థితి
కబ్జాల పేరిట
కనుమరుగవుతున్నాయి దేవుడి మాన్యాలు
ఆపన్నులకు సాయమందించాల్సిన
ప్రభుత్వ అధికారులు
అవినీతిలో నిండా మునిగిపోయారు
అవినీతి తిమింగాలను పట్టాలంటే
ఎర వేయక తప్పదు
సామాజికంగా సామూహికంగా
మార్పు రావాలంటే
లంచ నియంత్రణే కొసమెరుపు

- కడలి ప్రసాదరావు ఎం.ఎ., ఎం.ఇడి,
నెల్లిమర్ల, విజయనగరం జిల్లా - 535217.
సెల్ : 9492995570.

ఏమనుకోను?
ప్రియతమా
ప్రేమసాగరంలో నను ముంచెత్తి ఓలలాడించావు
నీలో సగభాగమని బాసలు చేసి
నను దోచుకుని ఆకాశపుటంచులను
చవిచూపావు
నువు లేక నేను లేనన్నావు
నీతోటిదే నా జీవితమన్నావు
మరి అంతలోనే...
నా ఆశల ఆశయాలను నేలరాసి
నా హృదయ కుసుమాన్ని కాలరాచి
నా మనసును ముక్కలు చేసి
నన్ను అధ:పాతాళానికి తొక్కేసి
నన్నొక ప్రేమ బికారిని చేసి
మరో నెరజాణకై పరుగులెత్తే
నిను ఏమనుకోను?
మనిషివనా?
మృగానివనా?

- రాయవరపు సరస్వతి,
చోడవరం పోస్టు,
విశాఖజిల్లా-531036.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక

పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను

(పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి

దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-

17. అనే చిరునామాకు పంపండి. ళ్ఘౄజ:

ౄళూఖఔఖ్పఒఔబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ

ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ