క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో మార్కెటింగ్ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాలపట్నం, ఏప్రిల్ 10: ఇక్కడి అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో మంగళవారం మార్కెటింగ్ శాఖ కమిటీ డీడీ కం సెక్రటరీ ఎస్‌టి నాయుడు ఒక వ్యాపారి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కంచరపాలెంలో జీడిపప్పు వ్యాపారి ఎస్‌ఎస్‌విఎస్ షాపు యజమాని జగన్నాథరావు పలాస నుంచి జీడిపప్పు తెచ్చుకుని విజయవాడ, గుంటూరు అలాగే రాష్ట్రంలోని పెద్ద పెద్ద దేవాలయాలకు సరఫరా చేస్తుంటాడు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అనుమతితో వ్యాపారం సాగిస్తుండడంతో పర్మిట్ బుక్ కోసం, ఈ ఏడాది అసెస్‌మెంట్ కోసం సెక్రటరీ నాయుడిని సంప్రదించగా, రూ.10 వేలు లంచం అడిగాడని తెలిపారు. మంగళవారం ఉదయం వ్యాపారి జగన్నాథరావు రూ.10వేలు తెచ్చానని చెప్పగా, సెక్రటరీ నాయుడు తన అసిస్టెంట్ బంగార్రాజును తీసుకోమని చెప్పాడని బంగార్రాజు రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కేవీఆర్‌కే ప్రసాద్, సిబ్బంది పట్టుకున్నారు. సెక్రటరీ నాయుడు వ్యాపారి జగన్నాథరావు నుంచి రూ.10 వేలు తీసుకోమన్నాడని బంగార్రాజు ఏసీబీ అధికారులకు తెలిపాడు. కాగా సెక్రటరీ నాయుడు, అసిస్టెంట్ బంగార్రాజులను అరెస్టు చేశారు. బుధవారం ఏసీబీ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు.