విశాఖపట్నం

మొక్కలు నాటితే సరిపోదు వాటిని సంరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 21: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటితే సరిపోదని, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీ నాగేశ్వర రావు అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏయూ జియో ఇంజనీరింగ్ విభాగంలో బుధవారం జరిగిన ‘జియో స్పేషియల్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫారస్ట్ అండ్ వాటర్ రిసోర్స్’ అంశంపై ఆయన మాట్లాడారు. వృక్షాలు లేని సమాజాన్ని ఊహించడమే సాధ్యం కాదన్నారు. వృక్షాలు, అడవుల ప్రాధాన్యతను గుర్తించడం ఎంతో అవసరమన్నారు. అడవులు, నీటి వనరుల సంరక్షణకు జీఐఎస్ సాంకేతికత ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు.పర్యావరణ పరిరక్షణలో విద్యావంతుల బాధ్యత ఎంతో ఉందన్నారు. వృక్షాలను సంరక్షిస్తామని విద్యార్థులచే ఆయన ప్రతిజ్ఞ చేయించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి భరత్ భూషణ్ మాట్లాడుతూ ఇంటిలో వినియోగించే నీటిని సమర్ధవంతంగా వినియోగిస్తూ వృధాను అరికట్టాలన్నారు. తద్వారా ఏడాదికి ప్రతి ఇంటికీ ఏడు గేలన్ల నీటిని సంరక్షించవచ్చన్నారు. గతంలో రైల్వే ట్రాక్‌ల నిర్మాణానికి కర్ర దుంగలను వినియోగించేవారని, ప్రస్తుతం వీటిస్థానంలో సిమెంట్ స్లీపర్లను వాడుతున్నారన్నారు. వియత్నాం, కోస్టారిక వంటి దేశాల్లో అడవుల విస్తీర్ణం అత్యధికంగా ఉందన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పీఎస్ అవధాని మాట్లాడుతూ సహజ వనరుల విలువను తెలుసుకోవడం ఎంతో అవరమన్నారు. కేప్‌టౌన్‌లో నీరు లేకపోవడం మనకు ముందస్తు హెచ్చరికగా గుర్తించాలన్నారు. జీఐఎస్ సాంకేతికత మెరుగైన అవకాశాలను అందిస్తుందన్నారు. ప్రకృతి వనరుల సంరక్షణ మన బాధ్యతగా స్వీకరించాలన్నారు. సబ్ డీఎఫ్‌ఓ డీ జానకీరావు మాట్లాడుతూ దేశంలో 21.54 శాతం అటవీ ప్రాంతం ఉందన్నారు. రాష్ట్రంలో గత కోనే్నళ్లుగా చేపట్టిన సంరక్షణ చర్యల ఫలితంగా 2 శాతం మేర అడవులు పెరిగాయన్నారు. ఓఎన్‌జీఎస్ కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ జీఐఎస్ ఒక ఉపకరణంగా నిలుస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మార్పులను గమనించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.సదస్సు సంచాలకులు ఆచార్య జగదీశ్వర రావు మాట్లాడుతూ సమాజాన్ని చైతన్య పరిచే దిశగా సదస్సుల నిర్వహణ మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. జీఐఎస్‌తో తక్కువ సమయంలోనే సమాచారం సేకరించి అందించేందుకు అవకాశం ఉందన్నారు. నీరు అత్యావశ్య సహజ వనరుగా గుర్తించాలని, దేశంలో మెరుగైన వర్షపాతాలకు హిమాలయాలే కారణమన్నారు.