విశాఖపట్నం

నగదు రహిత లావాదేవీలపై అగాహన సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావికమతం, మార్చి 22: నగదు రహిత లావాదేవీలు వలన పలు ప్రయోజనాలున్నాయని స్థానిక డీసీసీబీ మేనేజర్ ఎం.కిశోర్ తెలిపారు. మండలంలో మట్టవానిపాలెం గ్రామంలో నగదు రహిత లావాదేవీలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్దిపాటి అక్షర జ్ఞానం ఉన్న వారు కూడా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లును ప్రభుత్వం రూపొందించిందన్నారు. వీటిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనంతరం నగదు రహిత లావాదేవీలపై కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో సూపర్‌వైజర్ ఎ. అప్పారావు పాల్గొన్నారు.

తప్పుడు తూనికలు తూస్తే చర్యలు తప్పవు
గూడెంకొత్తవీధి, మార్చి 22: వారపు సంతల్లో దళారులు తప్పుడు తూనికలు కొలిస్తే చర్యలు తప్పవని గూడెంకొత్తవీధి సబ్ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా వారపు సంతలో సందర్శించారు . గిరిజనులు సేకరించి తీసుకువచ్చిన అటవీ ఉత్పత్తులను తప్పుడు తూనికలు వేసి మోసం చేస్తున్నారని, ఇటువంటి పరిస్థితి కొనసాగితే చట్టరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వారపు సంతలో ప్రతీ దుకాణానికి వెళ్ళి తూకాలను పరిశీలించారు. అలాగే పోలీస్ శాఖ వారపు సంతల్లో తూనికల యంత్రాలను పెడుతుందని, వీటిని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దళారుల మాయలో పడి కష్టపడిన సేకరించిన అటవీ ఉత్పత్తులను తక్కువ ధరలకు అమ్మి మోసపోవద్దని వారికి సూచించారు.

30 రోజుల పాటు డిపోలను తెరిచి ఉంచాలి
గూడెంకొత్తవీధి, మార్చి 22: గిరిజన సహకార సంస్థకు చెందిన డీ ఆర్ డిపోలు 30 రోజుల పాటు తెరిచి ఉంచాలని చింతపల్లి డీ ఎం పార్వతమ్మ తెలిపారు. గురువారం గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో ఉన్న కుంకుంపూడి, అగ్రహారం, కొత్తవీధి డిపోలతో పాటు ఎం. ఎల్. ఎస్. పాయింట్లును సందర్శించారు. ఆ ప్రాంతాల్లో ధరల పట్టికల్లో ధరలను సూచించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎం. ఎల్.సి. పాయింట్లులలో తూకాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతీ ఒక్క సేల్స్‌మెన్ విధిగా జీసీసీ మేనేజర్ సూచించిన పద్దతులు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చ

పరిశుభ్రతతోనే ప్రజల ఆరోగ్యం
గూడెంకొత్తవీధి, మార్చి 22: గ్రామాల్లో పరిశుభ్రత పాటిస్తూ తమ ఇళ్ళను కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కాఫీ బోర్డు సిబ్బంది తెలిపారు. గురువారం మండల కేంద్రంలో స్వచ్చ్భారత్ కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమానికి హాజరైన కాఫీ బోర్డు అధికారి జె. ఎల్. ఓ. శ్రీరామయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్చ్భారత్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, అందరూ దీనిలో భాగస్వాములై గ్రామాలు, ఇళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుని భావిభారతాన్ని చక్కదిద్దుకోవాలని ఆయన అన్నారు. పరిశుభ్రతపై గ్రామాల్లో అవగాహన పెంచడమే కాకుండా వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు కాఫీ బోర్డు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో సీ ఐ శ్రీనివాసరావు, పద్మభూషన్, ఎం. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.