విశాఖ

హోరెత్తిన హోదా పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సహా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు తదితర అంశాలతో అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాతీయ రహదార్ల దిగ్భంధం విజయవంతమైంది. నగర పరిధిలోని హనుమంతవాక, మద్దిలపాలెం, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు ప్రాంతాల్లో వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదార్లపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన విషయంలో టీడీపీ వైఖరిపై మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేసి, బీజేపీతో అంటకాగిన టీడీపీ హఠాత్తుగా కేంద్రపై గళమెత్తడం రాజకీయ లబ్ధికోసమేనంటూ మండిపడ్డారు. టీడీపీకి దమ్ముంటే అఖిలపక్షంతో కలిసి కేంద్రంపై పోరుకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల మనసుల్లో ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు తమ జెండాలు పక్కనపెట్టి, ప్రత్యేక హోదా సాధన ఒక్కటే అజెండాగా సమైక్య ఉద్యమానికి సిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. నాలుగేళ్లుగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో తెగతెంపులు చేసుకుని హోదా కోసం ఉద్యమిస్తున్న అధికార పక్షం, నిరసన గళం విన్పిస్తున్న విపక్షం పదవులకు రాజీనామా చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన పాపాన్ని కాంగ్రెస్‌కు అంటగట్టిన టీడీపీ, బీజేపీలు ఎన్నికల్లో లబ్దిపొందాయన్నారు. విభజన అనివార్యమైన తరుణంలో ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలను విభజన చట్టంలో కాంగ్రెస్ పొందుపరిచిందన్నారు. అయితే కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీలు విభజన చట్టం అమల్లో తీవ్ర అన్యాయానికి పాల్పడ్డాయన్నారు. ఇప్పటికైనా బీజేపీ, టీడీపీలు రాష్ట్రానికి న్యాయం చేసేందుకు సిద్ధం కానిపక్షంలో ప్రజలు క్షమించరన్నారు. వైసీపీ విశాఖ పార్లమెంట్ కన్వీనర్ తైనాల విజయ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు నాలుగేళ్లు పూర్తి చేసుకుందని, ఇప్పటికే ఐదు బడ్జెట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ రాష్ట్రానికి న్యాయం చేసిందేమీ లేదన్నారు. మొన్నటి వరకూ కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి సాధించిందేమిటని ప్రశ్నించారు. జనసేన ప్రతినిధి శివ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా విభజన హామీ లన్నింటినీ అమలు చేయాల్సిందేనన్నారు. దీనికోసం ఎవరు ఉద్యమించినా జనసేన మద్దతిస్తుందని, దీనిలో భాగంగానే అఖిలపక్షం పిలుపు మేరకు రహదార్ల దిగ్భంధంలో తమ ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం రాజకీయ పక్షాలతో పాటు ప్రజలు రోడ్డెక్కి ఉద్యమించేందుకు సిద్ధ పడుతున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో హోదా ఉద్యమం కొనసాగుతుందని, కేంద్ర మెడలు వంచైనా హోదా, విభజన హామీలు సహా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్, కొయ్యప్రసాద్‌రెడ్డి, రవిరెడ్డి, జాన్‌వెస్లీ, బీ సునీల్, గరికిన గౌరి, కాంగ్రెస్ ప్రతినిధులు సోడాదాసు సుధాకర్, హైదర్ ఆలీ షింకా, కందుల నాగరాజు, మాజీ కార్పొరేటర్ జగ్గుబిల్లి అప్పలరాజు, వామపక్ష ప్రతినిధులు గంగారావు, ఎం పైడిరాజు, జేడీ నాయుడు, ఐ విమల, మాధవి, తదితరులు పాల్గొన్నారు. జాతీర రహదారి దిగ్భంధంతో మద్దిలపాలెం నుంచి సత్యం జంక్షన్ వరకూ నిర్మానుష్యంగా మారిన రహదారిపై క్రికెట్, కబడ్డీ ఆటలతో కార్యకర్తలు ఆకట్టుకున్నారు.

హోదా ఇవ్వాలి, జోన్ ప్రకటించాలి
* టీడీపీ ధర్నా
ఆరిలోవ, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మభ్యపెడుతున్న బీజేపీ వైఖరిపై టీడీపీ మండిపడింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం జరిగిన ధర్నాలో పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొని కేంద్ర తీరుపై మండిపడ్డారు. విభజన హామీలను అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలి
కోటవుటర్ల, మార్చి 22: ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మండలంలో యండపల్లి వద్ద గురువారం మానవహారం నిర్వహించారు. మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో ముందుగా ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. ఈసందర్భంగా కాశీనాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెలుగుదేశం పార్టీ సాధించి తీరుతుందని స్పష్టం చేసారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కార్యకర్తలు నినాదాలు చేసారు. ఈకార్యక్రమంలో దేశం పార్టీ నాయకులు పినపాత్రుని బాబ్జి, పెట్ల పెదరాంబాబు, యండపల్లి సర్పంచ్ హైమావతి, దేశం పార్టీ నాయకులు వేచలపు భాస్కరరావు, సుకంర బాబ్జి, జీరెడ్డినానిబాబు తదితరులు పాల్గొన్నారు.

నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్‌కు విద్యార్థి ఎంపిక
మాకవరపాలెం, మార్చి 22: నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్‌కు మండలంలోని జి.వెంకటాపురం గ్రామానికి చెందిన పోలవరపు శ్రీను అనే విద్యార్థి ఎంపికయ్యాడు. ఈవిద్యార్థి కోడూరు హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ఎంపికైన విద్యార్థికి 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరువేల చొప్పున స్కాలర్ షిప్ అందిస్తుందని హెచ్. ఎం. రాధారాణి తెలిపారు. ఈసందర్భంగా హెచ్. ఎం.తో పాటు స్కూల్ కమిటీ చైర్మెన్ లాలం నాగమణి, ఉపాధ్యాయలు విద్యార్థిని అభినందించారు.

నీరు వృథా చేయవద్దు
రావికమతం, మార్చి 22: అనంత జీవకోటికి ప్రాణాధారమైన నీటిని వృధా చేయవద్దని సి. ఆర్.పి.జి.రామారావు హితవుపలికారు. ప్రపంచ జల సంరక్షణ దినోత్సవం పురష్కరించుకుని గురువారం టి. అర్జాపురం గ్రామంలో నీటి ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాధారమైన నీటిని వృధా చేయడం వలన భవిష్యత్ తరానికి కరవు కాటకాలు మిగిల్చేవారమవుతాయని ఆందోళన వ్యక్తం చేసారు. మానవజాతి నిరంతర మనుగడకు ప్రతీ నీటిబొట్టును నీటిలోకి ఇంకిప చేయాలని కోరారు. అలాగే వర్షపాతం పెంపునకు విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.