క్రైమ్/లీగల్

చిన్నారి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీది, అక్టోబర్ 6: గూడెంకొత్తవీధి మండల కేంద్రంలో రెండు రోజుల చిన్నారి మృతి చెందింది. గెమ్మిలి రాజు, ఆతని భార్యకు ఒక బాబు పుట్టాడు. ఇంట్లోనే ప్రసవించడంతో ఊపిరందక శనివారం ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది.

ఇద్దరికి డెంగ్యూ
సీలేరు, అక్టోబర్ 6 : స్థానిక శ్రీనివాస్ నగర్‌లో ఇద్దరికి డెంగ్యూ జ్వరం సోకింది. గత వారం రోజులుగా బిగ్‌బాస్, సుకుమార్ జ్వరంతో బాధపడుతున్నారు. స్థానిక ఆసుపత్రికి వైద్య పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ నిర్ధారణ కోసం చింతపల్లికి వెళ్ళాలని సూచించారు. చింతపల్లిలో వైద్య పరీక్షలు చేయించుకోగా డెంగ్యూ నిర్ధారణ కావడంతో మెరుగైన వైద్య సేవలకై మైదాన ప్రాంతానికి వెళ్ళాలని వైద్యులు సూచించారు. ఈమేరకు విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు.