క్రైమ్/లీగల్

చేప్రోలు రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాకవరపాలెం, నవంబర్ 8: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేప్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందింది. గత నెల 22వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలో జి.వెంకటాపురంకు చెందిన ఏడుగురు మహిళలతో పాటు జి.కోడూరుకు టాటా మ్యాజిక్ డ్రైవర్ మళ్ళ సంతోష్ తోపాటు కోటవురట్ల మండలం కె.వెంకటాపురంకు చెందిన నాగరాజులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన సబ్బవరపు పాప(38) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఈమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పటికే ఏడుగురు మహిళలు ఒకేసారి మరణించిన సంఘటన నుంచి తేరుకోకముందే మరొకరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

25 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
పాయకరావుపేట, నవంబర్ 8: మండలంలో పీ ఎల్ పురంలో లారీలో అక్రమంగా రైస్ మిల్లుకు తరలించిన రేషన్ బియ్యాన్ని అధికారులు గురువారం పట్టుకున్నారు. ఈ సందర్బంగా ఎ ఎస్ ఓ మధుసూధనరావు స్థానిక విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని కొంత మంది తనకు బియ్యం అక్రమ తరలింపుపై సమాచారం ఇచ్చారన్నారు. అక్రమంగా ఇసుకను పీ ఎల్‌పురంలో రైస్ మిల్లుకు తరలించి వాటిని సన్నబియ్యంగా మార్చి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారన్నారు. వేరే ప్రాంతం నుంచి లారీలో వచ్చిన 509 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నామని, ఇది సుమారు 25 టన్నుల బియ్యం ఉంటుందని తెలిపారు. ఇవి పూర్తిగా రేషన్ బియ్యం అని తెలిపారు. బియ్యానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. రైస్‌మిల్లును లారీని సీజ్ చేసి 6 ఎ , 7 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయనతో పాటు నక్కపల్లి సీ ఎస్‌డీటీ జి.శ్రీనివాసరావు , డీ ఇ మురళీకృష్ణ, వీ ఆర్ ఓ జి.వరలక్ష్మి, స్థానికులు సూరిబాబు, ఐ ఎన్.మూర్తి ఆయనతో పాటు ఉన్నారు.

బస్సు కింద పడి వ్యక్తి మృతి
కృష్ణాదేవిపేట, నవంబర్ 8: ప్రమాదవశాత్తు ఆర్టీసి బస్సు కిందపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈమేరకు స్థానిక ఎస్సై రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గొలుగొండ మండలం గుండుపాల గ్రామానికి చెందిన గుమ్మిడి నూకరాజు(30) బుధవారం మధ్యాహ్నాం పాడేరు వెళ్ళే బస్సు ఎక్కే ప్రయత్నంలో జారి పడి బస్సు చక్రాల కిందపడడంతో మృతి చెందాడు. నూకరాజుకు గత కొంత కాలంగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు. బుధవారం మధ్యాహ్నాం నూకరాజు తన అత్తవారి ఇల్లు పాతూరు వెళ్ళే ప్రయత్నం చేసి బస్సు వెనుక చక్రం కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. నూకరాజుకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకైన నర్సీపట్నం తరలించినట్లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ తెలిపారు.