విశాఖ

డెయిరీ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, జూలై 12: విశాఖ డెయిరీ పాడి రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ డీవీ ఎస్ రాజు సూచించారు. గురువారం ఏరువాక పథకం కింద మండలంలో కైలాసపట్నం , జల్లూరులో పాడి రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం నగదు పంపిణీ చేసారు. కైలాసపట్నంలో 205 మంది రైతులకు 3.38 లక్షల రూపాయల నగదును ఎమ్మెల్సీ డీవీ ఎస్ రాజు, జల్లూరులో రెండు లక్షల రూపాయల నగదును మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు పాడి రైతులకు అందజేసారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విశాఖ డెయిరీ అభివృద్దికి పాడి రైతులు సహకరించాలన్నారు. జల్లూరులో జరిగిన ఈకార్యక్రమంలో కాశీనాయుడు మాట్లాడుతూ ఏరువాక నగదును రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం వినియోగించాలన్నారు. ఈకార్యక్రమంలో కైలాసపట్నం సొసైటీ అధ్యక్షుడు వెంకట్రావు, డెయిరీ సూపర్‌వైజర్ మూర్తి పాల్గొన్నారు.

14 మంది వి.ఆర్.ఒ.ల బదిలీ
మాడుగుల, జూలై 12: మండలంలోని పద్నాలుగు మంది గ్రామ రెవిన్యూ అధికారులను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తాహశీల్ధార్ ఎల్.రామారావు గురువారం తెలిపారు. మండలంలోని 28 పంచాయతీలకు గాను 18 మంది వి.ఆర్.ఒ.లు పనిచేస్తుండగా వీరిలో 14 మందిని బదిలీ చేస్తూ మరో పది మందిని ఇతర ప్రాంతాల నుంచి నియమించారని ఆయన చెప్పారు. బదిలీ జరిగిన వి.ఆర్.ఒ.లను విధుల నుంచి రిలీవ్ చేస్తూ నూతనంగా బదిలీపై వచ్చిన వారిని విధుల్లో చేర్చుకుంటున్నామని ఆయన అన్నారు.

కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలి
గొలుగొండ, జూలై 12: ఖరీప్‌లో కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని ఎపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మేకా సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రమైన గొలుగొండలో కౌలు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యనారాయణ మాట్లాడుతూ కౌలు రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేసి, బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలన్నారు. ఖరీప్‌లో రైతులతో పాటు కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తే , కౌలు రైతులకు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు,ప్రజాప్రతినిధులు సత్వర చర్యలు చేపట్టి మండలంలోని కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కశిమి, వడపర్తి, సుద్దలపాలెం, అడ్డల్లోవ గ్రామాలతో పాటు మరికొన్ని గిరిజన గ్రామాల్లో అటవీ , బంజరు భూములను సాగు చేసుకుంటున్న వారికి కూడా రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇటువంటి రైతులకు పట్టాలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో సీపీ ఐ జిల్లా కార్యవర్గ సభ్యలు మాకిరెడ్డి రామునాయుడు, సీపీఐ కార్యదర్శి నల్లబిల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు.