విశాఖ

అజ్ఞానంతో మారిన పేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, జూలై 12: గిరిజనులలో దాగి ఉన్న అజ్ఞానం, అంధ విశ్వాసాలు ఏకంగా వారి పేర్ల మార్పుకు దారితీసింది. ప్రస్తుతం తమకున్న పేర్ల వలన అదృష్టం కలిసి రావడం లేదని భావించిన ఒకే కుటుంభానికి చెందిన వీరు వింత వింత పేర్లను పెట్టుకుని అందరినీ ఆశ్యర్యానికి గురిచేసారు. డుంబ్రిగుడ మండలం మారుమూల ప్రాంతమైన సొవ్వ గ్రామంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సోవ్వ గ్రామానికి చెందిన బాకా గణేశ్వరరావు, మాణిక్యమ్మ, ఆజాద్ సింహ, విక్రమ్ సింహ, రాణప్రతాప్ సింగ్ అనే గిరిజనులు తమకు అదృష్టం వరించడం లేదని, దీంతో ఏ పని తలపెట్టినా కలిసిరావడం లేదని భావిస్తూ గత కొంతకాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ గిరిజనుల బాధను విన్న ఒక ప్రబుద్ధుడు ప్రస్తుతం ఉన్న పేర్లతో కొనసాగితే ఏదీ కలిసిరాదని, అందుకే పేర్లు మార్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందని సలహా ఇచ్చాడు. ఈ ప్రబుద్ధుని సలహాతో ఒకే కుటుంభానికి చెందిన ఐదుగురు గిరిజనులు తమ పేర్లను వారంతట వారే మార్పు చేసుకున్నారు. ఈ మేరకు గణేశ్వరరావు యూనివర్స్‌గానూ, మాణిక్యమ్మ కాస్మిక్ రేస్, ఆజాద్ సింహ ఆక్సిజన్, విక్రమ్ సింహ నైట్రోజన్, రాణ ప్రతాప్ సింహ హైడ్రోజన్ హీరియంగా తమ పేర్లను మార్చుకుని అందరినీ ఆశ్యర్యానికి గురిచేసారు. తమ పేర్లను మార్పు చేసుకున్న ఈ గిరిజనులు అధికారులకు ఒక వినతిపత్రం సమర్పిస్తూ ఇకపై తమ రికార్డులలో మార్పు చేసిన పేర్లను నమోదు చేయాలని కోరారు. ఈ గిరిజనులందరికీ ఆధార్, రేషన్, ఓటరు గుర్తింపు కార్డులతో పాటు భూమి పట్టాలు తదితర వాటిలో పాత పేర్లు ఉండడంతో మార్పు చేసుకున్న కొత్త పేర్లను చేర్చాలని కోరుతున్నారు. పేర్ల మార్పుతో గిరిజనులు చేసిన నిర్వాకం ప్రస్తుతం అధికారులకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది.

గ్రామాలలో పారిశుధ్యంపై దృష్టి సారించాలి
మాడుగుల, జూలై 12: ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుధ్య సమస్యపై పంచాయతీ కార్యదర్శులంతా ప్రత్యేక దృష్టి కనబరచాలని నర్సీపట్నం డివిజనల్ పంచాయతీ అధికారి ఆర్.శిరీషరాణి కోరారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో గురువారం నిర్వహించిన సమావేశంలో గ్రామాలలో పారిశుధ్యంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యాధులను దృష్టిలో పెట్టుకుని గ్రామాలలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 30వ తేది వరకు గ్రామాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ఆమె చెప్పారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ఆమె అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా చూడాలని, కాలువల్లో పిచికారి పనులు చేపట్టాలని ఆమె చెప్పారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించే కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అనంతరం మండలంలో ముకుంధపురం, ఎం.కోటపాడు పంచాయతీలలో ఆమె పర్యటించి గత రెండు రోజులుగా జరుగుతున్న కాలువల పూడికతీత పనులను ఆమె పరిశీలించారు. కాగా మండలంలో ఎం.కోడూరు పంచాయతీలో పారిశుధ్య సమస్య అధికంగా ఉన్నా పట్టించుకోవడం లేదని పంచాయతీ వార్డు సభ్యుడు పడాల అప్పలనాయుడు ఆమెకు పిర్యాదు చేసారు. పంచాయతీ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించకపోవడంతో సమస్యలు దృష్టికి తీసుకురాలేకపోతున్నామని ఆమె చెప్పారు. ఈ విషయమై శిరీషరాణి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

పోరాటంతోనే వేతనాలు పెంపు
మాడుగుల, జూలై 12: దశబ్ధాల కాలంగా రాజీలేని పోరాటం చేయడం వలనే తమ సమస్యను పరిష్కరించుకున్నట్టు ఆశ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు బి.రామలక్ష్మి అన్నారు. ప్రభుత్వం తమ వేతనాన్ని పెంచి రాయితీలు ప్రకటించడంతో స్థానిక పంచాయతీ సామాజిక భవనం వద్ద గురువారం ఆశ కార్యకర్తలతో అభినందన సభ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా గ్రామాలలో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు ఎన్నో సేవలు అందిస్తున్నా చాలీ చాలని వేతనాన్ని చెల్లించేవారని అన్నారు. తమకు వేతనాలు పెంచాలని చేసిన అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం వేతనాలు పెంచిందని ఆమె చెప్పారు. తమకు వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.