విశాఖ

గిరిజనులకు ఆధునిక వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 24: గిరిజనులకు ఆధునిక వైద్యం అందించమే ప్రభుత్వ లక్ష్యమని పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి అన్నారు. స్థానిక కాఫీ హౌస్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి బాల సురక్ష పథకాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో సతమతవౌతున్నా గిరిజనుల ఆరోగ్యం పట్ల తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి బాల సురక్ష పథక బాలల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుందని ఆమె పేర్కొన్నారు. బాల సురక్ష కార్యక్రమంలో 18 సంవత్సరాల లోపు బాలలకు ఆరోగ్య సమస్యలుంటే గుర్తించి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా అవసరమైతే శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారని ఆమె అన్నారు. గిరిజన ప్రాంతంలోని బాలలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. నిరుపేద గిరిజనులకు వైద్య సేవలు అందించడం అదృష్టంగా భావించాలని ఆమె అన్నారు. విశాఖ మన్యంలో ప్రస్తుతం డెంగ్యూ, ఆంత్రాక్స్ వంటి వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని ఆమె చెప్పారు. ఏజెన్సీలోని భౌగోళిక పరిస్థితులను గుర్తించిన ప్రభుత్వం మారుమూల గ్రామాల గిరిజనులకు కూడా వైద్య సేవలను సునాయసంగా అందించేందుకు ఫీడర్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టనట్టు ఆమె పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో వైద్య శిబిరాలను నిర్వహించేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని ఆమె సూచించారు. అనంతరం బాల సురక్ష వాహనాలను ఈశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఆర్.గణపతిరావు, పాడేరు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లీలాప్రసాద్, పలువురు అధికారులు, దేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లి జలపాతం వద్ద వెదురు ఉద్యానవనం
పాడేరు, జూలై 24: ప్రముఖ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద ఏర్పాటు చేస్తున్న వెదురు ఉద్యానవనం ఏర్పాట్ల పనులను పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజి సోసమవారం పరిశీలించారు. కొత్తపల్లి జలపాతాన్ని తిలకించే పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించే విధంగా వెదురు ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి జలపాతం వద్ద ఏర్పాటు చేస్తున్న ఉద్యానవనంలో 16 రకాల వెదురు మొక్కలను నాటుతున్నామని, మహారాష్టల్రోని అమరావతి అటవీ ప్రాంత వెదురు ఉద్యానవనం నుంచి ఈ మొక్కలను తీసుకువస్తున్నట్టు చెప్పారు. వెదురు ఉద్యానవనం వలన స్థానికులకు ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నట్టు ఆయన తెలిపారు. కొత్తపల్లి జలపాతం వద్ద వెదురు ఉద్యానవనం పనులను వచ్చే నెల మొదటి వారానికి పూర్తి చేయాలని బాలాజి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ కో-ఆర్డినేటర్ గణపతి, జి.మాడుగుల తాహశీల్ధార్ కుమారస్వామి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

శ్రమదానంతో రోడ్లు మరమ్మతులు
కొయ్యూరు,జూలై 23: కించవానిపాలెం నుండి బాలరేవుల వెళ్ళే రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోతుల మయంగా మారి మరమ్మతులకు గురైంది. రహదారి సౌకర్య లేని పరిస్థితుల్లో గత ఏడాది గ్రామస్తులు చొరవ తీసుకుని శ్రమదానంతో కొంత మేర రహదారిని నిర్మించుకున్నారు. దీంతో మరికొంత రహదారిని పంచాయతీ నిధులతో సర్పంచ్ ఆధ్వర్యంలో చేయించారు. ఈరహదారి వర్షాలకు కొట్టుకుపోయి గుంతలు పడడంతో రాకపోకలకు తిరిగి ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ పెద్దలు లక్ష్మణరావు, సన్యాసిరావు, విజయలక్ష్మి, లోవరాజు, శివరాజు తదితరుల చొరవతో గ్రామస్తులంతా కలిసి రహదారి మరమ్మతులకు పూనుకున్నారు. ఎవరో వచ్చి ఏదో చస్తారని ఎదురుచూడకుండా గ్రామస్తులంతా ఏకమై రహదారి మరమ్మతులకు పూనుకుని రోడ్డును బాగు చేసుకుంటున్నారు. మరో నాలుగు రోజులు పాటు ఈపనులు చేయాల్సి ఉంటుందని దీనిపై అధికారులు దృష్టి సారించి ఉపాధి పథకంలో అయినా గ్రామస్తులకు కూలీ డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.