విశాఖ

చంద్రబాబుతో జగన్‌కు పోటీ ఎక్కడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడుగుల, సెప్టెంబర్ 18: అవినీతి రహిత పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో అవినీతి పరుడైన జగన్ పోటీ పడుతుండడం హాస్యాస్పదమని మాజీ శాసనసభ్యుడు, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడు అన్నారు. మండలంలోని కస్పాజగన్నాధపురం, వంటర్లపాలెం, ముకుందపురం, వీరవెల్లి అగ్రహారం, పోతనపూడి గ్రామాలలో మంగళవారం సైకిల్ యాత్ర నిర్వహించి ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఇంతవరకు చేసిన అభివృద్ధిని వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి యజమాని సరైన వాడు కాకపోతే ఆ ఇళ్లు చిందరవందర అవుతుందని, దీనినిబట్టి ఈ రాష్ట్రాన్ని పాలించేవారు క్రమశిక్షణ, బాధ్యత, అనుభవం ఉన్నవారు అవసరమని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని వారి బాగోగులను తన నెత్తిన వేసుకుని సమర్థంగా పాలిస్తున్న చంద్రబాబును కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్న జగన్ వంటి వారు విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు. తన అవినీతి కేసులను మాఫీ చేసుకునేందుకు జగన్ కేంద్ర ప్రభుత్వంతో కుమ్మకై ప్రజలకు అన్యాయం చేసేందుకు పూనుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం తమ ప్రభుత్వం పోరాటం చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వౌనం పాటించడంలో గల ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. జగన్ వంటి అవినీతిపరుడను అందలం ఎక్కిస్తే ప్రజలు మరింత దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. రానున్న రోజుల్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్‌లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రామానాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు నందారపు సన్యాసిరావు, కర్రి నాగమణి, పెంటకోట అప్పారావు, పోతల రమణమ్మ, ఆళ్ల శివ, ఆడారి శ్రీను, మజ్జి తాతబాబు, కర్రి సాయిక్రిష్ణ, కుమారరాజా, వి.బాలు, శ్రీనాధు మధు తదితరులు పాల్గొన్నారు.

తెరపడిన ఎం.పి.పి. పదవి వివాదం
అరకులోయ, సెప్టెంబర్ 18: అరకులోయ ఎం.పి.పి. పదవి వివాదానికి తెర పడింది. రెండు నెలలుగా చర్చానీయాంశంగా మారిన ఎం.పి.పి. వివాదం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హామీతో సుఖాంతమయ్యింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎం.పి.పి. పదవిని పెదలబుడు ఎం.పి.టి.సి. కిల్లో గంగమ్మకు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తూ దేశం పార్టీకి చెందిన ఒక వర్గం నాయకులు గత పద్నాలుగు రోజులుగా చేపడుతున్న రిలే దీక్షలను మంగళవారం విరమించారు. ఈ నెల 5వ తేది నుంచి చేపడుతున్న రిలే దీక్షలపై మాజీ ఎమ్మెల్యే సోమ, ఎం.పి.డి.ఒ. విజయకుమార్, స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకునాయుడు ఆందోళనకారులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇవ్వడంతో రిలే దీక్షలను విరమించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సోమ, దేశం నాయకురాలు భూర్జ లక్ష్మి ఆందోళనకారులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేయడంతో ఈ ఆందోళనకు తెరపడింది. తమ సమస్యను పరిష్కరించకపోతే వచ్చే నెల 2వ తేది గాంధీ జయంతి రోజు నుంచి ఆమరణ నిరాహర దీక్ష చేపడతామని ఈ సందర్భంగా ఎం.పి.టి.సి. కిల్లో గంగమ్మతో పాటు ఆందోళనకు మద్దతునిచ్చిన దేశం నాయకులు సమర్డి రఘునాధ్, గులాబి, ఎల్.మహాదేవ్, తదితరులు చెప్పారు.

డ్రైవింగ్ లైసెన్స్‌లు పంపిణీ
అరకులోయ, సెప్టెంబర్ 18: అరకులోయలో ఇటీవల నిర్వహించిన డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో అర్హత సాధించిన వారికి మంగళవారం శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌లను స్థానిక సి.ఐ. వెంకునాయుడు అందచేసారు. స్థానిక యువజన శిక్షణ కేంద్రంలో గత నెల 13 నుంచి 18వ తేది వరకు అనకాపల్లి రవాణా శాఖ అధికారులు లైసెన్స్ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్‌లు మంజూరు చేసారు. లైసెన్స్ మేళాలో 3 వేల 800 మంది అభ్యర్థులకు లైసెన్స్‌లు మంజూరు చేసి గతంలో 2 వేల 600 మందికి లైసెన్స్‌లు అందచేయగా, మిగిలిన వారికి సి.ఐ. పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అనకాపల్లి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

దర్నాను విజయవంతం చేయండి
అరకులోయ, సెప్టెంబర్ 18: ప్రభుత్వం విడుదల చేసిన జి.ఒ.నెంబరు 132ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదిన పాడేరు ఐ.టి.డి.ఎ. ఎదుట చేపట్టనున్న మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ర రేగం మత్స్యలింగం కోరారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఐ.టి.డి.ఎ.ల ఎదుట చేపడుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పెట్టి హాజరు కావాలని అన్నారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులపై జరుగుతున్న ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని ఆయన కోరారు.