విశాఖ

అయ్యోపాపం బాబూరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, సెప్టెంబర్ 19: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి వైసీపీ తరుపున పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం సమన్వయకర్త గొల్లబాబూరావుకు పార్టీ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. తగినంత ఆర్ధిక స్థోమత లేని కారణంగా పోటీ నుంచి పక్కకు తప్పుకోవాల్సిందిగా అధిష్టానవర్గం బాబూరావుకు సూచించినట్లు పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది. ఈనెల 17న ఆనందపురం వద్ద బాబూరావుతో పాయకరావుపేట అసెంబ్లీ టిక్కెట్ వషయమై చర్చకు వచ్చింది. ఈసారి జరిగే ఎన్నికల్లో అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని బాబూరావుకు జగన్ చెప్పినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు నీవు సిద్ధమేనా అని బాబూరావును జగన్ సమక్షంలో కొందరు కీలక నేతలు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో విస్మయానికి గురైన బాబూరావు తన వద్ద అంత సొమ్ము లేదని ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయగలనని అధిష్టానానికి చెప్పినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. పోటీ నుంచి పక్కకు తప్పుకుని మరొకరికి అవకాశం ఇస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ లేదా ఎమ్మెల్సీగా నియమిస్తామని అధిష్టానవర్గం బాబూరావుకు స్పష్టం చేయగా తనకు ఎమ్మెల్యే పోటీ చేయడానికి అవకాశం కల్పించాల్సిందిగా బాబూరావు అధిష్టానాన్ని కోరినట్లు ప్రచారం సాగుతుంది. పంచాయతీరాజ్ శాఖలో పీ ఓగా పని చేస్తూ పదవికి రాజీనామా చేసి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి వై ఎస్సార్ పార్టీలో చేరి 2012లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్న తనకు పార్టీ మంచి గుణపాఠం చెప్పిందని బాబూరావు సన్నిహితుల వద్ద వాపోయాడు. ఈనేపధ్యంలో బాబూరావు అదేపార్టీలో కొనసాగుతారా లేదా అనేది త్వరలో వెల్లడవుతుంది.

నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి
కోటవురట్ల, సెప్టెంబర్ 19: నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని మాజీ ఎమ్మెల్సీ , వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కన్వీనర్ డీవీ ఎస్ రాజు పిలుపునిచ్చారు. స్థానిక మాజీ ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో కావాలి జగన్, రావాలి జగన్ కార్యక్రమంపై చర్చించారు. ఈసందర్భంగా సూర్యనారాయణరాజు మాట్లాడుతూ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి నవరత్నాలపై విస్తృతమైన ప్రచారం నిర్వహించాలని సూచించారు. వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టాల్సిన కార్యక్రమాలను ఫ్రజలకు వివరించాలన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి డి.సీతబాబు, నాయకులు రాజులనాయుడు, సత్యనారాయణరాజు, సత్తిబాబురాజు, కిల్లాడ శ్రీనివాస్, నాగేశ్వరరావు, చామంతుల శ్రీను, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కొయ్యూరులో భారీ వర్షం
* పొంగి ప్రవహించిన కొండవాగులు
కొయ్యూరు, సెప్టెంబర్ 19: మండలంలో బుధవారం మధ్యాహ్నాం కురిసిన భారీ వర్షానికి కొండవాగులు పొంగి ప్రవహించాయి. కొయ్యూరు పరిసర గ్రామాలతో పాటు మారుమూల కొండ ప్రాంతాల్లో బుధవారం మద్యాహ్నాం సుమారు గంటన్నర పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో కొండవాగులు ఉదృతంగా ప్రవహించాయి. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొయ్యూరు- నర్సీపట్నం ప్రధాన రహదారి మధ్య శింగవరం సమీప శీలగెడ్డ పొంగి రహదారి పై నుండి ప్రవహించడంతో సుమారు గంటకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం మండుటెండ , మధ్యాహ్నాం భారీ వర్షం కురుస్తూ భిన్న వాతావరణం నెలకొంటోంది. కాగా వర్షం ఒక ప్రాంతంలో ఉండి పక్కనే ఉన్న గ్రామాల్లో మండుటెండులు కాస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉచిత వైద్య శిబిరం
మాడుగుల, సెప్టెంబర్ 19: స్థానిక దేవి ఆడిటోరియంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విశాఖపట్నం ఎస్.ఆర్. ఆసుపత్రి, మాడుగుల భారత నిర్మాణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి హాజరైన రోగులకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో భారత నిర్మాణ సేన నిర్వాహకులు మహేష్, శ్రీనాధు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.