విశాఖ

పాఠశాల భవనాన్ని పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, సెప్టెంబర్ 19: మండలంలోని సిరిగాం పంచాయతీ లంప్తపాడు గ్రామంలో అర్థాంతరంగా నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సి.పి.ఎం. నాయకుడు కిల్లో సురేంద్ర కోరారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2011-12వ సంవత్సరంలో పాఠశాల భవన నిర్మాణం ప్రారంభించినప్పటికీ ఇంతవరకు దీనిని పూర్తి చేయలేదని చెప్పారు. దీంతో గిరిజన బాలలు చదువుకునేందుకు వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు మంజూరు చేసిందని, దీని నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కంట్రాక్టర్ మధ్యలోనే నిర్మాణాన్ని నిలిపివేసారని ఆయన పేర్కొన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసేలా చూడాలని ఆయన కోరారు.
సమసిన ఫర్చిచర్ సమస్య
అరకులోయ, సెప్టెంబర్ 19: స్థానిక వైద్య విధాన పరిషత్ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న ఫర్నిచర్ సమస్య సమసిపోయింది. ఇంతవరకు రోగులకు, సిబ్బందిని పట్టిపీడిస్తున్న ఈ సమస్యను నివారించేందుకు లక్ష రూపాయల వ్యయంతో ఫర్నిచర్ కొనుగోలు చేసారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటి సూచనల మేరకు బీరువాలు, రోగులకు, ఇతరులకు కుర్చీలు వంటి వాటిని సమకూర్చారు.

ఇంటింటికి కుళాయిలు
మాడుగుల, సెప్టెంబర్ 19: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయిలను ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు చెప్పారు. మండలంలోని గొటివాడ అగ్రహారం, వీరనారాయణం, చింతలూరు, గాదిరాయి, గదబూరు గ్రామాలలో బుధవారం ఆయన సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి సమానంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడిన వారికి ప్రజలు మద్దతుగా ఉండాలని ఆయన సూచించారు. గ్రామాలలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు ఆయన చెప్పారు. అనంతరం ఇటీవల ప్రమాదాలలో గాయపడి చికిత్సలు పొందిన పలువురికి సి.ఎం. సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను రామానాయుడు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు నందారపు సన్యాసిరావు, కర్రి నాగమణి, పానాపతి, ఎ.గంగరాజు, అద్దెపల్లి జగ్గారావు, వేచలపు శ్రీను, దాడి గణేష్, శనివాడ ఈశ్వరరావు, కర్రి సాయిక్రిష్ణ, కాళ్ల బాలక్రిష్ణ, శ్రీనాధ మధు, పెరుమాళ్ల వెంకటరావు, నేమాల రామారావు తదితరులు పాల్గొన్నారు.

12 అడుగుల కొండచిలువ హతం
మాడుగుల, సెప్టెంబర్ 19: మండలంలోని కస్పాజగన్నాధపురం గ్రామంలో 12 అడుగుల కొండచిలువను బుధవారం హతం చేసారు. గ్రామ సమీపాన ఉన్న తెలకల దీపం వద్ద తాచేరుగెడ్డలో చేపలు పట్టేందుకు కొందరు వల వేయగా కొండచిలువ చిక్కుకుంది. దీనిని గ్రామస్తులు హతం చేసారు.