విశాఖ

ఖరీఫ్ సీజన్‌కు ఎకరాకు 30వేలు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి రైతు సంఘం డిమాండ్
అనకాపల్లి టౌన్, సెప్టెంబర్ 22: ఖరీఫ్ సీజన్‌లో ఎకరాకు 30వేలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సహకార రైతువేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక గోవిందరావు భవనంలో శనివారం ఆరు మండలాలకు చెందిన రైతుల సమస్యలుపై రైతు సంఘం నాయుకులు సమావేశం నిర్వాహించారు. ఈ సందర్బంగా సహకార రైతు వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్‌బాబు మాట్లాడుతూ శారదానది బేసిన్లో గ్రామిటీతో నీరు అందే విధంగా ఆనాటి బ్రిటిషర్లుగ్రోయిన్లు నిర్మించి రైతాంగానికి నీరు అందే విధంగా ఏర్పాట్లు చేసారన్నారు.కానీ నేడు ఒక పెద్దేరు నుండి క్రిందకి ఆరకోరగా వస్తున్న నీరు రైతాంగానికి ఏ మూలకు సరిపోవడం లేదన్నారు. ఫలితంగా రైతాంగం వ్యవసాయం సాగుచేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మరికొన్ని ప్రాంతాల్లో సాగుభూములు నీరు లేక బీడు భూములుగా మారాయన్నారు. మరో రైతు సంఘం నాయకులు రంగారావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కొండకర్ల ఆవచుట్టూ 200 ఎకరాల భూమి నీరు లేక పంటలు పండించకుండా వృథాగా విడిచిపెట్టారని తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో వర్షాలు సరిగా లేక శారదానదిలో నీరు రాక అదేవిధంగా ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్యుత్ పూర్తిస్థాయిలో అందకపోవడంతో చాలామంది రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. పూర్తిస్థాయిలో నాణ్యతతో కూడిన ఉచిత విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేసారు. మునగపాక రైతుసంఘం మండల నాయకులు మళ్ల మాదవరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ సగం గడిచిపోయిందని ఇకమీదట అధికారులు స్పందించి నీరు విడుదల చేసినా ఫలితం పెద్దగా ఉండదని ఫలితంగా ఈ ఖరీప్ సీజన్‌లో రైతులు నష్టాలు చవిచూసే ప్రమాదముందన్నారు. తక్షణం ప్రభుత్వం ఎకరాకు 30వేల రూపాయలు చెల్లించి ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేసారు. శారదా పరివాహక ప్రాంతం దిగువ మండలాల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితులు వస్తాయని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆరు మండలాల రైతాంగానికి రెండు టిఎంసిల నీటిని విడుదల చేయాలని, నాణ్యతతో కూడిన ఉచిత విద్యుత్‌ను పూర్తిస్థాయిలో అందించాలని, శారదానదిపై ఉన్న గ్రోయిన్లను పటిష్ట పరిచి వాటి కాలువల ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని జిల్లా నీటిపారుదల శాఖ వారు పూర్తిగా ఈ ఆరు మండలాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇది తగదని ఎట్టి పరిస్థితుల్లోను ఆరు మండలాల రైతాంగానికి నీరు అందించాలని వారు ఈ సమావేశంలో తీర్మానం చేసారు. ఈ కార్యక్రమంలో సహకార రైతు వేదిక సభ్యులు మళ్ల చక్రవర్తి, కొవ్వాడ వాసు, శేఖరమంత్రి సాయి, రాజాన దొరబాబు, దాడి శివరామ్, విత్తనాల పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

వినాయకుని విగ్రహాల వద్ద భారీ అన్న సంతర్పణ
కొయ్యూరు, సెప్టెంబర్ 22: మండలంలో వినాయక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా వినాయకుని నిమజ్జన కార్యక్రమాలను శనివారం భక్తులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం రాజేంద్రపాలెంలో సిద్ధి వినాయకుని ఆలయంలో లడ్డూ ప్రమాదం వేలం పాట ఆసక్తిగా సాగింది. 11 కిలోల లడ్డూ ప్రసాదాన్ని శింగవరం గ్రామానికి చెందిన మువ్వలరాజు 2,621 రూపాయలకు దక్కించుకున్నారు. ఆలయం వద్ద భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కాకరపాడులో వినాయకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.