విశాఖ

అధికార , ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయమే కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, లోక్‌సత్తా పార్టీలతో కలిసి వామపక్షాలు ప్రత్యేక కూటమి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ ఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ పేర్కొన్నారు. గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పి.సత్యనారాయణ, సీపీ ఐ మండల కార్యదర్శి ఇరువాడ దేముడులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో కోట్లు అవినీతి జరిగినా దీనిపై చర్యలు లేకపోగా అవినీతి పరులకే ఉన్నత పదవులు కట్టబెట్టి ప్రభుత్వం అందలం ఎక్కిస్తుందని ధ్వజమెత్తారు . ఎన్టీ ఆర్ సుజల స్రవంతి పథకంలో ఇంటింటికి రెండు రూపాయలకే మినరల్ వాటర్ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఏజన్సీ వ్యాప్తంగా వివిధ రోగాలు ప్రబలుతున్నా పీహెచ్‌సీల్లో సరైన మందులు పూర్తి స్థాయి వైద్యులు లేరన్నారు. సురక్షితమైన తాగునీరు లేకనే మన్యంలో వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. ఏజన్సీలో ప్రబలుతున్న వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న వైద్య నిపుణులను మన్యానికి పంపి వ్యాధులను అరికట్టడంతో పాటు వాటి కారణాలపై పరిశీలన జరిపి దృష్టి సారించాలన్నారు. సీపీ ఐ పుట్టిన నాటి నుండి పోరాటాలే తప్పా పదవులు ముఖ్యం కాదని సిద్ధాంతంతో ముందుకు సాగుతుందన్నారు. పదవులను అనుభవించిన నేతలు, వారి వారసులు పార్టీని వీడినా అభ్యంతరం లేదని కాని రాజకీయ ఓనామాలు నేర్పిన పార్టీనే కించపరుస్తూ విమర్శిస్తూ మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు, పి.కృష్ణ, డి.కనకరాజు, ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు
గొలుగొండ, సెప్టెంబర్ 22: మండలంలో చౌక డిపోల నిర్వహణలో సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ అన్నారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో 36 చౌక డిపోల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా చౌక డిపోల డీలర్ల సంఘం అధ్యక్షుడు గెడ్డం స్వామినాయుడు పలు సమస్యలను డిప్యూటీ తహశీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. మండలంలోని 38 చౌక డిపోలు ఉన్నాయని, వీటిలో రెండు షాపులు 6 ఎ కేసు నమోదు కావడంతో ఆయా షాపుల డీలర్లను తొలగించి డ్వాక్రా సంఘాల సభ్యులకు రేషన్ షాపుల నిర్వహణ అప్పగించారన్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్‌లో షాపుల అద్దెలకు, కళాసీలకే సరిపోవడం లేదని, దీంతో పలు సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని స్వామినాయుడు డీటీ దృష్టికి తీసుకువచ్చారు. అంతే కాకుండా రేషన్ డీలర్లపై తరచూ అధికారులు దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. అనంతరం డీటీ ఆనంద్ మాట్లాడుతూ సమస్యలన్నింటినీ జిల్లా అధికారులకు నివేదిస్తామన్నారు. రేషన్ షాపుల నిర్వహణలో గ్రామస్తుల సమస్యలను తెలియజేయాలన్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేడతామన్నారు. రెండు షాపుల డ్వాక్రా సంఘాల రేషన్ నిర్వహణ పోనూ మిగిలిన షాపుల్లో డీలర్ల కార్డుదారులందరికీ సక్రమంగా సరుకులు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. గత నెలలో రేషన్ సరుకులు పూర్తిగా పొందలేని వారి కోసం మూడు రోజుల కాల వ్యవధి, ఈనెలలో మరో ఐదు రోజులు పొడిగించడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో వివిధ డిపోలకు చెందిన డీలర్లు కొండబాబు, స్వామినాయుడు, మురళీతో పాటు పలువురు పాల్గొన్నారు.

పీవీటీజీలకు శతశాతం రాయితీ యూనిట్లు మంజూరు
కొయ్యూరు, సెప్టెంబర్ 22: ఏజన్సీ 11 మండలాలతో పాటు మైదాన ప్రాంతంలో ఎనిమిది మండలాల్లో ఉన్న పీవీటీజీలకు శతశాతం రాయితీ రుణాలు అందించనున్నట్లు పాడేరు ఐటీడీ ఎ స్ట్రైకర్ అసిస్టెంట్ ఎన్.సీతారామయ్య తెలిపారు. మండలంలో స్ట్రైకర్ రాయితీ రుణాలకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న పీవీటీజీ అభ్యర్థులకు శనివారం ఎంపీడీ ఓ కార్యాలయంలో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 2016-17, 2017-18 ఆర్ధిక సంవత్సరాలకు గాను అర్హులైన 487 మందికి శతశాతం రాయితీ రుణాలను అందించనున్నట్లు తెలిపారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో 288 యూనిట్లు శతశాతం రాయితీపై అందించామన్నారు. ప్రస్తుతం మండలంలో 92 మంది దరఖాస్తు చేసుకోగా 32 యూనిట్లు కేటాయించినట్లు తెలిపారు. 19 మండలాలకు సంబంధించి 1629 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈకార్యక్రమంలో మంప ఎస్సై శ్రీనివాసరావు అభ్యర్థుల తరపున ప్రత్యేకంగా పాల్గొన్నారు.