విశాఖపట్నం

21 నుంచి హామాళీల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూలై 12: గిరిజన సహకార సంస్థ (జి.సి.సి.)లో పనిచేస్తున్న హామాళీలంతా ఈ నెల 21వ తేది నుంచి సమ్మె చేపడుతున్నట్టు ఎ.ఐ.టి.యు.సి. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మన్మధరావు తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జి.ఒ.నెం.51 ప్రకారం హామాళీలకు ప్రభుత్వం కూలీ రేట్లు పెంచినప్పటికీ విశాఖ గిరిజన ప్రాంతంలో మాత్రం దీనిని అమలు చేయడం లేదని చెప్పారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు మైదాన ప్రాంతంలో పనిచేస్తున్న హామాళీలకు పెంచిని కూలీ రేట్లు చెల్లిస్తుండగా ఏజెన్సీలో పనిచేస్తున్న వారిని విస్మరిస్తున్నారని ఆయన అన్నారు. తమకు పెంచిన కూలీ రేట్లు వర్తింపచేయాలని అధికారులకు గతంలో పలుసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. దీంతో హామాళీలంతా సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై జి.సి.సి. ఉన్నత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని ఏజెన్సీలో పనిచేస్తున్న హామాళీలకు జి.ఒ.నెం 51 ప్రకారం కూలీ రేట్లు చెల్లించాలని మన్మధరావు కోరారు.

వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి
అరకులోయ, జూలై 12: ప్రాణాంతక వ్యాధుల నివారణ బృందాలు సమన్వయంతో పనిచేయాలని సహాయ కలెక్టర్ కె.దినేష్‌కుమార్ సూచించారు. అరకులోయ పట్టణంలో ప్రబలుతున్న పలు రకాల వ్యాధుల నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకంగా నియమితులైన ఆయన గురువారం పారిశుధ్య పనులు పరిశీలించారు. పట్టణంలోని సి.కాలనీలో మలేరియా, వైద్య ఆరోగ్య శాఖ, పెదలబుడు పంచాయతీ అధికారులతో పర్యటించిన ఆయన పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య, రెవిన్యూ, విద్యా శాఖ సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలు కలిసికట్టుగా అన్ని వీధులలో పర్యటించి పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్య చర్యలపై అవగాహన కల్పించాలని చెప్పారు. పట్టణంలో పారిశుధ్య మెరుగుపై బృందాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. పర్యాటక కేంద్రంగా ఖ్యాతిగాంచిన అరకులోయ పరిసరాల్లో పారిశుధ్య పరిస్థితులు క్షీణించడం వలన వ్యాధులు ప్రబలుతున్నాయని, ఈ వ్యాధులను నివారించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. పట్టణ వాసులలో కూడా ప్రాణాంతక వ్యాధుల పట్ల అవగాహన కలిగి మురుగు కాలువలలో పేరుకుపోయిన నీటిని, చెత్తా చెదారాలను తొలగించాలని ఆయన అన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. పట్టణంలో జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందచేస్తున్నామని ఆయన అన్నారు. ఇంతవరకు తాము గుర్తించిన గ్రామాలలో చంద్రన్న సంచార వైద్య బృందం ద్వారా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. సాధికార మిత్ర పరిధిలో ఉండే కుటుంభాలకు డెంగ్యూ నివారణ మందులు పంపిణీ చేస్తున్నట్టు దినేష్‌కుమార్ తెలిపారు. అంతకుముందు అరకులోయ పట్టణంలో దోమలపై దండయాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి మండల రెవిన్యూ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. స్థానిక నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి వ్యాధి నివారణపై పలు నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో తాహశీల్ధార్ అరుణ, ఎం.పి.డి.ఒ. ఎం.విజయకుమార్, పెదలబుడు పంచాయతీ కార్వనిర్వహణ అధికారి అచ్చుతరావు, సర్పంచ్ సమర్డి గులాబి, వైద్యాధికారులు, సిబ్బంది, కార్యదర్శులు, ప్రదానోపాధ్యాయులు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.