విశాఖపట్నం

14న నగరంలో జగన్నాథస్వామి రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 12: నగరంలో టౌన్ కొత్తరోడ్డులో ఉన్న జగన్నాథస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 24 వరకు వార్షిక జగన్నాథస్వామి కల్యాణ రథయాత్ర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి బండారు ప్రసాద్ తెలిపారు. గురువారం దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 184 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్న జగన్నాథ దేవస్థానంలో 1864 నుంచి రథయాత్ర మహోత్సవాలను అత్యంత ఘనంగా జరుపుతున్నామన్నారు. ఈ ఏడాది రథోత్సవ సంబరాలను ఈ నెల 14వ తేదీన శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ప్రారంభిస్తారన్నారు. 11వ ప్రతిష్ట ప్రారంభ సంకల్పం, 13న జగన్నాథస్వామి నేత్రోత్సవం, ప్రతిష్టాత్మ సుభద్రాదేవి శాంతి కల్యాణం నిర్వహిస్తారన్నారు. 14వ తేదీన స్వామి తొలి రథయాత్ర టౌనుకొత్తరోడ్డు దేవాలయం నుంచి టర్నర్ చౌట్రీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తామన్నారు. 15నుంచి 23 వరకు దేశ అవతార ఉత్సవాలు టర్నర్ చౌట్రీ లోకకల్యాణ మండపంలో మొదలవుతాయన్నారు. 15వ తేదీన మత్స్యావతారం, 16న కూర్మావతారం, 17న వరహావతారం, 18న నృసింహవతారం, 19న వరహాతావరం, 20న పరశురామావతారం, 21న రామావతారం, 22న కృష్ణావతారం, 23న శేషపాన్పు అవతారాలు ఉంటాయన్నారు. అలాగే ఈ నెల 15వ తేదీ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

కొబ్బరితోటలో ఎమ్‌పీఎం ట్రస్టు వైద్య శిబిరం
* 800 మందికి పైగా ఉచిత వైద్యం
విశాఖపట్నం, జూలై 12: రాష్ట్ర శాసనమండలి సభ్యుడు డాక్టర్ ఎమ్‌వివిఎస్ మూర్తి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎమ్‌పీఎమ్ ట్రస్టు ఇటీవల ఎన్‌టిఆర్ సేవా సమితి ట్రస్టుతో కలసి గురువారం స్థానిక కొబ్బరితోటలోని 29వ వార్డు కమ్యూనిటీ హాల్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వీలు కలుగుతుందని, సకాలంలో వైద్యం పొందడానికి అవకాశం ఉంటుందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించడమే లక్ష్యంగా ఎమ్‌పీఎమ్ ట్రస్టు ఉచిత వైద్య శిబిరాల నిర్వహణపై దృష్టి నిలిపిందన్నారు. కలుషిత వాతావరణం కారణంగా కంటి సమస్యలతోపాటు వివిధ రకాల రోగాలతో సతమతవుతున్న స్థానికులు ఈ వైద్యసేవలు పొందాలన్నారు. ఈశిబిరంలో మూత్రపిండాల సమస్యలు, స్ర్తిల సమస్యలు, క్షయ, మోకాళ్ళలో అరుగుదల, గుండె జబ్బులకు, పరీక్షలు జరిపారు. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా స్థానికులలో అధిక శాతం మంది కంటి సమస్యలు, వినికిడి సమస్యలతో బాధ పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. గీతం దంత వైద్య కళాశాల ఆసుపత్రి, జిమ్‌పర్ ఆసుపత్రి వైద్య నిపుణులు, పెద్దఎత్తున సిబ్బంది వైద్య శిబిరాలలో పాల్గొన్నారు. కాగా గురువారం 220 మందికి దంత పరీక్షలు, 150 మందికి కంటి వైద్య పరీక్షలు, 200 మంది స్ర్తి సంబంధిత పరీక్షలు, 250 మంది సాధారణ పరీక్షలు నిర్వహించినట్టు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసరి సత్యనారాయణ, వి.రామ్‌కుమార్, ఎన్.నాగేశ్వరరావు, పి.అప్పన్న, ట్రస్ట్ నిర్వాహకులు ఆళ్ళ శ్రీనివాసు, పీ.వీ రామారెడ్డి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రోడక్ట్ డిజైన్‌పై గీతంలో వర్క్‌షాప్
విశాఖపట్నం, జూలై 12: పారిశ్రామిక రంగంలో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయడంలో గల మెళుకువలను తెలియజేయడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగే మూడు రోజుల వర్క్‌షాప్ ‘ప్రోడక్ట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్’ గురువారం ప్రారంభమైంది. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో గల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వర్క్‌షాప్ రిసోర్స్ పర్సన్‌గా న్యూజెర్సీలోని బెక్టాన్ డికిన్‌సన్ సంస్థ పరిశోధన-అభివృద్ధి విభాగం నిపుణుడు డాక్టర్ పల్లా త్రివిక్రమ్ భానోజీరెడ్డి హాజరయ్యారు. ఆలోచనలకు రూపం ఇవ్వడంలో ప్రొడక్ట్ ఇంజనీర్లు పాత్ర కీలకమని దీనికి క్యాడ్, కామ్ సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే వినియోగదారులకు అవసరమైన విధంగా ఉత్పత్తులు అభివృద్ధి చేయవచ్చునన్నారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎమ్‌ఆర్‌ఎస్ సత్యనారాయణ, ప్రోగ్రామ్ కన్వీనర్లు ఆర్.్భనుపవన్, కోదండరావు తదితరులు పాల్గొన్నారు.