విశాఖపట్నం

చంద్రన్న పరిహారం పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమునిపట్నం, అక్టోబర్ 16: స్థానిక 18వ వార్డులో ఇటీవల మరణించిన పాలుపల్లి రమణ తరుపున అతని కుటుంబ సభ్యులుకు మంగళవారం చంద్రన్న భీమా పరిహారం రూ.30వేలు పంపిణీ చేయబడింది. తెలుగుదేశం పార్టీ భీమిలి డివిజన్ అధ్యక్షుడు గంటా నూకరాజు చేతులమేదగా జరిగిన కార్యక్రమంలో భీమామిత్ర వెంకటలక్ష్మి, పార్టీ నాయుకులు కాసరపు నాగరాజు, మారోజు సంజీవ్‌కుమార్, గూడపు రాజు, ఎన్.వెంకటరావు, శరత్ తదితరులు పాల్గొన్నారు.

విద్యాలక్ష్మీగా కనకమహాలక్ష్మీ అమ్మవారు
జగదాంబ, అక్టోబర్ 16: నగరంలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవములో భాగంగా మంగళవారం అమ్మవారు విద్యాలక్ష్మీగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో ఆలంకరించి ప్రత్యేకపూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎస్.జ్యోతిమాధవి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహాణాధికారి రాంబాబు, సూర్యకుమారి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది.
* శ్రీ శారదాపీఠంలో...
విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి వేడుకలు ఏడోవ రోజు మంగళ వారం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పర్యవేక్షణలో ఉత్తర పీఠాధిపతి శ్రీ బాలస్వామి ఆధ్వర్యంలో గురువందనంతో ఉత్సవాలు ప్రారంభించారు. అనంతరం కలశ స్థాపన, మండపారాధన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా పండితులు నిర్వహించారు. నేటి ఉదయం చండీహోమం, శ్రీచక్రార్చన అంత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి పాలాభిషేకం, విశేషాభిషేకం నిర్వహించారు.
* కాళీమాత ఆలయంలో
దసరా ఉత్సవాల్లో భాగంగా ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయంలో వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ ట్రస్టీ సుదీప్త బెనర్జీ పర్యవేక్షించగా, ప్రధాన అర్చకులు వెంపరాల భాస్కర సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు.
* కన్యకాపరమేశ్వరి ఆలయంలో
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోఅమ్మవారిని గంగాదేవిగా ఆవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.వివిధ రకాల పూలతో అమ్మవారిని ఆలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ అస్థాన పురోహితులు ఆర్‌బిబి కుమార్ నేతృత్వంలో ఉత్సవ కమిటీ సభ్యులు రాము, కార్యదర్శి పూసర్ల సురేష్ కుమార్ తెలిపారు.
* శ్రీ మహాకామేశ్వరి పీఠంలో
పెందుర్తి సాధుమఠం శ్రీ మహాకామేశ్వరి పీఠంలో శరన్నవరాత్రి మహోత్సావాల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారికి గోపూజ, కోటి కంకుమర్చాన, కాలదోష నివారణ మహాయజ్ఞమును మహర్షి యద్దనపూడి అయ్యన్నపంతుల గారిచే శ్రీదేవి నవావరణార్చన, అమ్మవారికి పుష్పాలంకార సేవ, ధశివిధ హారతలు నిర్వహించారు. సాయంత్రం ఊంజల్‌సేవ, ఉయ్యాలోత్సవము నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేపట్టారు.
* ఈస్ట్‌పాయింట్ కాలనీ షిర్డీ సాయి ఆలయంలో
నగరంలోని చినవాల్తేరు ఈస్ట్ పాయింట్ కాలసీ షిర్డీ సాయి ఆలయంలో మంగళవారం దసరా నవరాత్రి మహోత్సావాలల్లో భాగంగా విశేష పూజలు చేశారు. అధికం సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు రామకృష్ణ, మణిధర్ తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారుల వలలు పంపీణీ చేసిన ఎమ్మెల్యే
జగదాంబ, అక్టోబర్ 16: పేద మత్స్యకారుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వాటిని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకొవాలని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ అన్నారు.నగరంలో షిషింగ్ హార్భర్‌లో మంగళవారం పలువురు మత్స్యకారులకు ప్రభుత్వం రాయితీతో అందించిన వలలు, ఇంజిన్లు, ఇతర పరికరాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లి తాతారావు అనే మత్స్యకారుడుకు 50శాతం సబ్సిడీతో ఐదు లక్షల ఖరీదు చేసే బోటు, వలలును అందించామన్నారు. మత్స్యకారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. స్పీడ్‌బోట్లును ట్యూనా లింగ్ లైనర్‌గా మార్చుకోవడానికి 43 మంది మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో రూ.15 లక్షల చొప్పున అందిస్తామని వారంతా బోటు ఓనర్లుగా మారాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ లక్ష్మణరావు, ఎఫ్‌డివో విజయ, పీసీ అప్పారావు, మున్నం బాలజీ, కొండబాబు, తాతాజీ, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు.

స్వైన్‌ప్లూపై ప్రజలల్లో అవగాహన కల్పించాలి
జగదాంబ, అక్టోబర్ 16: వాతావరణంలో మార్పులతో సంభవిస్తున్న విషజ్వరాలు,స్వైన్‌ప్లూ నివారణ పట్ల ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించి, వ్యాధి తీవ్రతను ఆరికట్టాలని నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ జహీర్ ఆహ్మద్ అన్నారు. జగదాంబ జంక్షన్‌లో మంగళవారం స్వైన్‌ప్లూపై అవగాహన, మాస్క్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే డెంగ్యూ జ్వరాలతో అతలాకుతలం అవుతున్న విశాఖలో నెల రోజుల నుంచి స్వైన్‌ప్లూ కేసులు పెరుగుతున్నాయన్నారు. వాతావరణంలో మార్పులు, పారిశుధ్యంతో రోగాలు వృద్ధి చెందుతున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి జన సంద్రత ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యాక్రమాలు, మాస్క్‌లు పంపిణీ, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు కూడా చుట్టుప్రక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొవడం ఆహరం తీసుకున్నప్పుడు చేతులు శుభ్ర పర్చడం, జన సంద్రత ఎక్కువుగా ఉన్న ప్రదేశాలు, తుమ్మిన దగ్గినా, మాస్క్‌లు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీ ఎస్ ఆగర్వాల్, చింతపల్లి పోతరాజు, స్వామి వివేకానంద స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.